Amrish Puri
-
విలన్‌గా తాతయ్య... హీరోగా మనవడి ఎంట్రీ.. అది కూడా ఏకంగా టాలీవుడ్లో! (ఫొటోలు)
-
డైరెక్టుగా అడిగారు.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే : నటుడు
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇది ఆడవాళ్లనే కాదు.. మగవాళ్లను సైతం వేధించే సమస్య అని నటుడు వర్థన్ పురి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడే వర్థన్ పురి. తాత వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. దీన్ని అవకాశంగా వాడుకొని బడా సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని, తమ కోరికలు తీర్చాలని డైరెక్టుగానే తనను అడిగారని, దేవుడి దయ వల్ల తప్పించుకున్నానని వర్థన్ తెలిపాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అని షాకింగ్ విషయం వెల్లడించాడు. ‘‘సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మనతో దారుణంగా ప్రవర్తిస్తారు. ఇంకొందరైతే డబ్బులు కూడా తీసుకుంటారు. తీరా చూస్తే వాళ్లు మోసం చేసి ఉడాయిస్తారు. చాలామంది నన్ను ఇలాగే వాడుకోవాలని చూశారు..అందుకే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అంటూ వర్థన్ చెప్పుకొచ్చాడు. -
వెండితెరపై కరుడు గట్టిన విలన్ లైఫ్ స్టోరీ!
గొప్ప గొప్పోల్ల జీవిత చరిత్రలు వెండితెర మీద మెరిసిపోతున్నాయి. మంచి పనులు చేసి..పేరు తెచ్చుకున్న వ్యక్తులు..ఏరంగానికి చెందిన వారయినా..బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సారి మాత్రం..కరుడు గట్టిన విలన్ లైఫ్ స్టోరీ ..సినిమాగా రాబోతుంది. ఇండియన్ స్క్రీన్ మీద విలన్ పేరు చెప్తే..ఏ మాత్రం డౌట్ లేకుండా మొదటిగా గుర్తుకు వచ్చే పేరు అమ్రిష్ పురి. ఈయన విలన్ వేశాలు వేస్తే..తిట్టని ప్రేక్షకుడు ఉండడు.కోపగించుకోని ఆడియన్ లేడు.అంతగా అసహ్యంచుకునేలా ..అభినయం చూపిస్తాడు అమ్రిష్ పురి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి..విలనిజానికి కూడా ట్రెండ్ మార్కు తీసుకొచ్చాడు ఈ మాంత్రికుడు. బాలీవుడ్ జనాలను భయపెట్టిన అమ్రీష్ పురి.. సౌత్ ఆడియన్స్ ను కూడా జడిపించాడు. ఇండియాన జోన్స్ లాంటి హాలీవుడ్ చిత్రంలో కూడా నటించి మెప్పించాడు. విలనిజం పాత్రలతో పాటు...ఇంపార్టెంట్ రోల్స్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇంట్లో పెద్దరికం చూపించే క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఈ వెండితెర విలన్ రియల్ లైఫ్ వెండితెర మీదికి రాబోతుంది.సిల్వర్ స్క్రీన్ మీద భయపెట్టే అమ్రిష్ పురి..అందుకు భిన్నంగా..నిజజీవితంలో ఉంటాడు. పరిశ్రమలో..మంచి వ్యక్తిత్వం కలిగిన పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన మనవడు వర్దన్ పూరీ ఈయన బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు. జాతీయ అవార్డు విన్నర్ శంతను అనంత్ తంబే దర్శకత్వం చేస్తున్నాడు. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కాబోతుంది. -
మొన్న డ్యాన్స్.. ఈరోజు డైలాగ్.. ఏదైనా నీకు సాధ్యం
చెన్నై: పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఆటగాడు.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఏం చేసినా కొత్తగా అనిపిస్తుంది. ఎంటర్టైన్ చేయడంలో గేల్ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది. మొన్నటికి మొన్న డ్యాన్స్‌లతో అలరించిన గేల్ తాజాగా హిందీ సినిమా డైలాగులతో రెచ్చిపోయాడు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్.. దిగ్గజ విలన్ అమ్రిశ్ పురిని ఇమిటేట్ చేస్తూ ఆయన ఫేమస్ డైలాగును గేల్ పలికించిన తీరు వైరల్‌గా మారింది. అమ్రిశ్ పురి నటించిన మిస్టర్ ఇండియా సినిమాలో ఆయన పలికిన ''ముగాంబో బహుత్ కుష్ హువా'' డైలాగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆయన వేషదారణ.. హావభావాలతో అప్పటి పిల్లలంతా వణికిపోయారు. ఈ సందర్భంగా గేల్ ప్రాక్టీస్ సమయంలో ఆ డైలాగ్‌ను చెప్పే ప్రయత్నం చేశాడు. మూడు సార్లు ప్రయత్నించగా ఆఖరిసారి అచ్చం అమ్రిశ్ పురి తరహాలో చెప్పేశాడు. ఇంకేముందు ఈ వీడియోనే పంజాబ్ కింగ్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. నెటిజన్లు గేల్ డైలాగ్పై వినూత్న రీతిలో కామెంట్లు చేశారు. కాగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించి హాట్రిక్ ఓటముల నుంచి ఉపశమనం పొందింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. రాహుల్ 60*, గేల్ 43* చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. ఇక పంజాబ్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా కేకేఆర్‌తో ఆడనుంది. చదవండి: వారిద్దరు సూపర్.. పరిస్థితులకు తగ్గట్టు ఆడారు ఫోన్ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్ 𝑀𝑜𝑔𝑎𝑚𝑏𝑜 𝑏𝑜ℎ𝑜𝑡 𝑘ℎ𝑢𝑠ℎ ℎ𝑢𝑎 😎#SaddaPunjab #PunjabKings #IPL2021 #PBKSvMI @henrygayle pic.twitter.com/rTeH6xv33d — Punjab Kings (@PunjabKingsIPL) April 24, 2021 -
‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’
ముర్షిదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను అలనాటి బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురితో పోల్చారు. మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి క్యారెక్టర్ మొగాంబోగా వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో 'ఖుష్ హోగయా' అనే డైలాగ్‌ను సంతోషం వ్యక్తం చేస్తూ అమ్రిష్ పురి వాడుతుంటాడు. అదే తరహాలో ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు భారత ప్రభుత్వం నానా అవస్థలు పడుతుందని అధీర్ రంజన్ ఎద్దేవా చేశారు. (వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్) ట్రంప్‌ను సంతోషం పెట్టేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ? మురికి వాడల్లో నివసిస్తున్న పేదవారిని అంతగా దాచిపెట్టాల్సిన పని ఏంటని? మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఓ నమూనాగా గుజరాత్‌ను డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ... అక్కడ పేదలను మాత్రం దోపిడీకి గురి చేస్తుందని మండిపడ్డారు. మొగాంబోను సంతోషం పెట్టడానికి మేం ఏదైనా చేస్తామన్న రీతిలో కేంద్రం ప్రవర్తించడం సిగ్గుచేటరన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా తాము నిరసనకు దిగుతామన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 న డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేస్తున్న విందు కోసం రాష్ట్రపతి భవన్ చేసిన ఆహ్వానాన్ని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు. 'ట్రంప్ భారత్‌కు వస్తున్నారు. భారతదేశం ఆయన కోసం గ్రాండ్ డిన్నర్ నిర్వహించనున్నప్పటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించలేదు. సోనియా గాంధీని ట్రంప్‌తో విందుకు ఆహ్వానం లేదు. 'హౌడీ మోడీ' కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ వేదికను పంచుకున్నారు. అయితే ఇక్కడ మోదీ మాత్రమే ట్రంప్‌తో ఉంటారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ' అని చౌదరి కేంద్ర సర్కార్‌ను నిలదీశారు. తాను వ్యక్తిగతంగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, నిజంగా ట్రంప్ భారతదేశానికి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్‌ను మేము మనస్పూర్తిగానే స్వాగతిస్తున్నమని తెలిపారు.అయితే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటుందని, వాటి లక్షణాలను గౌరవించాల్సిందేనని చౌదరి పేర్కొన్నారు. (అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్) -
అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో
తన తాతయ్య అమ్రిష్ పురి చెప్పిన మాటలు తనకు పవిత్ర గ్రంథంతో సమానమని బాలీవుడ్ హీరో వర్ధన్ పురి అన్నాడు. నటనను ఒక వృత్తిలా భావించాలే తప్ప స్టార్‌ని అనే గర్వం తలకెక్కించుకోవద్దని తనకు సూచించినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా మూలాలు మర్చిపోకూడదని.. జయాపజయాలు సమానంగా స్వీకరించినపుడే జీవితంలో ముందుకు సాగుతామన్న అమ్రిష్ పురి మాటలను గుర్తుచేసుకున్నాడు. తనదైన విలనిజంతో బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన దివంగత నటుడు అమ్రిష్ పురి... మనుమడు వర్ధన్ పురి ‘యే సాలీ ఆషికీ’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. చిరాగ్ రూపారెల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమ్రిష్ పురి ఫిల్మిమ్స్, పెన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాతో శివలేఖ ఒబేరాయ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. కాగా మంగళవారం రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా వర్ధన్ పురి మాట్లాడుతూ... ‘ నేను థియేటర్ ఆర్టిస్టుని. ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాను. నిజానికి జయంతీలాల్ గడా పీరియాడిక్ డ్రామాతో తెరంగేట్రం చేయాల్సింది. కానీ యే సాలీ ఆషికీ కథ బాగా నచ్చడంతో వెంటనే చిరాగ్‌కు ఓకే చెప్పాను. మా కుటుంబం మొత్తం నటులన్న విషయం తెలిసిందే. తాతయ్య నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. థియేటర్ ఆరిస్టుగా చేసి సినిమాల్లోకి వెళ్లిన తర్వాత చాలా మంది పార్టీ కల్చర్ అంటూ చెడిపోతారు... వింతగా ప్రవర్తిస్తారు.. నువ్వు అలా ఉండకూడదు. మూలాలు మర్చిపోకుండా ఉన్నపుడే కెరీర్లో ముందుకు సాగుతాం అని నాకు చెప్పారు. ఆయన మాటలే నాకు బైబిల్. ఆయన స్పూర్తితో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటా అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ‘యే సాలీ ఆషికీ’ నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నటుడు అమ్రిష్‌పురి సోదరి ఇంటిలో చోరీ
మైసూరు: దివంగత బాలీవుడ్ నటుడు అమ్రిష్‌పురి సోదరి ఇంట్లో రూ.30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో మంగళవారం ముంబయి పోలీసులు జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకా శిరంవళ్లి గ్రామానికి చెందిన మహిళను అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన తులసి కొద్ది కాలం క్రితం మంగళూరు ఏజెన్సీ ద్వారా ముంబయి నగరంలో దివంగత నటుడు అమ్రిష్‌పురి సోదరి ఇంటిలో పనిమనిషిగా చేరారు. కొద్ది రోజుల క్రితం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దాచి ఉంచిన రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కాజేసీ స్వగ్రామానికి చేరుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు కేసు విచారణ చేసి తులసి కనిపించకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. నిందితురాలు నగలను తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్లు గుర్తించారు. ఆమె మొబైల్ సిగ్నళ్ల ద్వారా నిందితురాలు హెచ్డీ కోటెలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అక్కడకు చేరుకుని అరెస్ట్ చేశారు. -
‘పరదేశీ’కి మంచిరోజులు!
భారతీయ చిత్ర పరిశ్రమను ఒకప్పుడు ‘పరదేశీ’ కథాంశాలతో వచ్చిన చిత్రాలు ఉర్రూతలూగించాయి. మధ్య లో దేశీ కథలు వాటిని అధిగమించినా.. తిరిగి ‘పరదేశీ’లను చిత్ర పరిశ్రమ ఆహ్వానిస్తోంది. ఇండియా, ఇతర దేశాల మధ్య సంస్కృతిపరంగా ఉన్న తేడాలను ఆధారంగా చేసుకుని 1970లో మనోజ్‌కుమార్ చిత్రం ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అనంతరం 1990లో ఈ పరంపర కొనసాగింది. అమ్రేష్పురి ముఖ్యపాత్రధారిగా నటించిన ‘పరదేశ్’, షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన‘దిల్వాలే దుల్హానియా లేజాయేంగే’ తదితర చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఆ సినిమాలన్నీ మన సంస్కృతి, ఇతర దేశాల సంస్కృతి మధ్య ఉన్న వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. దాం తో అక్కడి, ఇక్కడి ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించారు. అనంతరం కల్ హో నాహో, సలామ్ నమస్తే, దోస్తా నా, నమస్తే లండన్, చీనీ కమ్ ఆ చిత్రాలకు కొనసాగింపు గా వచ్చి ప్రేక్షకులను రంజింపజేశాయి. స్వదేశీయులే కాక ఎన్ఆర్ఐలు సైతం ఆయా సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకోవడం మొదలుపెట్టడంతో అవి విజయవంతమయ్యాయి. అలాగే ఇటీవల విడుదలైన జబ్ తక్ హై జాన్, ఇంగ్లిష్ వింగ్లిష్ వంటి సినిమాలు కూడా ‘పరదేశీ’ పరి మళాన్ని ఘుభాళించాయి. ఇదిలా ఉండగా ఎన్ఆర్ఐ ప్రభావిత కథలున్న సినిమాలు మళ్లీ ఏలనున్నాయని పలువురు చిత్ర పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఇది ఒక చక్రం.. ఇటువంటి సినిమాలు మళ్లీ రావడానికి ఇదే మంచి సమయం..’ అని మార్కెట్ విశ్లేషకుడు కోమల్ నహ తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌పై నిర్మాతలు విసుగెత్తిపోతే కొత్త పోకడలకు తప్పక ప్రయత్నిస్తారు.. అందువల్ల ‘పరదేశీ’ సినిమాలకు తిరిగి మంచి రోజులు వస్తాయనే ఆశిస్తున్నాం..’ అని ఆయన అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఇటువంటి కథాంశాలున్న చిత్రాలనే ఆదరిస్తారు. అయితే కథ,కథనంలో పట్టున్న సినిమాలే మంచి ఫలితాలను సాధిస్తాయి..’ అని సినిమా విశ్లేషకుడు ఎస్.ఎం.ఎం. ఔసజా ముక్తాయించారు.