Ratan Raajputh
-
బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి
హిందీ సీరియల్ నటి రతన్ రాజ్‌పుత్ ఇటీవల తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే! ముంబైలో ఆడిషన్‌కు వెళ్తే కూల్‌డ్రింక్‌లో ఏదో మత్తుపదార్థం కలిపారని, దాన్ని తాగితే ఏదో తేడాగా అనిపించిందని చెప్పింది. కాసేపటికి వాళ్లు ఓ అడ్రస్ చెప్పి అక్కడకు రమ్మనడం.. తీరా అక్కడికి వెళ్తే ఆ ప్రదేశం అంతా చెత్తగా, భయంకరంగా ఉండటం.. ఓ అమ్మాయి స్పృహ లేకుండా నేలపై పడి ఉండటంతో పరిస్థితి అర్థం చేసుకున్న రతన్ వెంటనే అక్కడి నుంచి ఎలాగోలా జారుకుంది. బక్కచిక్కారు, బరువు పెరగండి.. అయితే బాలీవుడ్లోనే కాదని, దక్షిణాదిన కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశానంటోంది రతన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను హిందీలో అగ్లె జనం మోహె బిటియా హి కిజో సీరియల్ చేస్తున్నప్పుడు సౌత్ నుంచి చాలా కాల్స్ వచ్చేవి. కొందరు మంచి డైరెక్టర్స్ ఉండేవారు, మరికొందరు మాత్రం వారి వంకరబుద్ధిని బయటపెట్టేవారు. రతన్ గారు, మీరు చాలా సన్నబడ్డారు, కాస్త బరువు పెరిగితే కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనేవారు. నేను వారి కండీషన్‌కు ఓకే చెప్పాను. అప్పుడతడు ఇక్కడ విధివిధానాలు తెలుసుకదా అన్నాడు. అవేంటో ఒకసారి తెలుసుకోవచ్చా? అని అడిగాను. ఎవరితోనైనా కాంప్రమైజ్ కావాల్సిందే! అందుకతడు బదులిస్తూ.. ఇక్కడ హీరో, దర్శకుడు, నిర్మాత, కొన్నిసార్లు సినిమాటోగ్రాఫర్.. ఇలా ఎవరైనా సరే అడిగితే కాదనకూడదు అని సాగదీస్తున్నాడు. మీరేం చెప్పదల్చుకున్నారో సూటిగా చెప్పండన్నాను. అందుకా వ్యక్తి స్పందిస్తూ.. మీకు తెలిసిందేగా! కాంప్రమైజ్ కావాలి అన్నాడు. అంతే.. నేను ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు దక్షిణాది నుంచి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. చాలా మంది బాలీవుడ్లోనే ఇలాంటివి జరుగుతాయని అంటుంటారు. కానీ సౌత్‌లో కూడా ఇలాంటివి ఉన్నాయి. దక్షిణాదిన ఛాన్స్ మిస్ అయిందని నేనేం బాధపడట్లేదు, అది నాకు పెద్ద విషయం కూడా కాదు' అని చెప్పుకొచ్చింది రతన్. చదవండి: బేబీ సినిమాకు హీరోహీరోయిన్లు ఎంత తీసుకున్నారో తెలుసా? -
ఆడిషన్స్‌కి వెళ్తే డ్రగ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత: ప్రముఖ నటి
Ratan Raajputh Casting Couch: ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని లేకుండా చాలామంది నటీనటుల దీని బారిన పడుతున్నారు. గతంలో తమకు జరిగిన అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఎలా ఇబ్బంది పడ్డామో పూసగుచ్చినట్లు చెబుతున్నారు. ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ గతంలో తను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు రివీల్ చేసింది. కూల్‌డ్రింక్ తాగమని 'ఆడిషన్ ఉందంటే ముంబయిలోని ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆడిషన్ పూర్తయిన తర్వాత ఓ కో ఆర్డినేటర్ వచ్చి.. 'డైరెక్టర్‌కి మీ వర్క్ నచ్చింది, మీటింగ్‌కి సిద్ధమవండి' అని చెప్పారు. దీంతో మీటింగ్ కోసం పై అంతస్తుకి వెళ్లాను. వద్దులే అంటున్నా కూల్ డ్రింక్ తాగమని అక్కడ నన్ను బలవంతం చేశారు. ఆ తర్వాత.. 'మరో ఆడిషన్ ఉంది మీకు మళ్లీ ఫోన్ చేస్తాం' అని చెప్పారు. దీంతో నేను నా ఫ్రెండ్ ఇంటికొచ్చేశాం. అయితే మాకు ఇచ్చిన డ్రింక్ తాగాం కానీ అది ఎందుకో తేడాగా అనిపించింది' (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) గదంతా బట్టలు 'కొన్ని గంటల తర్వాత ఫోన్ వచ్చింది. ఓ ప్లేస్ చెప్పి, అక్కడికి రమ్మన్నారు. తీరా వెళ్తే అది చాలా భయంకరంగా, చెత్తగా ఉంది. బట్టలన్నీ గదిలో చిందరవందరగా పడున్నాయి. ఓ అమ్మాయి మందు తాగుందో ఏమో స్పృహ లేకుండా నేలపై కనిపించింది. ఓ వ్యక్తి వచ్చి నన్ను తిట్టాడు. ఇతడు ఎవరూ అని నా బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు. తమ్ముడని అబద్ధం చెప్పాను. ఎందుకో అక్కడి వాతవరణం తేడాగా అనిపించేసరికి వాళ్లకు సారీ చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డాం' అని నటి రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. 2009లో వచ్చిన 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో' సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న రతన్ రాజ్ పుత్.. మహాభారత్, సంతోషి మా సీరియల్స్ తో చాలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ వీటిని బయటపెట్టకపోతే చాలామంది మోసపోయే అవకాశముందని, అందుకే తనకు జరిగిన దాన్ని రివీల్ చేసినట్లు రతన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Ratan Raajputh (@ratanraajputh) (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు)