మైసూరు: దివంగత బాలీవుడ్ నటుడు అమ్రిష్‌పురి సోదరి ఇంట్లో రూ.30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో మంగళవారం ముంబయి పోలీసులు జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలూకా శిరంవళ్లి గ్రామానికి చెందిన మహిళను అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన తులసి కొద్ది కాలం క్రితం మంగళూరు ఏజెన్సీ ద్వారా ముంబయి నగరంలో దివంగత నటుడు అమ్రిష్‌పురి సోదరి ఇంటిలో పనిమనిషిగా చేరారు.
కొద్ది రోజుల క్రితం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దాచి ఉంచిన రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కాజేసీ స్వగ్రామానికి చేరుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు కేసు విచారణ చేసి తులసి కనిపించకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. నిందితురాలు నగలను తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్లు గుర్తించారు. ఆమె మొబైల్ సిగ్నళ్ల ద్వారా నిందితురాలు హెచ్‌డీ కోటెలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అక్కడకు చేరుకుని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment