మల్లిక జాగుల.. సీరియల్ కిల్లర్ వంటి కొన్ని చిన్నాచితకా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించింది. సినిమా కంటే కూడా సీరియల్స్ ద్వారానే పేరు, డబ్బులు సంపాదించింది. ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి తర్వాత మాత్రం సడన్‌గా స్మాల్ స్క్రీన్‌కు దూరమైంది. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధలు చెప్పుకుని ఎమోషనలైంది. 'ఇండస్ట్రీలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వరు. బెంగళూరు నుంచి తీసుకొస్తారు. మమ్మల్ని చిన్నచూపు చూస్తారు, ఛాన్సులు కూడా ఇవ్వకపోయేసరికి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. సరిగా తిండి కూడా తినకపోయేసరికి నిల్చున్నచోటే పడిపోయేదాన్ని. ఆస్పత్రికి తీసుకెళ్తే బతకడం కష్టమన్నారు. ఆ స్టేజీ నుంచి మళ్లీ బతికొచ్చాను.
చీరలమ్మాను..
19 ఏళ్ల అనుభవం. కరోనా తర్వాత ఛాన్సులు నిల్.. ఎక్కడి నుంచి మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానేంటి? అని ఆలోచించి పిచ్చిదాన్నైపోయాను. మొన్నటివరకు బతుకుదెరువు కోసం చీరలమ్మాను. పెట్రోల్ బంకులో పని చేయడానికి కూడా సిద్ధమయ్యాను. కానీ వాళ్లు చులకనగా మాట్లాడారు. పదేళ్ల క్రితం నా రెమ్యునరేషన్ రోజుకు రూ.1300. అందులో మళ్లీ కటింగ్స్ ఉంటాయి. నాలుగేళ్లు అదే పారితోషికానికి పని చేశాను. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డబ్బులు పోగేస్తారనుకుంటారు కానీ అందరి పరిస్థితి అలాగే ఉండదు.
కమిట్‌మెంట్ అడిగారు
సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు కమిట్‌మెంట్ అడిగారు. నేను నో చెప్పి వచ్చేశాను. నెలరోజులపాటు టార్చర్ పెట్టారు. అందుకే సీరియల్స్ ద్వారా నేనేంటో చూపించాను. ఇకపోతే డబ్బుల కోసం కొన్ని సినిమాల్లో వాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. అయితే నేను ఒళ్లు అమ్ముకోలేదు, ఒళ్లు చూపించుకున్నానంతే! గతంలో నేను ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో ఆయన్ను మర్చిపోయేందుకు మద్యం తాగేదాన్ని. అలా మద్యపానం అలవాటైంది. రాత్రి ఓ పెగ్గేసి పడుకుంటాను. ఇకపోతే నా జీవితంలో ఎవరికీ చోటు లేదు. నేను పెళ్లి చేసుకోను' అని చెప్పుకొచ్చింది.
చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో!
Comments
Please login to add a commentAdd a comment