క్యాస్టింగ్ కౌచ్.. అన్ని చోట్లా ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటుంది. చిన్న తరహా నటుల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్ల వరకు చాలామంది ఈ క్యాస్టింగ్ కౌచ్‌ను దాటుకుంటూ వచ్చినవారే! తాను సైతం క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటోంది బుల్లితెర నటి మృణాల్ నవేల్. ఒక ప్రకటనలో నటించడానికి తనను కాంప్రమైజ్ అడిగారని వెల్లడించింది.
యాడ్ కోసం షార్ట్‌లిస్ట్
తాజా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఏడాది క్రితం జరిగిన సంఘటన ఇది. అప్పటికే నేను టీవీ యాడ్స్ కోసం ఆడిషన్స్‌కు వెళ్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఓ వ్యక్తి (క్యాస్టింగ్ ఏజెంట్) ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశాం.. అందులో మీరు కూడా ఉన్నారు. సెలక్ట్ అయితే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ప్రకటనలో నటించవచ్చని తెలిపాడు. ఆ మరుసటి రోజే నాకో మెసేజ్ వచ్చింది. నాకు ఆ ఆఫర్ రావాలంటే కాంప్రమైజ్ కావాలన్నాడు. నాకు అప్పటికే విషయం అర్థమైంది..
కాంప్రమైజ్ అడిగాడు
కానీ అతడు నా నుంచి సరిగ్గా ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నాను. ఏం కాంప్రమైజ్ కావాలి? అని అడిగాను. దానికతడు.. మరేం లేదు.. సాధారణంగా కలుసుకుని ఒక రాత్రంతా చిల్ అవడమే.. అక్కడే కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుందని చెప్పాడు. నాకు ఒళ్లు మండిపోయింది. చెడామడా తిట్టేయడంతో అతడు తన మెసేజ్‌లు డిలీట్ చేసుకున్నాడు. నాకిలా అడ్డదారిలో యాక్ట్ చేయడం అక్కర్లేదని చెప్పేశాను. అతడేమో.. ఇదొక సువర్ణావకాశం, దీన్ని మిస్ చేసుకోకూడదంటూ ఒత్తిడి తెచ్చాడు.
సెలక్షన్ ఇలాగే జరుగుతుంది
నా సహనాన్ని కోల్పోయి నోటికొచ్చిందనేశాను. దీంతో అతడు.. మీ టీవీ నటులకు సినిమాల్లో సెలక్షన్ ఎలా జరుగుతుందో తెలియదు, ఇక్కడ ప్రక్రియ ఇలాగే ఉంటుంది. అందరూ ఇలాగే చేయాలి. మీరు ఒప్పుకుంటే మేము మీకు సినిమా ఛాన్సులు కూడా ఇస్తాం అని చెప్పాడు. నేను అతడిని బ్లాక్ చేశాను, తన మాటలు వినలేకపోయాను. ప్రతి ఒక్కరూ ఇలా డైరెక్ట్‌గా చెప్పరు, కొందరు పరోక్షంగా హింట్స్ ఇస్తారు. మరికొందరు ఇదిగో ఇలా నేరుగా అడిగేస్తారు. అందుకే నాకు ఈ సంఘటన బాగా గుర్తుండిపోయింది' అని చెప్పుకొచ్చింది మృణాల్ నవేల్.
చదవండి: అది నా డీఎన్‌ఏలోనే ఉంది.. ఎమోషనల్ అయిన సితార ఘట్టమనేని
Comments
Please login to add a commentAdd a comment