ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడిన సీరియల్‌ నటి! | TV Actor Ribbhu Mehra Married Kirtida Mistry, Wedding Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Ribbhu Mehra: పెళ్లిపీటలెక్కిన బుల్లితెర నటీనటులు, ఫోటోలు వైరల్‌

Feb 25 2023 9:34 PM | Updated on Feb 25 2023 10:32 PM

TV Actor Ribbhu Mehra Married Kirtida Mistry, Wedding Photo Goes Viral - Sakshi

కీర్తిదా, రిబు ఇద్దరూ 'బహుత్‌ ప్యార్‌ కర్తే హై' అనే సీరియల్‌లో కలిసి నటించారు. అప్పడే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. 

బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ పెళ్లిపీటలెక్కింది. బాయ్‌ఫ్రెండ్‌, నటుడు రిబ్బు మెహ్రాను పెళ్లాడింది. ఈ వారం ప్రారంభంలోనే గుట్టుచప్పుడు కాకుండా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని రిబ్బు నివాసం ఈ వివాహ వేడుకకు వేదికగా మారింది. తాజాగా తమ పెళ్లి ఫోటోలను కొత్త జంట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. కీర్తిదా లెహంగాలో మెరిసిపోతుండగా రిబు షేర్వానీ ధరించాడు. 'ఇప్పుడు మేము మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మెహ్రా. ఈ పెళ్లిని ఇంత అద్భుతంగా మలిచినందుకు రుచి శర్మకు కృతజ్ఞతలు. ఈ మూడు రోజుల పెళ్లిని అందంగా మలిచిన కుటుంబసభ్యులు, బంధుమిత్రలు, స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు' అని రాసుకొచ్చారు నవ దంపతులు. ఈ పోస్ట్‌పై బుల్లితెర సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా కీర్తిదా, రిబు ఇద్దరూ 'బహుత్‌ ప్యార్‌ కర్తే హై' అనే సీరియల్‌లో కలిసి నటించారు. అప్పడే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఇకపోతే రిబు 'గమ్‌ హై కిసికె ప్యార్‌ మే', 'యే హై మొహబ్బతే', 'కుంకుమ్‌ భాగ్య' సహా పలు సీరియల్స్‌లో నటించాడు. కీర్తిదా 'ప్రియా రంగ్రెజ్‌', 'విక్రమ్‌ బేతాల్‌కీ రహస్య గాథ' వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement