
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిననే పేర్కొంది మాళవిక శ్రీనాథ్. మూడేళ్ల క్రితం ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది మలయాళ నటి. 'మూడేళ్ల క్రితం ఇది జరిగింది. మంజు వారియర్ సినిమాలో ఆమె కూతురిగా నటించాలంటూ ఓ ఆఫర్ వచ్చింది. మంజు వారియర్ మూవీ అనగానే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా ఓకే చెప్పాను. త్రిస్సూర్‌లో ఆడిషన్‌కు వెళ్లాం. గాజు గ్లాసుతో ఉన్న గదిలో ఆడిషన్ జరిగింది. ఆ తర్వాత నా జుట్టంతా చిందరవందరగా ఉందని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి సరిచేసుకోమని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు.
సరేనని నేను ఆ గదిలోకి వెళ్లగానే అతడు నన్ను వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా షాక్ అయిన నేను తన నుంచి విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించాను. నువ్వు మంజు వారియర్ కూతురిగా స్క్రీన్‌పై కనిపించాలంటే సైలెంట్‌గా ఉండు అని చెప్పాడు. నేను ఏడుస్తూ తన చేతిలో ఉన్న కెమెరాను పగలగొట్టేందుకు ప్రయత్నించాను. అతడు దాన్ని సరిచేసుకునే క్రమంలో వెంటనే అక్కడి నుంచి పారిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. మధురం, సాటర్‌డే నైట్ వంటి చిత్రాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment