హైదరాబాద్: ఖమ్మంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటే అని చెప్పే క్రమంలో బీఆర్‌ఎస్.. బీజేపీ బీ టీం అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్‌ని చాలా మంది పప్పు అని పిలుస్తుంటారు.. కానీ అందుకు తగిన వ్యక్తేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలే ఏ టీం, బీ టీం అంటూ వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్య మంతనాలు జరిపిన మాట వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన ఫొటోలు చూపించాలా? అని అన్నారు.
భేటీ జరిగిందా?
టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. జాతీయ పార్టీలో చేరిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి.. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అయితే.. సాధారణంగా బీజేపీ లాంటి జాతీయ పార్టీల్లో ముందు నుంచి ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఎక్కువ. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న వారికి ప్రధాన బాధ్యతలను అప్పగిస్తారు.
పార్టీలో తనకు సరైన ప్రధాన్యత లభించట్లేదని ఈటల రాజేందర్ కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఖమ్మం సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఈటల ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. నిజానికి ఈటల, రేవంత్ రెడ్డి టచ్‌లోనే ఉన్నారనే రాజకీయ వర్గాల్లో వినికిడి ఉన్న నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి.
రాహుల్ గాంధీ.. ఓ రిమోట్ గాంధీ..
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఏంటో గుర్తెరిగి మాట్లాడాలని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిని స్ర్కప్టిను చదివి వెళ్లాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ రిమోట్ గాంధీ అని ఎద‍్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ హోదా ఏంటో తెలియదని అన్నారు. గతంలో తెలంగాణ కంటే ముందు పదేళ్లు కాంగ్రెస్ పాలించింది.. మరి అప్పుడు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ‍్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘వాపును చూసి.. బలుపు అనుకుంటున్న కాంగ్రెస్’ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment