నటుడు 'దయ' మృతికి కారణాలివే.. | Reasons Behind Mogalirekulu Serial Actor Pavitranath Sudden Death, Details Inside - Sakshi
Sakshi News home page

Actor Pavitranath Demise Reasons: మొగలిరేకులు ఫేమ్‌ దయ మృతి.. కారణాలివే!

Published Sun, Mar 3 2024 12:07 PM | Last Updated on Sun, Mar 3 2024 3:13 PM

Reasons Behind Mogalirekulu Serial Actor Pavitranath Sudden Demise - Sakshi

సీరియల్‌ నటుడు దయ అలియాస్‌ పవిత్రనాథ్‌ మృతి అభిమానులను కలిచివేస్తోంది. మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌తో పవిత్రనాథ్‌ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా దయ పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు. ఈ రోల్‌ తన కెరీర్‌కు ఎంతో ప్లస్‌ పాయింట్‌ అయింది. ఈ పాత్ర ద్వారానే తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత ఎన్నో సీరియల్స్‌లో నటించినా మొగలిరేకులు, చక్రవాకం తెచ్చిపెట్టినంత పేరు మాత్రం రాలేదు.

నాలుగురోజులుగా అస్వస్థత
కొంతకాలంగా బుల్లితెర మీద కనిపించకుండా పోయిన పవిత్రనాథ్‌ మార్చి 1న మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే మరణించడానికి గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు. పవిత్రనాథ్‌ కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. ఇండస్ట్రీ మిత్రులకు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది! గత నాలుగురోజులుగా పవిత్రనాథ్‌ అస్వస్థతకు లోనయ్యారు.

గుండె కొట్టుకోవడం ఆగిపోయింది!
ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించగా.. హార్ట్‌ ఫెయిల్యూర్‌ కారణంతో పవిత్రనాథ్‌ మరణించారని వైద్యులు వెల్లడించారు. కాగా కొన్నేళ్ల క్రితం పవిత్రనాథ్‌.. అతడి భార్య శశిరేఖ మధ్య గొడవలు తలెత్తాయి. భర్త మీద ఎన్నో ఆరోపణలు చేసింది. అయినా సరే నటుడు వాటి గురించి పట్టించుకోలేదు. ఏనాడూ సదరు ఆరోపణల మీద స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఆ సమయంలో మానసికంగా వేదన అనుభవించాడని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు.

చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ..
వ్యాపారవేత్తతో హీరోయిన్‌ 'రెజీనా' పెళ్లి ఫిక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement