Actress Nora Fatehi On Dating Specific People - Sakshi
Sakshi News home page

Nora Fatehi: డేటింగ్ చేయమని బలవంతం చేశారు.. కానీ!

Published Mon, Jul 31 2023 1:46 PM | Last Updated on Mon, Jul 31 2023 2:40 PM

Actress Nora Fatehi On Dating Specific People - Sakshi

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, ప్రలోభపరచడం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అప్పట్లో పెద్దగా బయటపెట‍్టేవారు కాదు గానీ ఇప్పుడు ధైర్యంగా ఆయా విషయాల్ని పంచుకుంటున్నారు. చిన్న యాక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల అందరూ ఇలాంటి ఏదో ఓ సందర్భంలో దీని బారిన పడినవాళ్లే. ప్రముఖ నటి నోరా ఫతేహి కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. గతంలో తనకు జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేసింది.

(ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ‍్యాగ్)

కాంప్రమైజ్ అవ్వమన్నారు
'కెరీర్ ప్రారంభంలో నన్ను కూడా పదేపదే కాంప్రమైజ్ అవ్వమని చెప్పారు. కొందరు వ్యక్తులతో డేటింగ్ చేయమని బలవంతం చేసేవారు. కానీ నేను ఆరోజు వాటిని తలొగ్గలేదు. నాకున్న దారిలోనే నేను వెళ్లాను. విజయవంతం అయ్యాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి మరో వ్యక్తితో తిరగడం, ఆ హీరోతో రాసుకుపూసుకు తిరగడం అయితే కారణం కాదు' అని నటి నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. 

నోరా.. తెలుగులోనూ
2014లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాది ఎన్టీఆర్ 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి ఎంటర్‌టైన్ చేసింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర చిత్రాల్లో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ 'మట్కా'లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రత్యేక గీతంతో పాటు ఈమె పాత్రకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి ఈమె ఫొటోలు, వీడియో పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు వెర్రెక‍్కిపోతుంటారు. 

(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement