tridandi Chinna jeeyar swamy
-
'చీర్ అప్ భారత్' పోస్టర్ ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
హైదరాబాద్ : ఈనాటి సమాజంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా వారి వారి పనుల ఒత్తిడి వల్ల మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. కేవలం కళల ద్వారానే ఈ పరిస్థితి నుంచి బయటపడటం సాధ్యమవుతుందని భావించి సిరిమువ్వ ఆర్ట్స్ బృందం వారు 'చీర్ అప్ భారత్(invoking inner happiness)' అనే ఒక కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరిమువ్వ ఆర్ట్స్ వారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల వారికి ఉచితంగా నృత్యకళలో శిక్షణ ఇచ్చి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి వారికి మెగా డాన్స్ షో ద్వారా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఐదు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమం ఆరో సీజన్లో భాగంగా ఈ రోజు చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా 'చీర్ అప్ భారత్' లోగోను వారి ఆశ్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఒక మనిషిలోని సంతోషాన్ని బయటకి తీసుకురావడం సాధారణంగా జరిగే పని కాదు కానీ ఒక కళ ద్వారా మాత్రమే ఆ సంతోషాన్ని బయటకు తీసుకురాగలం అన్నారు. ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ లోగోను నా చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిమువ్వ ఆర్ట్స్ డైరెక్టర్స్ వై. మధుసూదన్ రావు, వై. తులసి, ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డాన్స్ మాస్టర్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు -
ఆ సిద్ధాంతాల అవసరం ఇప్పుడే ఎక్కువ!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగబోవడం... రాష్ట్ర, దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రపంచ మేధావులను, ఆధ్యాత్మికవేత్తలను, పండితులను ఆలోచింపచేస్తుంది. పరంపరాగతమైన భారతీయ తాత్విక చింతన గురించి మరొకసారి విశ్లేషణలు వెల్లివిరుస్తాయి. ఈ మధ్యన జీయర్‌స్వామి రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. రామానుజాచార్యుల బోధనల అవసరం వేయి సంవత్సరాల క్రితం సమాజానికి ఎంత ఉండిందో... ఈ కాలానికి అంతకన్నా ఎక్కువ అవసరమైన పరిస్థితి ఏర్పడ్డది. వారు సశాస్త్రీయంగా బోధించిన సామాజిక సమరసా సిద్ధాంతం అన్ని వర్గాల, మతాలకు చెందిన వారికి శిరోధార్యం. ఆనాడు వారు తీసుకున్న భక్తి గమనము, ఎంతోమంది సాధు సంతులను, ప్రజలను, ముఖ్యంగా రామానంద ద్వారా కబీర్ దాస్‌లాంటి వాళ్లను ప్రభావితం చేసి దేశ సమగ్రతకు, సమైక్యతకు తోడ్పడ్డాయి. ఈ సంప్రదాయానికే చిన జీయర్‌స్వామి కొంత సుగం ధాన్ని, మరికొంత సువర్ణాన్ని పూసి సరళమైన భాషలో, స్పష్టమైన భావాలతో చేసిన ప్రసంగాలతో లక్షలమందిని ఆకర్షించారు. ‘‘నీ తల్లిని ప్రేమించు, ఇతరుల తల్లులను గౌరవించు’’ అన్న చిన్న పదాలు– వర్గాలను, కులాలను, మతాలను కలిపి స్వామీజీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు బాట వేసి వేలమందికి విద్య, ఉపాధి పొందే అవకాశాలను కల్పిస్తున్నాయి. మరొకవైపు స్వామి భక్తి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ, సాంస్కృతిక జీవనంలో ఒక కొత్త దనాన్ని తెచ్చాయి. ఈ మధ్యన నిర్వహించిన ఒక సర్వేలో 27 శాతం భారతీయులు – హిందువులలో అత్యధి కంగా 30 శాతం, సిక్కులలో 23 శాతం, ముస్లింలలో 18 శాతం మంది అంటరానితనాన్ని పాటిస్తున్నారని ఎన్సీఏఈఆర్ నివేదికలో చెప్పారు. వివిధ నివేదికలను పూర్తిగా లెక్కలోకి తీసుకోలేకున్నా... అంటరానితనం ఇంకా ఉన్నదనేది నిర్వివాదం. ఆది శంకరుడు, రామానుజుడు, బసవేశ్వరుడు, వివేకా నందుడు, నారాయణగురు, బ్రహ్మనాయుడు లాంటి వారెం దరో మన మనస్సులలో సుప్రతిష్ఠితులు. వీరందరూ కులాల, మతాల వివక్షలను నిర్ద్వంద్వంగా ఖండించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ఒకవైపు రాజ్యాంగం నిర్దేశించినా... పరువు హత్యలు సమాజానికి సవాలుగా మారాయి. ఈ మధ్యన సుప్రీం కోర్టు ఈ కులరక్కసిని అంతమొందించటానికి ఆదేశాలు జారీ చేసి, వాటి అమలుకు కార్యాచరణను రూపొందించింది. రాజస్థాన్ ప్రభుత్వమైతే మరణ శిక్షను విధిస్తూ చట్టం చేసింది. కానీ కొందరు మతాంతర వివాహమే మరణ శాసనమని భావిస్తూ బ్రతుకుతున్నారు, మరికొందరు మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘హిందూ’ అన్నపదం, ఇటు రాజకీయాలలో, చట్టసభలల్లో, సమాజంలో కేంద్ర బిందువుగా మారుతున్నది. హిందూ అన్న పదం సాంస్కృ తిక భావన అని దాదాపు అన్ని వర్గాలు ఆలోచించే శుభ పరిణామాన్ని చూస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్, సాంస్కృతిక జాతీయవాదానికి అనుగుణంగానే 1956లో పెద్ద సంఖ్యలో అనుచరులతో కలసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూ సమాజంలో అమానవీయంగా విలయతాండవం చేసిన అస్పృశ్యత వంటి రుగ్మత లకు నిరసనగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మతాలకు మారవలసిందిగా ఎందరో ఆయనను ప్రలోభ పెట్టారు. అయితే ఈ మతాలకు మారడం అంటే భారతదేశ సంస్కృతి నుండి దూరం కావడమే అనే అద్భుత ప్రకటన చేశారు. దీనికి యావత్ భారతదేశం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సిందే. వివేకానందుడు 1898 జూన్ 10 నాడు తన మిత్రుడు మహమ్మద్ సర్ఫరాజ్ హుసేన్‌కు రాసిన లేఖను డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ ఉటంకించారు. ఎంతో విశ్లేషణాత్మకమైన ఉత్తరంలో మన మాతృభూమికి హిందూ, ముస్లిం అనే రెండు గొప్ప మతాల కూడలిలో... వేదాంతం బుద్ధి అయితే, ఇస్లాం శరీరం అని రాశారు. దీన్ని అర్థం చేసుకొని హిందువులు, ముస్లిములు ఐక్యంగా ఉండి మళ్ళీ ఈ దేశ ఉజ్జ్వల భవిష్యత్తును రాబోయే తరాలకు అందించాలని కోరారు. 1995 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పులో హిందూ అన్న పదానికి సంబంధించిన అయోమయాన్ని తొలగించి స్పష్టమైన తీర్పునిచ్చింది. హిందూ, హిందుత్వ, హిందూయిజం అన్న పదాలకు నిర్దిష్టమయిన అర్థాన్ని చెప్పలేమని, అయితే ఆ పదం నుంచి భారతీయ సంస్కృతీ పరంపరను, వారసత్వ సంపదను వేరుచేసి సంకుచిత మతానికి పరిమితం చేయలేమని, అది ప్రజల జీవన విధానమని స్పష్టం చేసింది. హైదరాబాదులో ఒక సమావేశంలో సాంస్కృతిక జీవన విధానాన్ని సమర్థిస్తూ ఆర్చ్ బిషప్ ఎస్. అరుళప్ప ‘జన్మతః నేను భారతీయుడిని. సంస్కృతిపరంగా నేను హిందువును. విశ్వాసం రీత్యా క్రైస్తవుడిని’ అని హర్షధ్వానాల మధ్యన ప్రకటించారు. స్వామి వివేకానందునికి ఇష్టమైన సూక్తి – ‘‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’’. యువత వేగవంతంగా ముందుకు తీసుకుపోవలసిన స్పూర్తిని రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ ఇస్తుందని ఆశిద్దాం. - సీహెచ్ విద్యాసాగర రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
అయోధ్యకు ఆహ్వానం అందింది
సాక్షి, భద్రాచలం: ఇటీవల అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, అయితే తాను చాతుర్మాస దీక్షలో ఉన్నందున వెళ్లలేకపోయానని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి వెల్లడించారు. శుక్రవారం ఆయన అహోబిల రామానుజ స్వామివారితో కలిసి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మొదట గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. తమ తాతగారు నిర్మించిన క్రతు స్తంభం, రామకోటి స్తంభం, దాశరథి శతక స్తంభాలను దర్శనం చేసుకున్నారు. అనంతరం గాలి గోపురం వద్ద ఆలయ ఈఓ ఎల్.రమాదేవి జీయర్‌స్వామి వారికి పూలమాల అందించి స్వాగతం పలికారు. అర్చకులు రామయ్య తండ్రి శేషమాలికలను ధరింపజేసి, పట్టువస్త్రంతో పరివట్టం కట్టి లోపలికి తీసుకెళ్లారు. గాలిగోపురం వద్ద ఉన్న పల్లకిలో బంగారు శఠారికి నమస్కరించిన జీయర్ స్వామి.. ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత లక్ష్మీతాయారమ్మవారిని, భద్రుడి కోవెలలో ఉన్న రామయ్య పాదాలు, సుదర్శన చక్రం, ఆళ్వార్లు, ఆండాళమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గర్భాలయంలో ఉన్న మూలమూర్తులకు ఫల, పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జీయర్‌స్వామి మాట్లాడుతూ.. 60 రోజుల పాటు చాతుర్మాస వ్రతం పూర్తి చేసుకున్న సందర్భంగా సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. వచ్చే ఆశ్వయుజ మాసం నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక రామ క్రతువు కార్యక్రమం చేపడుతున్నామని, ఇది నిర్విఘ్నంగా జరగాలని భద్రాద్రి రామయ్యను వేడుకున్నానని చెప్పారు. ఈ ఏడాది చివరి వరకూ కరోనా ఉంటుందన్నారు. ఆయన వెంట ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి, మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, జీయర్ మఠం నిర్వాహకులు వెంకటాచార్య, చక్రవర్తి, వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు రోజారమణి, ఉప ప్రధానార్చకులు అమరవాది మురళి, ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్‌రాజు, సీసీటూ ఈఓ అనీల్ తదితరులు ఉన్నారు. -
‘వచ్చే పుష్కరాలకు పుష్కలమైన నీటిలో స్నానాలు చేద్దాం’
‘ఇలా కాకుండా వచ్చే పుష్కరాలకైనా పుష్కలమైన నీటిలో పవిత్ర స్నానాలు చేద్దాం’ అని త్రిదండి రామానుజ చిన జియర్‌స్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో నీటిని చేతులతో చూపిస్తూ అన్నారు. మానవుని చర్యల వల్ల నదికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అందుకే నదిని కలుషితం చేయకుండా స్నానాలు చేయాలని ఆయన భక్తులకు సూచించారు. తాడేపల్లి సమీపంలోని సీతానగరం ఘాట్ వద్దకు శుక్రవారం వేకువజామున భక్తులతో కలిసి కృష్ణానదికి చేరుకున్నారు. ఆశ్రమంలోని వేదవిశ్వవిద్యాలయం విద్యార్థులు, స్వామీజీలతో కలిసి సీతానగరం ఘాట్ వద్ద గోమాతకు, భూదేవికి, నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా పుష్కరాల విశిష్టత గురించి భక్తులకు వివరించారు. సూర్యోదయం స్నానం మంచిదని, అందుకే ఎక్కువ మంది భక్తులు ఉదయమే పవిత్రస్నానాలు చేస్తారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో భక్తులు స్నానం చేయగా.. చిన జియర్‌స్వామి మాత్రం ప్రవహించే నదివద్దకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్రస్నానం చేశారు.