'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ | Actress Jyothi Rai, Suku Purvaj Latest Instagram Post - Sakshi
Sakshi News home page

Jyothi Rai: ప్రియుడిని పట్టేసుకుని మరీ ఫొటో.. ఏమై ఉంటుంది?

Aug 27 2023 8:51 PM | Updated on Aug 28 2023 2:23 PM

Actress Jyothi Rai Suku Purvaj Latest Instagram Post - Sakshi

'గుప్పెడంత మనసు' సీరియల్ ఎంత ఫేమస్సో తెలీదు గానీ ఇందులో జగతి మేడమ్‪‌గా చేసే నటి కూడా అంతే ఫేమస్ అని చెప్పొచ్చు. ఈమె ఒరిజినల్ పేరు జ్యోతి రాయ్. ఈమె గురించి గత రెండు నెలలుగా ఏదో ఓ వార్త వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ పెళ్లయి, ఓ బాబు ఉన్నప్పటికీ ఓ యంగ్ డైరెక్టర్‌తో రిలేషన్ ఉండటమే దీనికి కారణం. ఇప్పుడు ఏకంగా త్వరలో ఓ గుడ్‌న్యూస్ చెబుతామని ఓ పోస్ట్ పెట్టింది.

డైరెక్టర్‌తో రిలేషన్
'గుప్పెడంత మనసు' సీరియల్‌తో ఈమె మనకు తెలుసు. కానీ కన్నడలో ఇప్పటికే 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. పలు సినిమాల్లోనూ కీలకపాత్రలు చేసింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్, సినిమాలో నటిస్తున్న ఈమె.. సుకు పుర్వాజ్ అనే యువ దర్శకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. గత కొన్నాళ్ల నుంచి ఇతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో.. ఇవన్నీ రూమర్స్ కాదు నిజమే అనే డౌట్ వచ్చింది.

(ఇదీ చదవండి: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి)

చాన్నాళ్ల క్రితమే పెళ్లి
అయితే జ్యోతిరాయ్‌కి 20 ఏళ్లున్నప్పుడే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లయింది. వీళ్ల సంసారానికి గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. కానీ ఈమె మాత్రం ఇప్పుడు యంగ్ దర్శకుడితో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన ఈమె.. ఏకంగా దర్శకుడి పేరుని తన యూజర్ నేమ్ లో పెట్టేసుకుంది. దీంతో ఈమె రిలేషన్ కన్ఫర్మ్ అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆమె అతడితో కలిసున్న ఫొటో పోస్ట్ చేసి.. 'త్వరలో గుడ్‌న్యూస్' అనే క్యాప్షన్ పెట్టుకొచ్చింది.

ఈ మధ్య కాలంలో గ్లామరస్ ఫొటోస్ పుణ్యామా అని జ్యోతిరాయ్ తెగ ఫేమస్ అయిపోయింది. అలాంటిది ఈమె నుంచి సడన్‌గా గుడ్‌న్యూస్ అనేసరికి కుర్రాళ్లు కంగారు పడిపోతున్నారు. ఒకవేళ సదరు దర్శకుడిని పెళ్లి గానీ చేసుకుంటుందా అని తెగ మదనపడుతున్నారు. అయితే ఆ ఫోటో సినిమా కోసం కూడా అయ్యిండొచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఏదనేది క్లారిటీ వచ్చేస్తుందిలేండి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement