Isha Koppikar Recalls Completely Broken After Hero Asked Her To Meet Alone - Sakshi
Sakshi News home page

Isha Koppikar: హీరో కంట్లో పడ్డాను, నో చెప్పినందుకు అంత పని చేశారు, హృదయం ముక్కలైంది

Published Sat, Apr 23 2022 8:58 AM | Last Updated on Sat, Apr 23 2022 10:49 AM

Isha Koppikar Recalls Hero Asked Her To Meet Alone, She was Completely Broken - Sakshi

క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్ల ఎన్నో బాధలు పడ్డానంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను వెల్లడించింది అలనాటి హీరోయిన్‌ ఇషా కొప్పికర్‌. క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్ల తనకు సినిమా అవకాశం కూడా చేజారిపోయిందని చెప్పుకొచ్చింది. తాజాగా బాలీవుడ్‌ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించింది... 'యాక్టర్స్‌గా ఎలా కనిపిస్తున్నాము? ఎలా నటిస్తున్నామనేదే ముఖ్యమనుకున్నాను. కానీ కొందరు హీరోల కంట్లో కూడా ఉంటామని తర్వాత తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటనతో నా హృదయం ముక్కలైంది. అందరికీ వారికంటూ కొన్ని ప్రాధాన్యతలుంటాయి. అలా నాకు నా వర్క్‌ కంటే జీవితమే ముఖ్యమైనది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు తలెత్తుకునేలా ఉండాలి' అని పేర్కొంది.

కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇషా మాట్లాడుతూ.. 'ఆ ఓ నిర్మాత ఫోన్‌ చేసి ఓ హీరో రాసుకున్న లిస్టులో మీరు కూడా ఉన్నారని చెప్పాడు. నాకర్థం కాక హీరోకు ఫోన్‌ చేస్తే అతడు ఒంటరిగా రమ్మన్నాడు. నా స్టాఫ్‌ ఎవరూ కూడా వెంట రావద్దని మరీ మరీ చెప్పడంతో విషయం అర్థమైంది. అప్పుడు నిర్మాతను పిలిచి నా అందం, పనితనం వల్లే ఇక్కడిదాకా వచ్చాను, అలాంటిది ఇప్పుడు ఓ అవకాశం కోసం దిగజారతానని ఎలా అనుకున్నారని కడిగిపారేశాను. దీంతో అతడు నన్ను సినిమా నుంచి తప్పించాడు' అని చెప్పుకొచ్చింది.

ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థీ దడ్కన్‌ సినిమాతో కథానాయికగా 1998లో కెరీర్‌ ఆరంభించిన ఇషా ఫిజా, ప్యార్‌ ఇష్క్‌ ఔర్‌ మొహబ్బత్‌, కంపెనీ, పింజర్‌, దిల్‌ కా రిష్తా వంటి పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది.. హిందీ, తమిళంలో పలు సినిమాలు చేసిన ఆమె చివరగా దహనం వెబ్‌ సిరీస్‌లో కనిపించింది.

చదవండి:  డైరెక్టర్‌, హీరో అన్నీ అతడే.. సురాపానం టీజర్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement