సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనయ్యామంటూ గతంలో ఎందరో నటీమణులు మీడియా ముందు వాపోయారు. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమం కూడా క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చింది. ఇక ఇటీవలే దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి నటి అంకితా లోఖండే, ప్రాచీ దేశాయ్ కెరీర్ తొలినాళ్లలో చిత్ర పరిశ్రమలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా టీవీ నటి, మోడల్ కిష్వర్ మర్చంట్ సైతం కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారిగా నోరు విప్పింది. ఇటీవల ఆన్‌లైన్‌లో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె కెరీర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.
‘ఒకసారి మా అమ్మతో కలిసి ఓ మీటింగ్ వెళ్లినప్పుడు ఇది జరిగింది. అక్కడ ప్రముఖ నిర్మాత నాకు అవకాశం ఇవ్వాలంటే ఆ హీరోతో గడపాలని చెప్పాడు. అయితే అక్కడే మా అమ్మ ఉందని కూడా చూడకుండా నాతో ఆ నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు. మరోక్షణం ఆలోచించకుండా ఆయన ఆఫర్‌ను తిరస్కరించి మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం’ అంటు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతాయని చెప్పలేను కానీ ప్రస్తుతం ఏ పరిశ్రమలో అయిన కాస్టింగ్ కౌచ్ అనేది సాధారణ విషయం అయిపోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక హోస్ట్ ఆ నిర్మాత ఎవరని అడగ్గా.. వారి పేరు చెప్పను కానీ పరిశ్రమలో ఆ హీరో, నిర్మాత ప్రముఖులలో ఒకరని పేర్కొంది.
అయితే దీనివల్లే సినిమాలకు దూరమయ్యారాని హోస్ట్ అడగ్గా.. ‘అలా అని కాదు.. నా దృష్టి ఎప్పుడు మోడలింగ్‌పైనే ఉండేది. ఈ క్రమంలోనే టీవీలో నటించే అవకాశాలు వచ్చాయి. దీంతో వాటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాను. అయితే నేను ఎక్కడ పనిచేసిన విలువలతో కూడిన ప్రయాణం ఉండాలనుకుంటాను. అదే విధంగా నడుచుకున్నాను కూడా. ఇప్పుడు నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నాను’ అని చెప్పింది. అలాగే టీవీలో నటించడమంటే కూడా చిన్న విషయం కాదని, సినిమాల్లో చిన్న పాత్రల కంటే టీవీలో ఏ పాత్రకైనా మంచి గుర్తింపు వస్తుందనేది తన అభిప్రాయమని చెప్పింది. కాగా ఆమె నటుడు సుయాష్ రాయ్‌ను 2016 డిసెంబర్ 16న వివాహం చేసుకుంది. త్వరలోనే తల్లి కాబోతున్న కిష్వర్ తరచూ సోషల్ మీడియాలో అమ్మతనాన్ని ఆస్వాధిస్తున్నానంటు బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment