Nitish Bharadwaj As Krishna Announces Divorce With His Wife Smita: చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయారనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న తరుణంలో కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు పెద్ద బాంబు పేల్చారు. దీంతో అభిమానగనం, ప్రేక్షకలోకం నివ్వెరపోయి అందుకు కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్నాయి.
(చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..)
ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రిటీ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అతనే ప్రముఖ టీవీ సీరియల్ నటుడు నితీష్ భరద్వాజ్. అతను భరద్వాజ్ కంటే 'మహాభారతం' సీరియల్‌లో శ్రీకృష్ణుడిగానే మోస్ట్ పాపులర్. నితీష్ భరద్వాజ్ తన భార్య, ఐఏఎస్ అధికారిణి స్మితా గేట్‌తో ఉన్న 10 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడిపోయినట్లు తెలిపాడు. అయితే నితీష్ భరద్వాజ్, స్మితా గేట్ 2019 సెప్టెంబర్‌లో విడిపోయారు. వారికి ఇద్దరు కవల కుమార్తెలు. భరద్వాజ్ తన డివోర్స్ గురించి 'నేను 2019 సెప్టెంబర్‌లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశాను. మేము విడిపోడానికి కారణాలు నాకు చెప్పాలని లేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పేది ఏంటంటే.. కొన్నిసార్లు మరణం కంటే విడాకులే చాలా బాధగా ఉంటాయి.' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా 2009లో స్మితా గేట్‌ను రెండో వివాహం చేసుకున్నాడు నితీష్ భరద్వాజ్.
(చదవండి: ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్)
బీఆర్ చోప్రా తెరకెక్కించిన టీవీ సిరీస్ 'మహాభారతం'లోని శ్రీకృష్ణుడి పాత్రలో భరద్వాజ్ ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ఈ పాత్రతో అతనికి ఎనలేని పేరు వచ్చింది. ఈ టీవీ సిరీస్ 1988వో నాలుగు సీజన్స్‌తో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే బీఆర్ చోప్రా రూపొందించిన అనేక సీరియల్స్‌లో నటించాడు. అందులో 'విష్ణువు' పాత్రతో మరింత ప్రసిద్ధి చెందాడు నితీష్ భరద్వాజ్. అలాగే నితీష్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన పిత్రురూన్ చిత్రానికి ఎంతో పేరు వచ్చింది. నితీష్ సినిమాల్లోకి రాకముందు వెటర్నరీ సర్జన్‌గా పనిచేశాడు.
(చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా?)
Comments
Please login to add a commentAdd a comment