హిందీ సీరియల్ నటి రతన్ రాజ్‌పుత్ ఇటీవల తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే! ముంబైలో ఆడిషన్‌కు వెళ్తే కూల్‌డ్రింక్‌లో ఏదో మత్తుపదార్థం కలిపారని, దాన్ని తాగితే ఏదో తేడాగా అనిపించిందని చెప్పింది. కాసేపటికి వాళ్లు ఓ అడ్రస్ చెప్పి అక్కడకు రమ్మనడం.. తీరా అక్కడికి వెళ్తే ఆ ప్రదేశం అంతా చెత్తగా, భయంకరంగా ఉండటం.. ఓ అమ్మాయి స్పృహ లేకుండా నేలపై పడి ఉండటంతో పరిస్థితి అర్థం చేసుకున్న రతన్ వెంటనే అక్కడి నుంచి ఎలాగోలా జారుకుంది.
బక్కచిక్కారు, బరువు పెరగండి..
అయితే బాలీవుడ్‌లోనే కాదని, దక్షిణాదిన కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశానంటోంది రతన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను హిందీలో అగ్లె జనం మోహె బిటియా హి కిజో సీరియల్ చేస్తున్నప్పుడు సౌత్ నుంచి చాలా కాల్స్ వచ్చేవి. కొందరు మంచి డైరెక్టర్స్ ఉండేవారు, మరికొందరు మాత్రం వారి వంకరబుద్ధిని బయటపెట్టేవారు. రతన్ గారు, మీరు చాలా సన్నబడ్డారు, కాస్త బరువు పెరిగితే కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనేవారు. నేను వారి కండీషన్‌కు ఓకే చెప్పాను. అప్పుడతడు ఇక్కడ విధివిధానాలు తెలుసుకదా అన్నాడు. అవేంటో ఒకసారి తెలుసుకోవచ్చా? అని అడిగాను.
ఎవరితోనైనా కాంప్రమైజ్ కావాల్సిందే!
అందుకతడు బదులిస్తూ.. ఇక్కడ హీరో, దర్శకుడు, నిర్మాత, కొన్నిసార్లు సినిమాటోగ్రాఫర్.. ఇలా ఎవరైనా సరే అడిగితే కాదనకూడదు అని సాగదీస్తున్నాడు. మీరేం చెప్పదల్చుకున్నారో సూటిగా చెప్పండన్నాను. అందుకా వ్యక్తి స్పందిస్తూ.. మీకు తెలిసిందేగా! కాంప్రమైజ్ కావాలి అన్నాడు. అంతే.. నేను ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు దక్షిణాది నుంచి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. చాలా మంది బాలీవుడ్‌లోనే ఇలాంటివి జరుగుతాయని అంటుంటారు. కానీ సౌత్‌లో కూడా ఇలాంటివి ఉన్నాయి. దక్షిణాదిన ఛాన్స్ మిస్ అయిందని నేనేం బాధపడట్లేదు, అది నాకు పెద్ద విషయం కూడా కాదు' అని చెప్పుకొచ్చింది రతన్.
చదవండి: బేబీ సినిమాకు హీరోహీరోయిన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment