TG: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ | Telangana High Court Gives Green Signal for Group 1 Mains | Sakshi
Sakshi News home page

TG: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Published Tue, Oct 15 2024 11:03 AM | Last Updated on Tue, Oct 15 2024 2:03 PM

Telangana High Court Gives Green Signal for Group 1 Mains

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు.

ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలిగింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్

ఇదీ చదవండి: TG: డీఎస్సీ టీచర్‌ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా


హైకోర్టు తీర్పు నిరాశ కలిగిందని గ్రూప్‌-1 అభ్యర్థులు అంటున్నారు. కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయాం. మెయిన్స్‌లో ప్రిపరేషన్‌కు కొంత సమయం ఇవ్వాలి. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement