![Tv Actress Ratan Raajputh Casting Couch Issue - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/16/RATAN-RAAJPUTH-casting-couc.jpg.webp?itok=XeDSK89M)
Ratan Raajputh Casting Couch: ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని లేకుండా చాలామంది నటీనటుల దీని బారిన పడుతున్నారు. గతంలో తమకు జరిగిన అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఎలా ఇబ్బంది పడ్డామో పూసగుచ్చినట్లు చెబుతున్నారు. ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ గతంలో తను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు రివీల్ చేసింది.
కూల్‌డ్రింక్ తాగమని
'ఆడిషన్ ఉందంటే ముంబయిలోని ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆడిషన్ పూర్తయిన తర్వాత ఓ కో ఆర్డినేటర్ వచ్చి.. 'డైరెక్టర్‌కి మీ వర్క్ నచ్చింది, మీటింగ్‌కి సిద్ధమవండి' అని చెప్పారు. దీంతో మీటింగ్ కోసం పై అంతస్తుకి వెళ్లాను. వద్దులే అంటున్నా కూల్ డ్రింక్ తాగమని అక్కడ నన్ను బలవంతం చేశారు. ఆ తర్వాత.. 'మరో ఆడిషన్ ఉంది మీకు మళ్లీ ఫోన్ చేస్తాం' అని చెప్పారు. దీంతో నేను నా ఫ్రెండ్ ఇంటికొచ్చేశాం. అయితే మాకు ఇచ్చిన డ్రింక్ తాగాం కానీ అది ఎందుకో తేడాగా అనిపించింది'
(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)
గదంతా బట్టలు
'కొన్ని గంటల తర్వాత ఫోన్ వచ్చింది. ఓ ప్లేస్ చెప్పి, అక్కడికి రమ్మన్నారు. తీరా వెళ్తే అది చాలా భయంకరంగా, చెత్తగా ఉంది. బట్టలన్నీ గదిలో చిందరవందరగా పడున్నాయి. ఓ అమ్మాయి మందు తాగుందో ఏమో స్పృహ లేకుండా నేలపై కనిపించింది. ఓ వ్యక్తి వచ్చి నన్ను తిట్టాడు. ఇతడు ఎవరూ అని నా బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు. తమ్ముడని అబద్ధం చెప్పాను. ఎందుకో అక్కడి వాతవరణం తేడాగా అనిపించేసరికి వాళ్లకు సారీ చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డాం' అని నటి రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.
2009లో వచ్చిన 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో' సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న రతన్ రాజ్ పుత్.. మహాభారత్, సంతోషి మా సీరియల్స్ తో చాలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ వీటిని బయటపెట్టకపోతే చాలామంది మోసపోయే అవకాశముందని, అందుకే తనకు జరిగిన దాన్ని రివీల్ చేసినట్లు రతన్ పేర్కొంది.
(ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment