Amrish Puri GrandSon Vardhan Puri To Make His Grandfather Biopic - Sakshi
Sakshi News home page

Amrish Puri: వెండితెర మీదకి విలన్ చరిత్ర..స్పూర్తి నింపనున్న చెడ్డవాడు!

Dec 15 2022 4:34 PM | Updated on Dec 15 2022 5:19 PM

Amrish Puri GrandSon Vardhan Puri To Make His Grandfather Biopic - Sakshi

కరుడు గట్టిన విలన్ లైఫ్ స్టోరీ ..సినిమాగా రాబోతుంది. దయా దక్షణ్యాలు ఏ మాత్రం లేని..ఓ  ప్రతినాయకుడి..లైఫ్ స్టోరీ బయోపిక్ గా రాబోతుంది.

గొప్ప గొప్పోల్ల జీవిత చరిత్రలు వెండితెర మీద మెరిసిపోతున్నాయి. మంచి పనులు చేసి..పేరు తెచ్చుకున్న వ్యక్తులు..ఏరంగానికి చెందిన వారయినా..బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సారి మాత్రం..కరుడు గట్టిన విలన్ లైఫ్ స్టోరీ ..సినిమాగా రాబోతుంది.

ఇండియన్ స్క్రీన్ మీద విలన్ పేరు చెప్తే..ఏ మాత్రం డౌట్ లేకుండా మొదటిగా గుర్తుకు వచ్చే పేరు అమ్రిష్ పురి. ఈయన విలన్ వేశాలు వేస్తే..తిట్టని ప్రేక్షకుడు ఉండడు.కోపగించుకోని ఆడియన్ లేడు.అంతగా అసహ్యంచుకునేలా ..అభినయం చూపిస్తాడు అమ్రిష్‌ పురి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి..విలనిజానికి కూడా ట్రెండ్ మార్కు తీసుకొచ్చాడు ఈ మాంత్రికుడు.

బాలీవుడ్ జనాలను భయపెట్టిన అమ్రీష్ పురి.. సౌత్ ఆడియన్స్ ను కూడా జడిపించాడు. ఇండియాన జోన్స్ లాంటి హాలీవుడ్ చిత్రంలో కూడా నటించి మెప్పించాడు. విలనిజం పాత్రలతో పాటు...ఇంపార్టెంట్ రోల్స్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇంట్లో పెద్దరికం చూపించే క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు.

ఇప్పుడు ఈ వెండితెర విలన్ రియల్ లైఫ్ వెండితెర మీదికి రాబోతుంది.సిల్వర్ స్క్రీన్ మీద భయపెట్టే అమ్రిష్‌ పురి..అందుకు భిన్నంగా..నిజజీవితంలో ఉంటాడు. పరిశ్రమలో..మంచి వ్యక్తిత్వం కలిగిన పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన మనవడు వర్దన్ పూరీ ఈయన బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు. జాతీయ అవార్డు విన్నర్ శంతను అనంత్ తంబే దర్శకత్వం చేస్తున్నాడు. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement