బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఓ ఇంటర్యూలో ఖురానా మాట్లాడుతూ.. సినిమా ఛాన్స్‌ల కోసం ఆడిషన్స్ ఇచ్చే సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘సినిమా ఛాన్స్ ఉందని ఓ దర్శకుడు ఆడిషన్స్‌కి పిలిచాడు. ఇక అక్కడికి వెళ్లాక ఆయన నువ్వు నీ ప్రైవేటు భాగాలను చూపిస్తే నీకు సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తానని చెప్పాడు. ఇక క్షణం ఆలోచించకుండ వెంటనే ఆయన ఆఫర్‌ను సున్నీతంగా తిరస్కరించాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే ‘‘అప్పటి నుంచి నేను ఎన్నో సార్లు తిరస్కరణలకు గురయ్యాను. ఇక ప్రారంభంలో సోలో టెస్టు తీసుకుంటామని చెప్పి ఒకేసారి 50 మందిని లోపలికి పిలిచేవారు. అయితే దీనిని నేను వ్యతిరేకిస్తే తిరిగి వెళ్లిపోమ్మని చెప్పేవారు. అలా నేను ఎన్నోసార్లు ఆడిషన్స్‌కు వెళ్లి తిరిగి వచ్చేవాడిని’’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభాన్ని గుర్తు చేసుకున్నాడు. (అందుకే తిరస్కరించారు: ప్రియదర్శన్)
కాగా ఈ తిరస్కరణల నుంచి ఇప్పుడు నేను మరింత బలవంతుడినయ్యాను అంటూ ఖురానా చెప్పాడు. ‘‘ప్రారంభంలో నేను ఎదుర్కొన్నా వైఫల్యాల వల్ల నాలో ఆత్మస్థైర్యం రెట్టింపు అయ్యింది. ఎంతగా అంటే ప్రస్తుతం అపజయాలను, విజయాలను ఒకేలా స్వీకరించేంతగా. అయితే గత మూడేళ్లలో విడుదలైన నా సినిమాలు అన్ని కూడా విజవంతమైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పాడు. కాగా ఆయుష్మాన్ ఖురానా ‘విక్కీ డోనర్’ సినిమాతో 2012లో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మెస్ట్ వాంటేడ్ నటుడిగా ఎదిగాడు. ఇటివల ఆయన నటించిన ‘శుభ మంగల్ జయాదా సావ్ధాన్’ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఆయుష్మాన్ స్వలింగ సంపర్కుడిగా నటించాడు. (ఆయుష్మాన్ ఖురానా సినిమాకు తాప్సీ బ్రేక్)
Comments
Please login to add a commentAdd a comment