Prachi Thaker
-
ఓటీటీలో టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ. ఈ సీరీస్‌కు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ మోదుగ , శివ కోన సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌ను సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఎల్ఎస్డీ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, ఫారెస్ట్ ట్రిప్ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఆద్యంతం సస్పెన్స్ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. -
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. డబ్బులిస్తా వచ్చేయన్నాడు: హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్.. చాలామంది హీరోయిన్లు ఇటువంటి అడ్డంకులను దాటి వచ్చినవారే! గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలన్న ఎంతోముంది యువతుల కలను తమకు అనుకూలంగా మార్చుకుంటాయి కొన్ని ఏజెన్సీలు. తామడిగిందిస్తే వాళ్లడిగినట్లు అవకాశాలు ఇస్తామంటారు. ఇటువంటివారికి చెంప చెళ్లుమనేలా సమాధానం ఇచ్చినవాళ్లు కొందరైతే కొంత భయం, మరికొంత ఆందోళనతో.. కంటతడి పెట్టుకున్నవాళ్లు మరికొందరు! తాను కూడా ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానంటోంది హీరోయిన్ ప్రాచీ ఠాకర్. రాజుగారి కోడి పులావ్ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రాచీ ఠాకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉంది. చదువుకునే రోజుల్లోనే పటాస్ సినిమా చేశాను. ఆ తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్లు నన్ను సంప్రదించారు. ఒక యాడ్ చేయమని అడిగితే సరేనన్నాను. కానీ నాకు భాష రాకపోవడంతో తెలుగు స్నేహితుడిని మీడియేటర్‌గా పెట్టుకున్నాను. మీటింగ్స్ అంతా బానే జరిగాయి. అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చారు. ఆ వ్యక్తి నా నెంబర్ తీసుకున్నాడు. అతడు షూటింగ్ ఎప్పుడనేది చెప్తానన్నాడు. మరి కమిట్మెంట్ ఇస్తున్నారు కదా అన్నాడు. నాకర్థం కాలేదు. అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఏ రోజు షూట్ ఉంటే ఆరోజే కమిట్మెంట్ ఇస్తానని చెప్పాను. ఆయనుండి అది కాదు, కమిట్మెంట్కు నువ్వు రెడీ కదా? అని అడిగాడు. నువ్వు డేట్ చెప్పు, కచ్చితంగా షూట్‌కు వస్తా అని మళ్లీ చెప్పా. దానికతడు అది కాదు.. నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. నీకు రెండు లక్షలిస్తా.. అతడితో కాంప్రమైజ్ అవుతావా? అని అడిగాడు. నాకర్థం కాకపోవడంతో ఆ సంభాషణను స్క్రీన్‌షాట్ తీసి నా ఫ్రెండ్‌కు పంపించాను. ఆమె సవివరంగా చెప్పింది. అసలు విషయం అర్థమవడంతో బాధేసింది. ఆ యాడ్ కూడా చేయనని చెప్పాను' అని చెప్పుకొచ్చింది ప్రాచీ ఠాకర్. View this post on Instagram A post shared by Prachi Thaker (@prachithaker_official) చదవండి: వంద కోట్లు దాటిన రజనీకాంత్ రెమ్యునరేషన్