సాక్షి, ముంబై: చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కో నటి సమయం వచ్చినప్పుడు దీనిపై స్వరం వినిపిస్తూనే ఉన్నారు. దీనిపై చర్చ ఈ మధ్య కొంత తగ్గినట్లు కనిపించినా.. తాజాగా ఓ బాలీవుడ్ నటి చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి నోరు విప్పారు. సినిమాలో అవకాశం కోసం వస్తే ఇద్దరు దర్శకులు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని బాలీవుడ్ నటి ఎల్లి అవ్రామ్ అన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. బాలీవుడ్‌లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. స్వీడన్‌కు చెందిన తనకు అక్కడ అవకాశాలు లభించకపోవడంతో అవకాశాలు వెతుక్కుంటూ.. బాలీవుడ్‌కు వచ్చినట్లు తెలిపారు.
అయితే కథ నిమిత్తం ఓ దర్శకుడికి దగ్గరకు వెళ్లితే తాను చాలా పొట్టిగా ఉన్నానని, ముందు పళ్లు బాగోలేవని తొలుత హేళన చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ తరువాత తన చేయి పట్టుకుని గోరుతో గిల్లినట్లు తెలిపింది. అయితే ఇవేవీ తనకు తెలియకపోవడంతో తేలిగ్గా తీసుకున్న ఎల్లి కొంత కాలం తరువాత తన స్నేహితురాలిని కలిసింది. ఈ విషయం తన వద్ద ప్రస్తావించగా.. ఆమె అసలు విషయం వివరించింది. గోరుతో చేయిపై గోకితే ఒక రాత్రి తనతో గడపమని అర్థం అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని ఎల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మరో దర్శకుడు కూడా తనతో ఇలానే ప్రవర్తించినట్లు గుర్తుచేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో అవకాశాలు రావడం చాలా కష్టమన్నది. షూటింగ్ సమయంలో ఇలాంటి వేధింపులు తాను చాలా ఎదుర్కొన్నట్లు చెప్పింది.
‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’
Published Tue, Oct 1 2019 8:24 PM | Last Updated on Tue, Oct 1 2019 8:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment