Keerthy Suresh Interesting Comments on Casting Couch - Sakshi
Sakshi News home page

Keerthi Suresh: తొలిసారి ​కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్‌

Published Tue, Dec 6 2022 10:51 AM | Last Updated on Tue, Dec 6 2022 11:40 AM

Keerthy Suresh Interesting Comments On Casting Couch - Sakshi

'మహానటి' సినిమాతో సూపర్‌ క్రేజ్‌ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్టు కొట్టిన కీర్తి సురేష్‌ ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె బిజీ హీరోయిన్‌గా మారింది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కీర్తి కాస్టింగ్‌ కౌచ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా కీర్తి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తనకు తెలుసంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. నాతో పాటు నటిస్తున్న హీరోయిన్లు కూడా దీని గురించి నాకు చెప్పారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి వరకు నా దగ్గరకు రాలేదు. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుందేమో. అందుకే ఇలాంటి సంఘటన నాకు ఇప్పటి వరకు ఎదురుకాలేదు. ఒకవేళ నిజంగా నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే అసలు దానికి అంగీకరించను. కావాలంటే సినిమాలు మానేసి ఏదైనా జాబ్ చేసుకుంటాను కానీ, అవకాశాలు కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ నేను కాదు’ అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేశ్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి: 
కన్నడలో రష్మికపై బ్యాన్‌! ‘శ్రీవల్లి’ ఏమన్నదంటే..
బిగ్‌బాస్‌ 6: హాట్‌టాపిక్‌గా ఫైమా రెమ్యునరేషన్‌! 13 వారాలకు ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement