అదితీరావ్ హైదరీ
‘‘ఇండస్ట్రీలో అడ్జస్ట్‌మెంట్ (క్యాస్టింగ్ కౌచ్) అనే దానికి ఒప్పుకోనందువల్లే దాదాపు ఎనిమిది నెలలు పనిని కోల్పోయాను’’ అంటూ ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ అదితీరావ్ హైదరీ తనకెదరైన అనుభవాన్ని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సదస్సులో ‘మీటూ’ గురించి అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ – ‘‘నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అమాయకంగా ఉండేదాన్ని. నా ఫ్యామిలీ నన్ను చాలా జాగ్రత్తగా పెంచారు. ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు జరుగుతాయని నమ్మేదాన్ని కాదు.
నిజాయితీగా చెప్పాలంటే నాకన్ని చేదు అనుభవాలు కూడా ఇక్కడ ఎదురవ్వలేదు. ఒక్క సంఘటన జరిగింది. అది నాకు అంతగా హాని చేయలేదు కానీ కొంచెం డిస్ట్రబ్ చేసింది. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి.. అడ్జస్ట్ అయితేనే చాన్స్ ఇస్తాం అని చాయిస్ ఇచ్చారు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించకుండానే చాలా సింపుల్‌గా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. అలా ఓ ఎనిమిది నెలలు పని కోల్పోయాను. దాంతో అప్‌సెట్ అయ్యాను. ఇక కొత్త సినిమాలేవి చేయలేనా? అనే ఆలోచనల్లో పడిపోయాను. నా టీమ్, నా మేనేజర్ అంతా కలసి నెగటీవ్ ఆలోచనల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చారు.
అలాగే లైంగిక వేధింపులకు గురైనవారిని కచ్చితంగా ఏదోటి మాట్లాడాలని ఒత్తిడికి గురి చేయకూడదు. వాళ్లు మాట్లడటానికి సిద్ధంగా ఉన్నారనుకున్నప్పుడే మాట్లాడమనాలి. ఎవరైనా తమ అనుభవాన్ని బయటకు చెప్పకపోతే నోరు నొక్కేసారు, అమ్ముడుపోయారు అని కొందరు ప్రచారం చేస్తారు. మాట్లాడకపోతే ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు వదిలేసినట్టే.. మాట్లాడండి అని కొందరు కండీషన్స్‌లు పెడుతుంటారు. అది తప్పు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, అది కరెక్ట్ అని అనిపించినప్పుడు చేయడమే నిజమైన సాధికారత అని నేను భావిస్తాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment