కృష్ణమ్మకు వెంకన్న సారె | From the beginning of the trip, the TTD Pushkarni | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మకు వెంకన్న సారె

Published Thu, Aug 4 2016 3:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

కృష్ణమ్మకు వెంకన్న సారె

కృష్ణమ్మకు వెంకన్న సారె

తిరుమల నుండి పుష్కర యాత్ర ప్రారంభం

తిరుమల: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సారె తరలి వెళ్లింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో కూడిన కల్యాణరథంలో బుధవారం ఈ సారెను పుష్కరయాత్రగా తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా టీటీడీ  చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలోని నమూనా ఆలయంలో ఈ నెల 7 నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ కల్యాణరథం 5న విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement