-నోటిఫికేషన్ జారీ ద్వారా అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం నుంచి ఆరంభమవుతాయని దేవాదాయ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీకి చెందిన ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతిని సంప్రదించిన తరువాత తేదీ ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 11వ తేదీ రాత్రి 9.21 గంటలకు బృహస్పతి నక్షత్రం కన్యారాశిలో ప్రవేశిసున్నందున మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కరాల నిర్వహణకు సిద్ధాంతి ముహర్తం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 23వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.