‘నేను నోరు విప్పితే.. ఆమెకే నష్టం’ | Paras Chhabra Opens Up About dating Pavitra Punia | Sakshi
Sakshi News home page

పెళ్లైన విషయం దాచి.. నాతో డేటింగ్‌ చేసింది

Published Mon, Oct 5 2020 4:11 PM | Last Updated on Mon, Oct 5 2020 7:19 PM

Paras Chhabra Opens Up About dating Pavitra Punia - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 13 కంటెస్టెంట్‌ పరాస్‌ చబ్రా తన మాజీ ప్రియురాలు, బిగ్‌బాస్‌ 14 కంటెస్టెంట్‌ పవిత్ర పునియా గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ‘ఆమె తన పెళ్లి విషయం దాచి పెట్టి నాతో డేటింగ్‌ చేసింది’ అంటూ ఆరోపించాడు పరాస్‌. గతంలో పవిత్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరాస్‌ తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ అని తెలిపింది. దీనిపై అతడు స్పందిస్తూ.. ‘అవును ఆమె మాటలు నిజమే. ఎందుకంటే ఓ వివాహిత తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచి పెట్టి.. నన్ను ఫూల్‌ని చేయాలని చూసింది. అదృష్టం కొద్ది నేను ఈ బంధానికి ముగింపు పలికాను’ అన్నాడు. (బిగ్‌ బాస్‌: సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి?)

‘ఒక రోజు పవిత్ర భర్త నుంచి నాకు ఒక మెసేజ్‌ వచ్చింది. ‘మీరిద్దరు ఒకర్ని ఒకరు చాలా ఇష్టపడుతున్నారు. కలిసి జీవిద్దాం అనుకుంటున్నారు. ఇవన్ని జరగాలంటే నేను ఆమెకు విడాకులు ఇవ్వాలి’ అని మెసేజ్‌ చేశాడు. అది చూసి నేను షాక్‌కు గురయ్యాను. ఆ తర్వాత ఆరా తీయడంతో ఆమె పాత రిలేషన్స్‌ అన్ని తెలిసాయి. దాంతో ఆమె నుంచి విడిపోయాను. నేను గనక ఇప్పుడు వాటి గురించి నోరు విప్పితే.. ఆమె చాలా బ్యాడ్‌ అవుతుంది. ఆమెకే మంచిది కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. పరాస్‌, పవిత్ర మొదట ఓ రియాలిటీ షో ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత టీవీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రస్తుతం పవిత్ర పునియా పలు సీరియళ్లలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement