ఈ మధ్య బుల్లితెర మీద తెగ సందడి చేస్తోంది గీతూ రాయల్. ఆ మధ్య టిక్‌టాక్ వీడియోలతో, తర్వాత బిగ్‌బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయిందీవిడ. చిత్తూరు యాసలో గలగలా మాట్లాడుతూ గలాటా గీతూగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో ఎవరన్న విషయాన్ని బయటపెట్టింది. అల్లు అర్జున్ అంటే చేయి కోసుకుంటానని, అతడే తన అభిమాన హీరో అని చెప్పుకొచ్చింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'మాట్లాడటం నాకిష్టం. అందుకే ఆర్జే అవ్వాలనుకున్నాను. పెద్దపెద్ద బ్యానర్‌వాళ్లు నాకు సినిమా ఛాన్సులిచ్చారు. కానీ నాకు యాక్టింగ్ రాదని నో చెప్పాను. ఆ తర్వాత మాత్రం మహేశ్ విట్టాతో కల్ట్ గ్యాంగ్, సోహైల్‌తో లక్కీ లక్ష్మణ్ మూవీలో చిన్న పాత్రలు చేశాను. ఇక క్యాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే.. ఇటీవలే నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ ఉంది, దానికి హోస్ట్ చేయాలని అడిగారు. నాకు హోస్టింగ్ అంటే ఇష్టమని సరేనన్నాను.
ఆస్ట్రేలియాలో షాపింగ్ చేయొచ్చు. పైగా మూడు రోజుల ఈవెంట్‌కు భారీ రెమ్యునరేషన్ అడిగాను, వాళ్లు కూడా సరేనన్నారు. కరెక్ట్‌గా టికెట్ బుక్ చేసే సమయంలో మేనేజర్ పీఏ ఫోన్ చేసి పర్సనల్‌గా ఓకే కదా అన్నారు.. అంటే నా పనులన్నీ చేయడానికి అసిస్టెంట్‌గా వస్తాడేమో అని ఓకే అన్నాను. దానికతడు కాదు మేడమ్, మీకు, మా మేనేజర్‌కు పర్సనల్‌గా ఓకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులిస్తాం అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయింది, వెంటనే నో చెప్పాను. తర్వాత పర్సనల్‌గా కాకపోయినా హోస్టింగ్ అయినా చేయండి అని ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అయినా సరే నాకు భయం వేసి రానని చెప్పాను' అని పేర్కొంది గీతూ.
చదవండి 👇
సంచలన తీర్పు: బోరున ఏడ్చేసిన హీరోయిన్.. భావోద్వేగానికి గురైన జానీ
పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'
Comments
Please login to add a commentAdd a comment