సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇది ఆడవాళ్లనే కాదు.. మగవాళ్లను సైతం వేధించే సమస్య అని నటుడు వర్థన్ పురి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడే వర్థన్ పురి. తాత వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు.
దీన్ని అవకాశంగా వాడుకొని బడా సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని, తమ కోరికలు తీర్చాలని డైరెక్టుగానే తనను అడిగారని, దేవుడి దయ వల్ల తప్పించుకున్నానని వర్థన్ తెలిపాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అని షాకింగ్ విషయం వెల్లడించాడు.
‘‘సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మనతో దారుణంగా ప్రవర్తిస్తారు. ఇంకొందరైతే డబ్బులు కూడా తీసుకుంటారు. తీరా చూస్తే వాళ్లు మోసం చేసి ఉడాయిస్తారు. చాలామంది నన్ను ఇలాగే వాడుకోవాలని చూశారు..అందుకే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అంటూ వర్థన్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment