హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు | Hurting the feelings of Hindus | Sakshi
Sakshi News home page

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు

Published Sun, Jul 3 2016 7:35 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

Hurting the feelings of Hindus

విజయవాడలో రహదారుల విస్తరణ కోసం ప్రభుత్వం ఏకపక్షంగా ఆలయాలను ధ్వంసం చేయడం రాష్ట్రానికే అరిష్టమని శ్రీభువనేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సత్యానందభారతీస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం విజయవాడలో రాత్రికి రాత్రే 30కి పైగ దేవాలయాలను కూల్చివేయడం దారుణమన్నారు.

 

కనీసం పండితులు, హిందూ ధార్మిక సంస్థలను కూడా సంప్రదించకుండా చేస్తున్న విధ్వంసం కారణంగా అరిష్టాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం ఇంత పెద్దఎత్తునప్రచారం, ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. గోదావరి పుష్కరాలకు కూడా ఇదే విధంగా చేసిన కారణంగా తొక్కిసలాటలో ఎంతోమంది భక్తులు మృతి చెందారని గుర్తుచేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement