
Bigg Boss OTT Fame Urfi Javed Revealed Shocking Details About Her Casting Couch: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిజానికి నటన కంటే బోల్డ్ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉర్ఫీ.. ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
'ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల్లాగే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఒకతను నన్ను బలవంతం చేశాడు. కానీ అదృష్టం కొద్ది బయటపడ్డాను. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా పేరున్న వ్యక్తుల నుంచే నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. వాళ్లు తలుచుకుంటే ఎవరినైనా, ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి బయటకి నెట్టగలిగే శక్తి ఉంది. అందుకే నేను వాళ్ల పేర్లు బయట పెట్టడం లేదు' అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment