నాతో అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు.. | Sanjana joins Metoo Movement | Sakshi
Sakshi News home page

నన్ను ఇష్టానికి వాడుకున్నారు!

Published Mon, Oct 22 2018 10:51 AM | Last Updated on Mon, Oct 22 2018 10:51 AM

Sanjana joins Metoo Movement - Sakshi

సంజనా గల్రాణి

సినిమా: తననూ మోసం చేశారు అని నటి సంజనా గల్రాణి అంటోంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో వివిధ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు నటి నిక్కీగల్రాణి సహోదరి అన్నది గమనార్హం. ఇప్పుడు సినీ పరిశ్రమలో లైంగికవేధింపుల ఆరోపణలు వీరవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెడుతున్నారు. అలా మీటూ అంటోంది సంజనా గల్రాణి. హిందీ చిత్రంలో నటిస్తున్న సమయంలో నేనూ లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పింది. ఆ కథేంటో ఆమె మాటల్లో చూద్దాం. నేను 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టాను. అప్పుడు ప్లస్‌ఒన్‌ చదువుతున్నాను.

ఆ సమయంలో సినిమాల్లో నటించి మళ్లీ చదువుకోవచ్చుననే ఆలోచనతో వచ్చాను. తొలి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు హిందీ చిత్రం మర్డర్‌ను చూపించి దీన్నే కన్నడంలో రీమేక్‌ చేస్తున్నామని చెప్పారు. అందులో పలు అశ్లీల సన్నివేశాలు చోటు చేసుకోవడంతో నేను నటించనని చెప్పాను. అందుకా దర్శకుడు మర్డర్‌ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులకు తగ్గట్టుగా పలు మార్పులు చేస్తున్నట్లు చెప్పడంతో అందులో ఒక్క ముద్దు సన్నివేశంలో నటించడానికి మాత్రం నేను అంగీకరించాను. చిత్ర షూటింగ్‌ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్‌ వెళ్లడానికి అంగీకరించిన దర్శకుడు అక్కడకు వెళ్లిన తరువాత అమ్మను షూటింగ్‌ స్పాట్‌కు రావొద్దని చెప్పారు. అక్కడ నాతో పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయగా మేము చెప్పినట్లు చేయకుంటే నీ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరించారు. అలా ఎన్నో కలలతో వచ్చిన చిన్న పిల్లనైన నన్ను వారు ఇష్టానికి వాడుకున్నారు అని నటి సంజనా గల్రాణి ఆవేదన వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement