
Mogali Rekulu Serial Actor Pavithranath: టాలీవుడ్ టాప్ సీరియల్స్‌లో ఒకటైన మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ చీకటి వ్యవహారాన్ని అతని భార్య బయటపెట్టింది. మొగలిరేకులు సీరియల్‌లో దయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర నాథ్ రియల్ లైఫ్‌లో మాత్రం విలన్ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
'పవిత్రనాథ్‌తో 2009లో పెళ్లి జరిగింది. పెళ్లయిన నాటి నుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి. జాతకం పేరుతో ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడు. ఏదేంటని ప్రశ్నిస్తే పలుసార్లు చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా ఓ అమ్మాయితో8 ఏళ్లు ఎఫైర్ నడిపించి తనని కూడా మోసం చేశాడు. ప్రతిరోజూ ఇంటికి తాగొచ్చి టార్చర్ పెడతాడు. తను ఏ సీరియల్స్‌లో నటిస్తున్నాడో నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు. పదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా' అంటూ పేర్కొంది.
విడాకులు సైతం ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి తన అత్తమామాలకు చెప్తే తననే ఇంట్లోంచి గెంటేశారని తెలిపింది. తనకు జరిఘిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగొద్దని, తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పవిత్ర నాథ్ కృష్ణ తులిసి అనే సీరియల్‌లో మల్లికార్ణున్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు.