ప్రతి చోట తోడేళ్లు ఉంటాయి.. వాటిని నుంచి తెలివిగా తప్పించుకోవడం పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు నటి శృతి మరాఠీ. హ్యూమన్స్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు తారసపడిన తోడేళ్ల గురించి.. తాను బయటపడిన విధానం గురించి చెప్పుకొచ్చారు. ‘ఒకసారి ఓ నిర్మాతను కలిశాను. ఆయన నాకు తన చిత్రంలో లీడ్ రోల్ ఇస్తానని చెప్పాడు. తొలుత చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. కానీ రానురాను తనలోని వికృత బుద్ధిని బయటపెట్టడం ప్రారంభించాడు. ముందు చాలా మర్యాదగా మాట్లాడినా తర్వాత ఒప్పుకుంటే తప్పులేదు.. ఒక్క రాత్రికే కదా అని వేధించడం ప్రారంభించాడు. అతన్ని ఊరికే వదలాలని అనిపించలేదు. తగిన సమాధానం చెప్పాలని భావించాను’ అని పేర్కొన్నారు శృతి.
‘అందుకే ‘నన్ను మీతో పడుకోమంటున్నారు.. మరి హీరో ఎవరితో పడుకుంటార’ని ప్రశ్నించాను. దాంతో అతడు షాక్ అయ్యాడు. నోటి నుంచి ఒక్క మాట వస్తే ఒట్టు. వెంటనే ఈ విషయం గురించి మిగతా వారికి చెప్పాను. దాంతో వారు ఆ నిర్మాతను ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఆ సమయంలో నేను నా గురించే కాక.. ప్రతి మహిళ తరఫున మాట్లాడినట్లు అనిపించింద’న్నారు శృతి. అంతేకాక ‘ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ తమిళ చిత్రం కోసం నేను బికిని ధరించాల్సి వచ్చింది. అప్పుడు దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం అనుకున్నాను’ అన్నారు.
‘కానీ నాకంటూ ఓ గుర్తింపు లభించిన తర్వాత జనాలు నా బికిని సీన్‌ల గురించి నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ఇలాంటి విమర్శలు మన ఆత్మాభిమానాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో వారికి తెలీదు. అందుకే వాటన్నింటిని పట్టించుకోవడం మానేసి నా పని మీద దృష్టి కేంద్రీకరించాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఏది ఊరికే లభించడం లేదు. ఈ రోజు నేను ఉన్న పరిస్థితికి నా పట్టుదల, కృషి తప్ప మరేది కారణం కాదు’ అని చెప్పుకొచ్చారు శృతి. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలు గెల్చుకుంది. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం.. ఆత్మవిశ్వాసంతో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment