సాక్షి, అమరావతి: షూటింగ్‌లు లేకనే పవన్ వారాహి యాత్ర చేపట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. వారాహి మీద పవన్‌ది టూర్ ప్యాకేజీనా?. అన్నవరం, భీమవరం బదులు చంద్రవరం యాత్ర అంటే బాగుంటుందని సెటైర్లు విసిరారు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతావా అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోయేప్పుడు ఏం చేశారు?. నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం మీరు ఎందుకు చేయలేదు, చంద్రబాబుకు సెల్ఫ్ డబ్బా ఎక్కువ అని పేర్ని నాని మండిపడ్డారు.
ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అయితే ఎందుకు వెన్నుపోటు పొడిచావ్.. ఆయనను పదవి నుంచి ఎందుకు దించేశావ్? అని పేర్ని నాని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యే వరకు హైటెక్ సిటీకి రోడ్డు ఉందా?.. హైటెక్ సిటీకి మౌలిక సదుపాయాలు వైఎస్సార్ కల్పించారన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్, ఓఆర్‌ఆర్ నిర్మాణం వైఎస్సార్ హయాంలోనే జరిగిందని పేర్ని నాని అన్నారు.
చదవండి:ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?
Comments
Please login to add a commentAdd a comment