‘పరదేశీ’కి మంచిరోజులు! | Will 'pardesi' return to Indian cinema? | Sakshi
Sakshi News home page

‘పరదేశీ’కి మంచిరోజులు!

Published Wed, Jan 8 2014 11:36 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘పరదేశీ’కి మంచిరోజులు! - Sakshi

‘పరదేశీ’కి మంచిరోజులు!

భారతీయ చిత్ర పరిశ్రమను ఒకప్పుడు ‘పరదేశీ’ కథాంశాలతో వచ్చిన చిత్రాలు ఉర్రూతలూగించాయి. మధ్య లో దేశీ కథలు వాటిని అధిగమించినా.. తిరిగి ‘పరదేశీ’లను చిత్ర పరిశ్రమ ఆహ్వానిస్తోంది. ఇండియా, ఇతర దేశాల మధ్య సంస్కృతిపరంగా ఉన్న తేడాలను ఆధారంగా చేసుకుని 1970లో మనోజ్‌కుమార్ చిత్రం ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అనంతరం 1990లో ఈ పరంపర కొనసాగింది. అమ్రేష్‌పురి ముఖ్యపాత్రధారిగా నటించిన ‘పరదేశ్’, షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ తదితర చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఆ సినిమాలన్నీ మన సంస్కృతి, ఇతర దేశాల సంస్కృతి మధ్య ఉన్న వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి.
 
 దాం తో అక్కడి, ఇక్కడి ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించారు. అనంతరం కల్ హో నాహో, సలామ్ నమస్తే, దోస్తా నా, నమస్తే లండన్, చీనీ కమ్ ఆ చిత్రాలకు కొనసాగింపు గా వచ్చి ప్రేక్షకులను రంజింపజేశాయి. స్వదేశీయులే కాక ఎన్‌ఆర్‌ఐలు సైతం ఆయా సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకోవడం మొదలుపెట్టడంతో అవి విజయవంతమయ్యాయి. అలాగే ఇటీవల విడుదలైన జబ్ తక్ హై జాన్, ఇంగ్లిష్ వింగ్లిష్ వంటి సినిమాలు కూడా ‘పరదేశీ’ పరి మళాన్ని ఘుభాళించాయి. ఇదిలా ఉండగా ఎన్‌ఆర్‌ఐ ప్రభావిత కథలున్న సినిమాలు మళ్లీ ఏలనున్నాయని పలువురు చిత్ర పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
  ‘ఇది ఒక చక్రం.. ఇటువంటి సినిమాలు మళ్లీ రావడానికి ఇదే మంచి సమయం..’ అని మార్కెట్ విశ్లేషకుడు కోమల్ నహ తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌పై నిర్మాతలు విసుగెత్తిపోతే కొత్త పోకడలకు తప్పక ప్రయత్నిస్తారు.. అందువల్ల ‘పరదేశీ’ సినిమాలకు తిరిగి మంచి రోజులు వస్తాయనే ఆశిస్తున్నాం..’ అని ఆయన అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఇటువంటి కథాంశాలున్న చిత్రాలనే ఆదరిస్తారు. అయితే కథ,కథనంలో పట్టున్న సినిమాలే మంచి ఫలితాలను సాధిస్తాయి..’ అని సినిమా విశ్లేషకుడు ఎస్.ఎం.ఎం. ఔసజా ముక్తాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement