![Mogalirekulu Serial Actor Pavitranath Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/2/Daya-01.jpg.webp?itok=ONcnv6ly)
ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. మొగలిరేకులు సీరియల్‌లో దయగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్నవయసులోనే మరణించారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించింది. 'పవి.. ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం.. మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైనవాడివి. నీ మరణవార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. ఇది నిజం కాకూడదు.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.
చివరి చూపు కూడా..
కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్‌బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అయితే నటుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌లో పవిత్రనాథ్ ముఖ్యపాత్రలో నటించారు. 'మొగలిరేకులు' ధారావాహికలో ఇంద్రనీల్ తమ్ముడు దయగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
చదవండి: డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. క్రిష్ నమూనాల సేకరణ..!
Comments
Please login to add a commentAdd a comment