Payal Ghosh Once Again Spoke on Casting Couch - Sakshi
Sakshi News home page

Payal Ghosh: బెడ్‌రూమ్‌లోకి వెళ్లుంటే ఇప్పటికే 30 సినిమాలు చేసేదాన్ని

Published Fri, Jul 7 2023 9:18 PM | Last Updated on Fri, Jul 7 2023 9:30 PM

Payal Ghosh Once Again Spoke on Casting Couch - Sakshi

నేను కొందరితో బెడ్‌ షేర్‌ చేసుకుని ఉండుంటే ఇది నాకు 30వ సినిమా అయ్యేది. పెద్ద సినిమాలు రావాలంటే బెడ్‌రూమ్‌లోకి వెళ్లాల్సిందే! లేదంటే సినిమా ఛాన్సులు రావడం కష్టమే!'

పదిహేడేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పాయల్‌ ఘోష్‌. 15 ఏళ్లకు పైగా సినీపరిశ్రమలో ఉన్నప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్‌ రాస్కెల్‌ చిత్రాలు చేసిన ఆమె కొంతకాలం క్రితం తన 11వ సినిమాను ప్రకటించింది. 'ఫైర్‌ ఆఫ్‌ లవ్‌ రెడ్‌' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేసింది.

'నేను కొందరితో బెడ్‌ షేర్‌ చేసుకుని ఉండుంటే ఇది నాకు 30వ సినిమా అయ్యేది. పెద్ద సినిమాలు రావాలంటే బెడ్‌రూమ్‌లోకి వెళ్లాల్సిందే! లేదంటే సినిమా ఛాన్సులు రావడం కష్టమే!' అని చెప్పుకొచ్చింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. 'ఏమైంది? నువ్వు పడ్డ ఇబ్బందులను మాతో షేర్‌ చేసుకోవచ్చుగా', 'ఎంత కష్టమైనా సరే కానీ నువ్వు నిజాయితీగానే ఉండు, అడ్డదారులు తొక్కవద్దు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. తర్వాత కాసేపటికే సదరు పోస్ట్‌ను డిలీట్‌ చేసింది పాయల్‌ ఘోష్‌.

కాగా మీటూ ఉద్యమం సమయంలో పాయల్‌.. బాలీవుడ్‌ దర్శక నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. మూడో మీటింగ్‌కే తనపై అత్యాచారం చేశాడని ఇటీవల సైతం వరుస ట్వీట్లు చేసింది. దక్షిణాదిన తనకు ఎప్పుడూ అలాంటి చేదు అనుభవాలు ఎదురవలేదని, కానీ బాలీవుడ్‌లో మాత్రం అనురాగ్‌ తనను బలత్కారం చేశాడని వాపోయింది.

చదవండి: పుష్ప 2లో ఐటం సాంగ్‌.. ఏంటి సామీ.. అన్ని కోట్లా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement