తాప్సీ
కెరీర్ తొలి దశలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ చాలామంది నటీమణులు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడారు తాప్సీ. ‘‘నా తొలి తెలుగు, హిందీ, తమిళం చిత్రాలు సక్సెస్ సాధించాయి. దాంతో ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవాలు నేను ఎదుర్కోలేదు. ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని. కానీ, కొన్ని భయంకరమైన కథనాలు విన్నాను. నాకెలాంటి చెడు అనుభవాలు ఎదురు కాలేదని అలాంటివి జరగవనుకోవడం పొరపాటు.
స్త్రీ, పురుష సమానత్వం లేకపోవడం, పవర్‌ని దుర్వినియోగం చేయడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, క్యాస్టింగ్ గురించి బయటకు వచ్చి అందరూ మాట్లాడటం మొదలుపెట్టాక మార్పు తెలుస్తోంది. ఇవాళ సినిమా సెట్స్‌లో పురుషుల ప్రవర్తన చాలా మారింది. జాగ్రత్తగా ఉంటున్నారు. మేం పబ్లిక్ పర్సనాల్టీ కాబట్టి, సినిమా ఇండస్ట్రీ మీద అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి మా గురించి రాస్తారు. అయితే ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయనుకోకూడదు. ప్రతి చోటా జరుగుతుంటాయి’’ అని పేర్కొన్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment