దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం... | It was just a holy shower at Durga Ghat | Sakshi
Sakshi News home page

దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం...

Published Tue, Aug 9 2016 7:04 PM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

It was just a holy shower at Durga Ghat

- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
సాక్షి, అమరావతి 
 ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో పుష్కర స్నానమాచరిస్తారు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటు జరుపుకొనే వేడుకను పుష్కరం అంటారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడు. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయకూడదనే నిబంధన ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో స్నానం చేస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానంతో పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి.
 
అదే సమయంలో సీఎం చంద్రబాబు కూడా స్నానం చేస్తారు. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. దుర్గాఘాట్ వీఐపీ ఘాట్ కావడంతో వారు అక్కడ స్నానం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 62వేల మంది ఉద్యోగులు పుష్కరాల్లో సేవలందిస్తున్నట్లు వివరించారు. వీరంతా 1120 ప్రాంతాల్లో ఉంటారన్నారు. అత్యవసర సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయని, విజయవాడ నగరంలో మొత్తం ఏడు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఘాట్‌కు ఒక రిఫరల్ ఆస్పత్రిని గుర్తించినట్లు తెలిపారు. ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే ఆయా ఆస్పత్రులకు తరలిస్తామని చెప్పారు. పది లక్షల మంది పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
 
 
ఎవరైనా తప్పిపోతే సులభంగా తెలుసుకోవచ్చునని చెప్పారు. 54 స్వచ్ఛంద సంస్థలు భోజనాలు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. విజయవాడ నగరంలో 60 ప్రాంతాల్లో అన్నప్రసాదాలు పెడతారని తెలిపారు. ప్రతి ఘాట్‌కు ఒక ఇన్‌చార్జి ఉంటారని, మల్టీ డిసిప్లెయినరీ టీం కూడా ప్రతి ఘాట్‌కు ఉంటుందని వివరించారు. మొత్తం 45 పుష్కర నగర్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అక్కడ్నుంచి నిత్యం ఘాట్లకు రోజుకు 400 బస్సులు తిరుగుతాయని, స్నానాలు పూర్తిచేసుకున్న తర్వాత తిరిగి పుష్కర్‌నగర్‌లో వారిని బస్సుల్లో దించుతారని వివరించారు. 380 రైళ్లు కొత్తగా వేస్తున్నట్లు తెలిపారు.
 
400 మంది అధికారుల వద్ద వాకీటాకీలు ఉంటాయని, ప్రతి క్షణం ఒకరితో ఒకరు మాట్లాడి సమాచారాన్ని పంచుకుంటారని చెప్పారు. 26 సెల్ టవర్స్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 1400 సీసీ టీవీలు ఏర్పాటు చేసి మానిటరింగ్ సిస్టంను నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఏ సమాచారం కావాలన్నా తగిన ఫోన్ నంబర్లు, అధికారుల వివరాలతో ఒక పుస్తకం ప్రచురించామని, ఆ పుస్తకాలు ఘాట్ల వద్ద అందుబాటులో ఉంటాయని చంద్రుడు తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement