
బాలీవుడ్ నటి నీనా గుప్తా తన బయోగ్రఫీ 'సచ్ కహున్ తో'లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లి, విడాకులు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం, కెరీర్‌లో ఆటంకాలు, ఒంటరి తల్లిగా తాను ఎదుర్కొన్న చీదరింపులు, సమస్యల సుడిగుండాలు, వాటిని ఎదుర్కొన్న తీరు.. ఇలా అన్నింటినీ ఏకరువు పెట్టింది. అలాగే ఇండస్ట్రీలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని సంచలన విషయాన్ని బయటపెట్టింది.
దక్షిణాది చిత్రాల నిర్మాత ఒకరు నన్ను హోటల్‌కు ఆహ్వానించారు. అది ముంబైలోని పృథ్వీ థియేటర్‌కు దగ్గర్లోనే ఉంటుంది. అప్పటికే షూటింగ్‌లో ఉన్న నేను ఆరోజు షెడ్యూల్ పూర్తవగానే నిర్మాతకు ఫోన్ చేశాను. అతడు తన గదిలోకి రమ్మని పిలిచాడు. నా మనసెందుకో కీడు శంకించింది. మీరే లాబీలోకి రావచ్చు కదా అని అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. దీంతో నేనే మెట్లెక్కుతూ పైన అతడి గదిలోకి వెళ్లాను. అక్కడ సోఫాలో కూర్చోగానే అతడు ఉపన్యాసం ప్రారంభించాడు'
'ఎంతోమంది తారలను దక్షిణాది ఇండస్ట్రీకి పరిచయం చేశానని బీరాలు పలికాడు. నాకో మంచి పాత్ర ఇవ్వబోతున్నా అంటూ ఆ పాత్ర వివరాలు చెప్పాడు. కానీ అది చాలా చిన్న పాత్ర అని అర్థమై నిరాసక్తిగా అక్కడి నుంచి వెళ్లిపోతాను అని చెప్పాను. దీంతో అతడు అదేంటి? ఈరోజు రాత్రికి నాతో ఉండవా? అని అడిగాడు. ఆ మాట వినగానే బకెట్ ఐస్ వాటర్ నా నెత్తిన గుమ్మరించినట్లనిపించింది. నా రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇంతలో అతడు నా బ్యాగు తీసుకుని చేతిలో పెడుతూ బిందులో బలవంతం ఏమీ లేదు.. అని చెప్పాడు. వెంటనే పరుగు లంకించుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను' అని నీనా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment