
వాగ్గేయకారిణి అమ్మ కొండవీటి జ్యోతిర్మయి
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతమున్న పాలకమండలిని రద్దు చేయాలని వాగ్గేయకారిణి అమ్మ కొండవీటి జ్యోతిర్మయి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ధార్మిక వ్యవస్థపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక వ్యవస్థలో రాజకీయవేత్తల ప్రమేయాన్ని నియంత్రించాలన్నారు. రాజీకీయ, సినీ ప్రముఖుల వలన ధార్మిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు.
ధార్మిక సంస్థల్లో పాలక మండలి పేరు మార్చి ధార్మిక సేవా సమితిగా నామకరణం చేయాలని కోరారు. సేవాభావం ఉన్న వాళ్లకే ధార్మిక సంస్థల్లో చోటు కల్పించాలన్నారు. తిరుమల చుట్టూ 25 కిలోమీటర్ల వరకు మద్యం, మాంసం విక్రయాలు నిషేధిస్తూ జీవో తేవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment