‘ఇలా కాకుండా వచ్చే పుష్కరాలకైనా పుష్కలమైన నీటిలో పవిత్ర స్నానాలు చేద్దాం’ అని త్రిదండి రామానుజ చిన జియర్‌స్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో నీటిని చేతులతో చూపిస్తూ అన్నారు. మానవుని చర్యల వల్ల నదికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అందుకే నదిని కలుషితం చేయకుండా స్నానాలు చేయాలని ఆయన భక్తులకు సూచించారు. తాడేపల్లి సమీపంలోని సీతానగరం ఘాట్ వద్దకు శుక్రవారం వేకువజామున భక్తులతో కలిసి కృష్ణానదికి చేరుకున్నారు. ఆశ్రమంలోని వేదవిశ్వవిద్యాలయం విద్యార్థులు, స్వామీజీలతో కలిసి సీతానగరం ఘాట్ వద్ద గోమాతకు, భూదేవికి, నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా పుష్కరాల విశిష్టత గురించి భక్తులకు వివరించారు. సూర్యోదయం స్నానం మంచిదని, అందుకే ఎక్కువ మంది భక్తులు ఉదయమే పవిత్రస్నానాలు చేస్తారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో భక్తులు స్నానం చేయగా.. చిన జియర్‌స్వామి మాత్రం ప్రవహించే నదివద్దకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్రస్నానం చేశారు.
‘వచ్చే పుష్కరాలకు పుష్కలమైన నీటిలో స్నానాలు చేద్దాం’
Published Fri, Aug 12 2016 7:49 PM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement