mogali rekulu serial
-
హీరోగా మొగలి రేకులు సీరియల్ ఫేమ్.. రిలీజ్‌కు ముందే అవార్డులు కొల్లగొట్టిన చిత్రం!
బుల్లితెరపై మొగలి రేకులు సీరియల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో మరింత ఫేమ్ తెచ్చుకున్న సాగర్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం 'ది 100'. ఈ సినిమా విడుదలకు ముందే సత్తా చాటుతోంది. అంతర్జాతీయ వేదికపై సైతం అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలు ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్స్‌లోనూ అవార్డులను గెలుచుకుంది.అయితే ఈ మూవీతో కృష్ణవంశీ శిష్యుడు ఓంకార్ శశిధర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సక్సెస్ అంతా కృష్ణవంశీకే అంకితమని ఓంకార్ శశిధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆయన వల్లే తనకు ఇంత పేరు వచ్చిందన్నారు. గతంలో కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శశిధర్ ఈ మూవీ ద్వారానే టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు.ఆయనకే అంకితం.. శశిధర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను దర్శకత్వం వహించిన తొలి చలనచిత్రం "ది 100" అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాత్రలను ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అర్ధవంతమైన కథను రూపొందించడం, దాని పాత్రలను సృష్టించడం వెనుక పూర్తిగా నా గురువుగా, కృష్ణవంశీ సార్ నుంచి ప్రేరణ పొందినదే. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విలువలు, కథలు చెప్పే పద్ధతులు ఈ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. అందుకే ఈ విజయాన్ని 100 శాతం నా గురువుగారికి అంకితం చేస్తున్నా. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ దీవెనలు, మద్దతు మా టీమ్‌కు ఎల్లప్పుడు ఉండాలి. నాకు మార్గదర్శకంగా నిలిచినందుకు కృష్ణ వంశీ సార్‌కు కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ట్రైలర్ విడుదల చేసిన అంజనాదేవి..యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ది 100 మూవీ టీజర్‌ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా సాగర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాగర్ సరసన మిషా నారంగ్ హీరోయిన్గా నటిస్తోంది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి లహరి తెలుగువారి సుపరిచితమే. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు టీవి షోస్, సినిమాల్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న లహరి సీమంతం వేడుక ఇటీవలే ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్న సీమంతానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. లహరి సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్) -
'మొగలిరేకులు' సీరియల్ నటుడిపై భార్య షాకింగ్ కామెంట్స్
Mogali Rekulu Serial Actor Pavithranath: టాలీవుడ్ టాప్ సీరియల్స్‌లో ఒకటైన మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ చీకటి వ్యవహారాన్ని అతని భార్య బయటపెట్టింది. మొగలిరేకులు సీరియల్లో దయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర నాథ్ రియల్ లైఫ్‌లో మాత్రం విలన్ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. 'పవిత్రనాథ్‌తో 2009లో పెళ్లి జరిగింది. పెళ్లయిన నాటి నుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి. జాతకం పేరుతో ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడు. ఏదేంటని ప్రశ్నిస్తే పలుసార్లు చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా ఓ అమ్మాయితో8 ఏళ్లు ఎఫైర్ నడిపించి తనని కూడా మోసం చేశాడు. ప్రతిరోజూ ఇంటికి తాగొచ్చి టార్చర్ పెడతాడు. తను ఏ సీరియల్స్‌లో నటిస్తున్నాడో నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు. పదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా' అంటూ పేర్కొంది. విడాకులు సైతం ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి తన అత్తమామాలకు చెప్తే తననే ఇంట్లోంచి గెంటేశారని తెలిపింది. తనకు జరిఘిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగొద్దని, తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పవిత్ర నాథ్ కృష్ణ తులిసి అనే సీరియల్లో మల్లికార్ణున్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు. -
ట్రైలర్: ‘మొగలిరేకులు’ సాగర్ హీరోగా సినిమా
బుల్లితెరలో నటించి మహిళల ఆదరాభిమానం పొందిన నటుడు సాగర్ ఆర్కే నాయుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సాగర్ తొలిసారిగా హీరోగా నటిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తుండగా సాగర్ హీరోగా ‘షాదీ ముబారక్’ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘మొగిలిరేకులు, చక్రవాకం’ సీరియల్స్‌తో పేరు పొందిన సాగర్ నటించిన ‘షాదీ ముబారక్’ ట్రైలర్‌ను గురువారం నిర్మాత దిల్ రాజు విడుదల చేశాడు. ‘సిద్ధం కండి.. ప్రేమ రైడ్‌కు హార్దిక స్వాగతం పలికేందుకు’ అని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. కొత్త దర్శకుడు పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి చూపుల నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఉంది. సాగర్‌కు జోడీగా దృశ్య రఘునాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్నారై పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. ఒకే రోజు మూడు పెళ్లి సంబంధాలు చూసేందుకు వెళ్లి సాగర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో సినిమా కథ ఉన్నట్టు తెలుస్తోంది. అందంగా.. ఆహ్లాదకరంగా ట్రైలర్ రూపొందించారు. ఈ సినిమాను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
టీవీక్షణం : సెల్వస్వామి పాత్ర చేయొద్దన్నారు!
‘ఆరుగురు పతివ్రతలు’ రిలీజయ్యాక మావాళ్లు ఓ యాభైమందిని తీసుకుని థియేటర్‌కి వెళ్లాను. సినిమా చూసి బయటకు వస్తుంటే ఓ ముసలావిడ వచ్చి... ‘మీరందరూ ఇంతే’ అంటూ నా కాలర్ పట్టుకుంది. ఆమె అల్లుడు శాడిస్ట్ అంట. అతడు గుర్తొచ్చాడట. తర్వాత కూలయ్యి... ‘చాలా బాగా చేశావ్ బాబూ’ అంటూ ముద్దు పెట్టుకుంది. తిట్టిందో పొగిడిందో అర్థం కాలేదు కానీ... నటుడిగా నేను సక్సెస్ అయ్యానని మాత్రం అర్థమైంది. తెల్లని పంచె-లాల్చీ, కోరమీసం, మెడలో పులిగోరు, కళ్లలో అంతుపట్టని భావాలు... ‘మొగలిరేకులు’ సీరియల్లో ‘సెల్వస్వామి’ని చూసిన ప్రేక్షకులు ఆ ఆహార్యాన్నిగానీ, ఆ పాత్రను పండించిన రవివర్మని గానీ ఎప్పటికీ మర్చిపోలేరు. అతి చిన్న వయసులోనే ఇద్దరు యువకుల తండ్రిగా నటించి మెప్పించారాయన. ‘నటుడనేవాడు ఏ పాత్రయినా చేయాలి, అప్పుడే నిజమైన నటుడనిపించుకుంటాడు’ అనే రవివర్మ తన గురించి చెప్పిన కబుర్లివి... కెరీర్ ఎలా ఉంది? బ్రహ్మాండం! ‘బృందావనం’ సీరియల్‌తో పాటు రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నాను. సీరియల్స్ తగ్గించినట్టున్నారే? సినిమాలపై దృష్టి పెట్టాను. అందుకే డేట్స్ సమస్య రాకూడదని సీరియల్స్ తగ్గించాను. మీ కెరీర్ మొదలైంది సినిమాతోనా, సీరియల్తోనా? సినిమాతోనే. ‘ఆరుగురు పతివ్రతలు’ నా తొలి సినిమా. అసలు యాక్టర్ ఎలా అయ్యారు? మాది వైజాగ్. ఇంటర్ వరకూ అక్కడే చదివాక, నా ఫ్రెండ్ సింగపూర్‌లో ఉండటంతో నేనూ వెళ్లిపోయాను. రోబోటిక్స్ కోర్సు చేసి అమెరికా వెళ్లిపోదామనుకున్నాను. కానీ అప్పుడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలడంతో వెళ్లలేని పరిస్థితి. వైజాగ్ వచ్చేసి హీలియో కన్సల్టింగ్ అనే యానిమేషన్ సంస్థ పెట్టాను. నా ఫ్రెండ్ ఒకతను సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాడు. అప్పుడప్పుడూ నేనూ తనతో వెళ్లేవాడిని. నన్ను కూడా ఫీల్డ్కి రమ్మని సత్యానంద్‌గారు ప్రోత్సహించడంతో యాక్టింగ్‌తో పాటు డెరైక్షన్ కోర్సు కూడా చేశాను. మరి డెరైక్టరెందుకవ్వలేదు? అవుదామనే వర్మ కార్పొరేషన్‌కి వెళ్లాను. వర్మ బంధువు సుబ్బరాజు అక్కడ ఇన్చార్జ్. అయన నన్ను చూసి... ‘నటుడిగా ఎందుకు ట్రై చేయకూడదూ, ఈవీవీ ఓ సినిమా తీస్తున్నారు, వెళ్లి చూడు’ అన్నారు. వెంటనే నా పోర్ట్‌ఫోలియో ఈవీవీగారికి పంపాను. నచ్చడంతో ‘ఆరుగురు పతివ్రతలు’లో శాడిస్టు భర్త పాత్ర ఇచ్చారు. ఓ శాడిస్టు పాత్రతో ఎంటరవడం మైనస్ అనిపించలేదా? లేదు. ఏదైనా నటనే కదా! సినిమాల్లోకి వెళ్తానంటే మొదట ఒప్పుకోని మా నాన్న కూడా ‘చాలా బాగా చేశావు’ అంటూ మెచ్చుకున్నారు. ఎమ్మెస్ నారాయణగారు వాళ్లబ్బాయి సినిమా ‘కొడుకు’లో చాన్సిచ్చారు. మరికొన్నిటిలోనూ అవకాశాలొచ్చాయి. మరి సీరియల్స్ వైపు ఎందుకొచ్చారు? కొన్ని సినిమాల్లో నటించాక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో ముంబై వెళ్లిపోయాను. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ చిత్రానికి డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తుండగా... తాను తీయబోయే షార్ట్ ఫిల్మ్‌లో నటించమంటూ రాఘవేంద్రరావు పిలిచారు. తీరా వచ్చాక షార్ట్ ఫిల్మ్ కాస్తా సీరియల్ అయ్యింది. అలా ‘త్రిశూలం’తో టెలివిజన్ నటుడిగా మారాను. సెల్వస్వామి పాత్ర ఎలా దొరికింది? ఆ పాత్రను మొదట సెల్వరాజ్ చేశారు. ఆయనను రీప్లేస్ చేయాలి అనుకుని ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నప్పుడు... సాగర్ (ఆర్కే నాయుడు) నా పేరు చెప్పాడట. వేరొకరు చేసిన పాత్రలోకి పరకాయప్రవేశం కష్టమనిపించలేదా? లేదు. అతడి ప్రభావం పడకూడదనే నేను సీరియల్ చూడలేదు. గెటప్ వేసుకున్నాను. నా స్టయిల్లో నటించే ప్రయత్నం చేశాను. మొదట్లో ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రను చేయడం అవసరమా అని కొందరు అన్నారు. చేయొద్దని చెప్పినవాళ్లూ ఉన్నారు. కానీ చేయడం వల్లే నేనే ంటో అందరికీ తెలిసింది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రకాశ్‌రాజ్ గారిలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుని కావాలి. ‘ఉయ్యాలా జంపాలా’లో హీరోయిన్ తండ్రిగా చేశాక, నాలో ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడని అందరూ గుర్తించారు. ప్రకాశ్‌రాజ్, రావు రమేష్‌ల తర్వాత అంత మంచి నటుడు దొరికాడంటూ రివ్యూలు రాశారు. ఆ పేరును నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. జగపతిబాబు హీరోగా చేస్తోన్న ‘ఓ మనిషి కథ’ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాను. అవార్డు కోసమే తీస్తోన్న సందేశాత్మక చిత్రమది. నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. - సమీర నేలపూడి