Actress Prachi Thaker Sensational Comments On Her Casting Couch Experience - Sakshi
Sakshi News home page

Prachi Thaker On Casting Couch: రూ.2 లక్షలిస్తా.. కమిట్‌మెంట్‌ ఇస్తావా? అని అడిగాడు

Published Sat, Aug 5 2023 4:19 PM | Last Updated on Sat, Aug 5 2023 5:55 PM

Actress Prachi Thaker about Casting Couch - Sakshi

సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం క్యాస్టింగ్‌ కౌచ్‌.. చాలామంది హీరోయిన్లు ఇటువంటి అడ్డంకులను దాటి వచ్చినవారే! గ్లామర్‌ ప్రపంచంలో అడుగుపెట్టాలన్న ఎంతోముంది యువతుల కలను తమకు అనుకూలంగా మార్చుకుంటాయి కొన్ని ఏజెన్సీలు. తామడిగిందిస్తే వాళ్లడిగినట్లు అవకాశాలు ఇస్తామంటారు. ఇటువంటివారికి చెంప చెళ్లుమనేలా సమాధానం ఇచ్చినవాళ్లు కొందరైతే కొంత భయం, మరికొంత ఆందోళనతో.. కంటతడి పెట్టుకున్నవాళ్లు మరికొందరు! తాను కూడా ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానంటోంది హీరోయిన్‌ ప్రాచీ ఠాకర్‌.

రాజుగారి కోడి పులావ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రాచీ ఠాకర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉంది. చదువుకునే రోజుల్లోనే పటాస్‌ సినిమా చేశాను. ఆ తర్వాత ఒక యాడ్‌ ఏజెన్సీ వాళ్లు నన్ను సంప్రదించారు. ఒక యాడ్‌ చేయమని అడిగితే సరేనన్నాను. కానీ నాకు భాష రాకపోవడంతో తెలుగు స్నేహితుడిని మీడియేటర్‌గా పెట్టుకున్నాను. మీటింగ్స్‌ అంతా బానే జరిగాయి. అడ్వాన్స్‌ చెక్‌ కూడా ఇచ్చారు. ఆ వ్యక్తి నా నెంబర్‌ తీసుకున్నాడు. అతడు షూటింగ్‌ ఎప్పుడనేది చెప్తానన్నాడు.

మరి కమిట్‌మెంట్‌ ఇస్తున్నారు కదా అన్నాడు. నాకర్థం కాలేదు. అడ్వాన్స్‌ ఇచ్చారు కదా, ఏ రోజు షూట్‌ ఉంటే ఆరోజే కమిట్‌మెంట్‌ ఇస్తానని చెప్పాను. ఆయనుండి అది కాదు, కమిట్‌మెంట్‌కు నువ్వు రెడీ కదా? అని అడిగాడు. నువ్వు డేట్‌ చెప్పు, కచ్చితంగా షూట్‌కు వస్తా అని మళ్లీ చెప్పా. దానికతడు అది కాదు.. నాకు ఒక పార్ట్‌నర్‌ ఉన్నాడు. నీకు రెండు లక్షలిస్తా.. అతడితో కాంప్రమైజ్‌ అవుతావా? అని అడిగాడు. నాకర్థం కాకపోవడంతో ఆ సంభాషణను స్క్రీన్‌షాట్‌ తీసి నా ఫ్రెండ్‌కు పంపించాను. ఆమె సవివరంగా చెప్పింది. అసలు విషయం అర్థమవడంతో బాధేసింది. ఆ యాడ్‌ కూడా చేయనని చెప్పాను' అని చెప్పుకొచ్చింది ప్రాచీ ఠాకర్‌.

చదవండి: వంద కోట్లు దాటిన రజనీకాంత్‌ రెమ్యునరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement