బుల్లితెర నటి పర్సనల్‌ వీడియో లీక్‌ | Jyothi Rai Photos And Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

బుల్లితెర నటి పర్సనల్‌ వీడియో లీక్‌

Published Thu, May 9 2024 3:35 PM | Last Updated on Thu, May 9 2024 7:54 PM

Jyothi Rai Photos And Video Viral On Social Media

తెలుగు బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ గుప్పెడంత మనసు సీరియల్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్‌వుడ్‌లో ఫుల్‌ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. సోషల్ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఈ బ్యూటీ ఇప్పుడు  పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కర్ణాటకకు చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అసభ్యకర వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి జ్యోతిరాయ్‌ పర్సనల్‌ వీడియో, ఫోటోలు లీక్‌ అంటూ  సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ సహా అన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ అవుతుంది.  

జ్యోతిరాయ్ ఏం చెప్పారు..?
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న అశ్లీల వీడియో, ఫొటోలపై నటి జ్యోతిరాయ్ మీడియా ముందు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోటోలు, వీడియోలు చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతిరాయ్ ఈ విషయమై కొద్ది రోజుల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 'వీటికి సంబంధించిన కొన్ని మెసేజ్‌లు రావడంతో నేను మానసికంగా షాక్ అయ్యాను. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారిని పట్టించుకోకపోతే అది నా వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వృత్తి జీవితంపైనా ప్రభావం చూపుతుంది.

వీటి వల్ల నాతో పాటు నా కుటుంబ ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నందున చట్టపరంగా వారిపై వెంటనే చర్యలు తీసుకుంటారని నేను అభ్యర్థిస్తున్నాను. తప్పుడు వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుంటే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.  వీలైనంత త్వరగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.' అని జ్యోతిరాయ్ కోరినట్లు తెలిసింది.

వార్నింగ్‌ ఎంటి..?
జ్యోతిరాయ్‌కు సంబంధించిన పర్సనల్‌ వీడియో, ఫోటోలు అంటూ.. మొదటగా ఒక సోషల్‌ మీడియా ఖాతా నుంచి వైరల్‌ అయ్యాయి. అందులో అశ్లీలంగా ఉన్న దృశ్యాలను చూసిన వారందరూ షాక్‌ అయ్యారు.  తన పేజీకి వెయ్యి మంది సబ్‌స్క్రైబర్స్‌ కాగానే.. జ్యోతిరాయ్‌ ఫోటోలు, వీడియోలు మరిన్ని పోస్ట్‌ చేస్తానని ఒక మేసేజ్‌ కూడా చేర్చడంతో కర్ణాటకలో పెద్ద దుమారమే రేగుతుంది. 

అందులో ఉండేది జ్యోతిరాయ్‌నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆ వీడియోలో ఉండేది జ్యోతిరాయ్‌ కాదంటూ ఆమెకు మద్ధతుగా అభిమానులు నిలిచారు. ఇప్పటికే పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటి వరకైతే ఈ వీడియో, ఫోటోల గురించి జ్యోతిరాయ్‌ అధికారికంగా రియాక్ట్‌ కాలేదు. త్వరలో ఆమె స్పందిస్తారని తెలుస్తోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement