కాలుష్య కాటు | Pollution bite | Sakshi
Sakshi News home page

కాలుష్య కాటు

Published Sat, Aug 29 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

కాలుష్య  కాటు

కాలుష్య కాటు

విజయవాడ : తెల్లగా, స్వచ్ఛంగా ఉండే కృష్ణానది నీరు రంగు మారుతోంది. జీవనది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నిత్యం వేల గ్యాలన్ల మురుగునీరు, టన్నుల కొద్దీ చెత్త కృష్ణలో కలుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజల అలక్ష్యం వెరసి కృష్ణమ్మ పాలిట శాపంగా మారింది. పండుగలు, పుణ్యతిథుల్లో  పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు నదిలో వదిలే చెత్త టన్నులకొద్దీ పేరుకుపోయి నీరు కలుషితమవుతోంది. ఇదికాక పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు తిన్నగా నదిలోకి కలవడంతో మరో మూసీగా మారే ప్రమాదం ఉంది. కనీసం ఇప్పటినుంచైనా నదిని పరిశుభ్రంగా ఉంచగలిగితే వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలు సవ్యంగా జరుగుతాయి. లేదంటే మురికినీటిలో స్నానమాచరించలేక ఆ నీటిని నెత్తిన చల్లుకోవాల్సిందే.

చర్మ సంబంధ సమస్యలు రాకుండా..
ఇటీవలి గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన క్రమంలో ఈకోలి బాక్టీరియా శాతం     నీటిలో తీవ్రంగా ఉందని, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ యంత్రాంగమే ప్రకటించింది.  జిల్లాలో ఎగువన జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల వద్ద  నుంచి దిగువన అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వద్ద కృష్ణనీరు సముద్రంలో కలుస్తుంది. జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఏడాది పొడవునా 12 అడుగుల మేర 3 టీఎంసీలు నిల్వ ఉంటుంది. అలాగే ఎగువన గుంటూరు జిల్లాలోని పులిచింతల వద్ద 45 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది.  నీరు ప్రవాహంలా కాకుండా నిల్వ ఉండడం వల్ల చెత్త వేయడంతో కలుషితం అవుతోంది. ఇప్పటినుంచే చెత్తను తొలగించి ‘స్వచ్ఛ కృష్ణ’గా మార్చితే పుష్కరాల నాటికి ఇబ్బంది ఉండదు.

మరుగుదారులన్నీ నదిలోకే
డ్రైనేజీ వ్యవస్థ మొదటి నుంచి సక్రమంగా లేదు. బందరు కాలువ, రైవస్ కాలువల్లోకి నగరంలోని అవుట్‌ఫాల్ డ్రైన్లు కలిపి ఉన్నాయి. దాదాపు 29 డ్రైన్లు పంట కాలువకు కలిసుండడంతో  మురుగుకాలువల్లా మారిపోయాయి.  ఇదే పరిస్థితి కృష్ణా నదికీ ఉంది. జగ్గయ్యపేటలో  సిమెంట్ ఫ్యాక్టరీలు నది నీటిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి.  భవానీపురం సమీపంలో నదీ కాలుష్యం అధికంగా ఉంది. కరకట్ట ప్రాంతం, భవానీ ఐలాండ్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, లోటస్ అపార్ట్‌మెంట్స్, చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో భారీ అవుట్‌ఫాల్ డ్రైన్లు నదిలోకి ఉన్నాయి. రోజుకి సగటున 10 వేల గ్యాలన్ల మురుగు నీరు కృష్ణానదిలో కలుస్తుంది.  తరచూ కురిసే భారీ వర్షాలకు కూడా నగరంలోని డ్రైన్లు పొంగి చివరకు కృష్ణలో కలుస్తున్నాయి. అధికారులు  నీటిని కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారుతప్ప ఆచరణలో  కనిపించడంలేదు.

తగ్గుతున్న బయోలాజికల్ ఆక్సిజన్
 కృష్ణా నది నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ శాతం తగ్గుతోంది. కాలుష్య నియంత్రణ మండలి శాఖలోని అధికారులు తరచూ నది నీటిని శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహిస్తారు.  ప్రకాశం బ్యారేజ్ వద్ద, గుంటూరు జిల్లాలోని అమరావతి వద్ద, ముక్త్యాల వద్ద నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా కృష్ణా నదికి, గోదావరి నదికి పూర్తి సారూప్యత ఉంది. కృష్ణా నదీ నీరు భూమిలో కలిసే స్వభావం లేకపోవటంతో నీరు ఎప్పుడు స్వచ్ఛంగా తెల్లగా కనిపిస్తుంది. గోదావరి నీరు పచ్చగా ఉంటుంది.   నీటిలో హైడ్రోజన్ శాతం 2014లో 7.8 శాతం ఉండగా 2015లో 7.7 శాతంగా ఉంది. డీసాల్ట్ ఆక్సిజన్ శాతం గత ఏడాది 6.7 శాతంగా ఉండగా ఈ ఏడాది 7.1 శాతానికి పెరిగింది.  బయోలాజికల్ ఆక్సిజన్ గత ఏడాది 0.6 శాతంగా ఉండగా ఇప్పుడు  0.5 శాతంగా నమోదయింది.  నీటిలో సోడియం లెవల్స్ గత ఏడాది 28 శాతం ఉండగా ఈ ఏడాది 33 శాతంగా నమోదయ్యాయి. నదిలో కాలుష్య శాతం గత ఏడాది 632 ఉండగా ఈఏడాది 532 శాతం ఉంది. హైడ్రోజన్ లెవల్స్ 7 శాతం వరకు ఉండవచ్చు. దాటితే నష్టం. అలాగే నదిలో నీటి కాలుష్యం 500 శాతానికి మించితే చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  నది నీటి ప్రవాహం నిరంతరం ఉంటే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నీరు నిల్వ ఉంటే ఫికల్ బ్యాక్టీరియా పెరిగి ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి.  నీటిని బ్యాక్టీరియా శుద్ధి చేస్తుంది కాబట్టి నీరు నిల్వ ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నార
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement