Actress Shivya Pathania Reveals Her Casting Couch Experience By Fake Producer - Sakshi
Sakshi News home page

Shivya Pathania: అందుకు ఒప్పుకుంటేనే ఛాన్స్‌ ఇస్తానన్నాడు.. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని చెప్పిన నటి

Published Wed, Jun 29 2022 6:11 PM | Last Updated on Wed, Jun 29 2022 6:29 PM

Actress Shivya Pathania Reveals Her Casting Couch Experience By Fake Producer - Sakshi

క్యాస్టింగ్‌ కౌచ్‌.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే సమస్య. అనేకమంది తారలు ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడినవారే. తాజాగా బుల్లితెర నటి శివ పఠానియా సైతం తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఫేస్‌ చేశానంటోంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

'హమ్‌ సఫర్‌ షో ముగిశాక నెక్స్ట్‌ ఏంటన్నది తోచలేదు. ఎనిమిది నెలల పాటు దిక్కు తోచక ఉండిపోయాను. అలాంటి సమయంలో నన్ను ఆడిషన్‌కు రమ్మంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. ముంబైలోని శాంతాక్రజ్‌లో ఆడిషన్‌.. అది చిన్న గది, లోనికి వెళ్లాను. అక్కడున్న వ్యక్తి.. నువ్వు నాతో ఒకరోజుకి కాంప్రమైజ్‌ అయ్యావంటే పెద్ద స్టార్‌తో యాడ్‌లో నటించేందుకు ఛాన్స్‌ ఇస్తానన్నాడు. విచిత్రం ఏంటంటే అతడు ల్యాప్‌టాప్‌లో హనుమాన్‌ చాలీసా వింటున్నాడు. వెంటనే నేను అతడు అడిగిన ప్రశ్నకు గట్టిగా నవ్వేశాను. కొంచెమైనా సిగ్గుందా? భజన పాట వింటూ ఏం అడుగుతున్నావసలు? అని తిట్టేశాను. ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్‌కు చెప్పి వాళ్లను జాగ్రత్తపడమన్నాను. కానీ తర్వాత తేలిందేంటంటే అతడసలు నిర్మాతే కాదు, అతడే కాదు అతడి బ్యానర్‌ కూడా ఫేకే అని తెలిసింది. మరి అతడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు' అని పేర్కొది శివ. ఆమె చివరగా హాట్‌స్టార్‌ స్పెషల్స్‌.. 'షూర్‌వీర్‌' వెబ్‌సిరీస్‌లో నటించింది.

చదవండి: పెళ్లి పుకార్లపై స్పందించిన హీరో రామ్‌
రాజమౌళి మగధీరలో ఆఫర్‌ ఇచ్చారు, కానీ నేనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement