
బీజేపీ రాష్ర్ట కార్యదర్శి జి. భాను ప్రకాశ్ రెడ్డి
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నారావారి దేవస్థానంగా మారిపోయిందని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ర్ట కార్యదర్శి జి. భాను ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. శ్రీవారి సేవా టికెట్ల పేరుతో తిరుమల జేఈఓ కార్యాలయం కేంద్రంగా లక్షల రూపాయలు రోజూ చేతులు మారుతున్నాయని ఆరోపించారు. టీటీడీని కొంతమంది సిబ్బంది దళారీ క్షేత్రంగా మార్చేశారని మండిపడ్డారు.
గత నెల 27వ తేదీన జేఈఓ టికెట్ల తనిఖీలో జరిగిన విచారణ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తోన్న కొంతమంది సిబ్బందికి సేవా టిక్కెట్ల కుంభకోణంలో ప్రమేయముందని ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment