Humans of Bombay
-
Karishma Mehta: కథలు మార్చగలవు
రచయిత్రి, ఫొటోగ్రాఫర్ అయిన కరిష్మా మెహతా హ్యూమన్స్ ఆఫ్ బాంబే వెబ్సైట్ వ్యవస్థాపకురాలు, నిర్వాహకురాలు. హృదయాలను కదిలించే ప్రత్యేకమైన కథా విధానం ద్వారా ప్రజాదరణ పొందిన రచయిత్రి. ముంబై వాసి కరిష్మా మెహతా కాలక్షేపంగా కాకుండా సామాజిక బాధ్యతనూ తన కథనాల ద్వారా పంచుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై డిజిటల్ రంగంలో తనను తాను ఆవిష్కరించుకోవడం, లక్షలమందికి చేరువైన తీరుతో సహా తన కథనంతటినీ పంచుకున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభించిన ఫేస్ బుక్ పేజీ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ కరిష్మా మెహతాకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. ఇప్పుడు విస్తృతమైన ప్లాట్‌ఫారమ్‌గా పరిణామం చెందింది. సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి వ్యక్తుల వరకు ముంబై నివాసితుల కథనాలను వెలుగులోకి తెచ్చింది. అందుకోసం ఆమె పడిన కష్టం సామాన్యమైనది కాదు. సంపన్న వర్గంలో పుట్టినా తనకున్న ఆసక్తితో సామాన్యులలో తిరిగి, ఫొటోలతో వారి కథనాలను ప్రజలకు అందిస్తూ వచ్చింది. మొదట్లో ఇద్దరు టెక్నికల్ వ్యక్తులతో కలిసి ప్రారంభించిన ఈ పని మెహతాను నేడు మిలియన్ల మందికి చేరువ చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో పలువురు ఆమె వెబ్‌సైట్‌కి ఫ్రీలాన్సర్లుగా ఉండేలా చేసింది. కిందటేడాది ‘హౌ ది హెల్ డిడ్ డూ ఇట్’ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఇతర నిష్ణాతులైన వ్యక్తుల ఇంటర్వ్యూల ద్వారా తనలో ఉన్న మరో ప్రతిభను పరిచయం చేసింది. రైటర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా, ప్రెజెంటర్‌గా రాణిస్తున్న కరిష్మా మాట్లాడుతూ – చేయూతగా మారడం సంతోషం ‘‘కష్టంలో ఉన్న వ్యక్తులను గుర్తించడం, కలుసుకోవడం, మాట్లాడటం ప్రతిరోజూ జరుగుతుంటుంది. వారి కథను ఐదు వందల పదాల్లో మా పోర్టల్ ద్వారా తెలియజేయడం మాత్రమే కాదు ఏళ్లుగా జరుగుతోంది... అవసరమైన వారికి డబ్బు సేకరించి వారు తమ కష్టమైన పరిస్థితి నుండి బయట పడటానికి సహాయం చేయడం సంతోషంగా ఉంటుంది. ఒకరోజు హాస్పిటల్లో ఒక గర్భిణిని చూశాను. ఆమెకు అప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. మగపిల్లవాడు కావాలనే ఆశతో పిల్లలను కంటూనే ఉంది. మద్యానికి బానిసైన భర్త ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె ఆసుపత్రి పాలు, భర్త జైలు పాలూ అయ్యారు. ఆమె కథనాన్ని జనం ముందుకు తీసుకువచ్చాను. ఆమెకు, ఆమె ఐదుగురు కూతుళ్లకు సమాజం నుంచి ఆర్థిక భద్రత లభించింది. ఆసరాగా అందిన రూ. 25 లక్షల రూపాయలు వారి జీవనం సాఫీగా గడపడానికి ఉపయోగపడ్డాయి. మరొక కథ జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అలీ భాయ్‌ది. చేయని నేరానికి ఏళ్లుగా జైలు జీవితం గడుపుతుండేవాడు. అతని కథ బయటకు రావడంతో ఆ జీవితం నుంచి విముక్తి లభించింది. అలాగే, యాసిడ్ బాధితులకు, సెక్స్‌వర్కర్ల పిల్లలకు, ఎముక గుజ్జు మార్పిడి అవసరమయ్యే పిల్లల కోసం క్రౌడ్ ఫండింగ్ చేసి ఐదుకోట్ల నిధులను సేకరించి, అందించాం. వెబ్‌సైట్‌కు నిధులు సమకూర్చడానికి చేసిన మొదటి ప్రయత్నంలో ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పుస్తకం పబ్లిష్ అయ్యింది. అంటే, మా కథలు ప్రజలలో పెద్ద మార్పును తీసుకువచ్చాయి. ఎన్నోచోట్ల నుంచి మాకు కథనాలు అందుతుంటాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని, సేవను అందించగలుగుతున్నాం’’అని వివరిస్తారు ఆమె. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే! ‘ఏ కలా సాధించలేనంత పెద్దది కాదు’ అని చెప్పే కరిష్మా జీవితంలో చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని భావించే వ్యక్తి. యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ నుండి బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందిన కరిష్మా ఎప్పుడూ వ్యాపార వ్యూహాలను రూపొందిస్తూ ఉండేది. కెనడాలో డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ నుంచి స్ఫూర్తి పొంది ముంబైలోని వ్యక్తుల కథలు, వారి జీవితాలను పరిచయం చేయడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసింది. ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తుల గురించి కథలు చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ వెబ్సైట్ ద్వారా ఆరువేలకు పైగా కథనాలను అందించింది. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమైన వారని, స్ఫూర్తిదాయకంగా ఉంటారని చూపించింది. నాలుగు లక్షలకు పైగా ఉండే సమూహాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. ఫేస్బుక్లో మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండింతలకు పైగా ఉన్నారు. ఫ్రీలాన్స్ రైటర్‌గా టెడెక్స్ ప్రెజెంటర్‌గానూ రాణిస్తున్న కరిష్మాకు సామాన్యుల కథనాలను పరిచయం చేయడం పట్ల ఆమెకున్న అభిరుచి, వ్యవస్థాపక స్ఫూర్తి అత్యంత ప్రభావంతమైన వేదికగా రూపొందించడానికి ఉపయోగించుకుంది. ఆమె ఈ ప్రయాణం అంత సాఫీగా ఏమీ జరగలేదు. ఎన్నో ఒడిదొడుకులనూ ఎదుర్కొంది. కాపీ క్యాట్ అనే పేరును సొంతం చేసుకుంది. వివాదాలను, సవాళ్లను స్వీకరించింది. అయినా, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ సమాజంలో తన ఉనికిని, బాధ్యతనూ సమానంగా నిలబెట్టుకుంటున్నానని తన మాటలు, చేతల ద్వారా నిరూపిస్తున్న కరిష్మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. – నిర్మలారెడ్డి -
Neeta: కష్టాలే ఇంధనంగా..
నీతా గత జీవితంలోకి తొంగిచూస్తే ‘బాధలు’ ‘కష్టాలు’ తప్ప ఏమీ కనిపించనంత చీకటి. నీతా చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తాగుబోతు. ఆయన పెట్టే హింస భరించలేక అమ్మమ్మ వాళ్ల ఇంటికి పారిపోయి అక్కడే ఉంది. 14 సంవత్సరాల వయసులో 22 ఏళ్ల వ్యక్తితో నీతాకు పెళ్లి జరిగింది. పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భర్త తాగుబోతు. రకరకాలుగా హింస పెట్టేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి వేరుపడింది. ముగ్గురు పిల్లలు తనతో పాటే ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తూనే ఆగిపోయిన చదువును కొనసాగించింది. పిల్లలతో పాటు చదువుకుంది. ‘నీకు ఏ పనీ చేతకాదు’ అని భర్త ఎప్పుడూ తిట్టేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూటర్ నడపడం నేర్చుకుంది. ఆ తరువాత వ్యాన్, బస్ డ్రైవింగ్‌లను నేర్చుకుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ముంబయిలో 13 బస్సులకు యజమాని అయింది. ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కుమారుడు కెనడాలో ఉంటున్నాడు. స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ నీతా స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ వైరల్‌గా మారింది. ‘నేను ఎన్నోసార్లు నీతా ట్రావెల్ బస్సులలో ప్రయాణం చేశాను. ఆమె వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలియదు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చే స్టోరీ ఇది’ అని ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు స్పందించారు. -
Karishma Mehta: పేరు చెప్పకుండా.. ఒప్పుకుంటే వారి ఫొటో వేసి వారి కథనాలు రాసి..
Karishma Mehta The Woman Who Started Humans Of Bombay Her Story: 8 ఏళ్ల క్రితం 21 ఏళ్ల వయసులో ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్బుక్ పేజీని తెరిచింది కరిష్మా మెహతా. ప్రతి మనిషికో కథ ఉంది. ప్రతి గుండెకో స్పందనుంది అని ఆమె అందరి కథలకూ వేదిక కల్పిస్తూ ఈ పేజీని తెరిచింది. సాధారణంగా పత్రికలలో విజేతల కథలే వస్తాయి. కాని సామాన్యులు చేసిన అసామాన్య జీవన పోరాటాలు, త్యాగాలు, గొప్ప పనులు ఈ పేజీ ద్వారా లోకానికి తెలిశాయి. ఎందరో తెలియని మహానుభావులు అందరికీ వందనాలు అనిపించేలా చేసిందా పేజీ.కరిష్మా మెహతా పరిచయం. చిన్నప్పుడు పేదరాశి పెద్దమ్మ కథలు వినేవాళ్లం. ఆమె కథలకు అంతూ పొంతూ ఉండదు. ఆ కథల పట్ల ఉండే ఆసక్తి కూడా. ప్రతి మనిషి దగ్గరా ఒక కథ ఉంటుంది. లేదా ప్రతి ఎదుటి మనిషి దగ్గరా ఒక కథ ఉంటుంది. ఆ కథను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే కథ ఇంకా బతికే ఉంది. మామూలు మనుషుల కథలు జనానికి చెబుదాం అని కరిష్మా మెహతాకు అనిపించింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు తానే ఒక పేదరాశి పెద్దమ్మ కాబోతోందని. గతంలో పత్రికలు మొదలెట్టి న్యూస్‌ప్రింట్ కొని ప్రింటర్ ద్వారా కథలను అచ్చు వేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి అరచేతిలో ఒక పత్రిక ఉన్నట్టే. దాని పేరు ఫోన్. అందులో ఒక పేజీ ఉన్నట్టే. దాని పేరు ఫేస్బుక్. కరిష్మా మెహతా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పేరుతో ఫేస్బుక్లో ఒక పేజీ తెరిచింది. ఇప్పుడు దానికి పది లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల మంది. ఆ పేజీలో ఇప్పటికి 6000 కథనాలు వెలువడ్డాయి. దాదాపు 15 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి ఈ కథనాలలో ఉన్న వ్యక్తులకు సహాయం చేశారు. ఇదంతా ఒక్క ఐడియా వల్ల. కరిష్మా మెహతా చేసిన ఆలోచన వల్ల. 21 ఏళ్ల వయసులో కరిష్మా మెహతాకు చిన్నప్పటి నుంచి తానొక వ్యాపారవేత్త కావాలని కోరిక. ‘14 ఏళ్ల వయసులో నేను ఒక బిజినెస్ మేగజీన్‌లో ఎవరిదో ఇంటర్వ్యూ చూస్తూ ఇలా నా గురించి కూడా ఇంటర్వ్యూ రావాలి అనుకున్నాను. ఆ సంకల్పం గొప్ప శక్తిని ఇచ్చింది. నేను ఆ నిర్ణయాన్ని వదలదల్చుకోలేదు. 21వ ఏట హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో డిజిటల్ మీడియాలో ఒక అంట్రప్రెన్యూర్‌గా జీవితాన్ని మొదలెట్టాను. ఏ పత్రికలో అయితే చిన్నప్పుడు నా ఇంటర్వ్యూ రావాలని అనుకున్నానో అదే పత్రికలో నా ఇంటర్వ్యూ వచ్చాక.. అవును.. ఇప్పుడు నా కల నెరవేరింది అనుకున్నాను’ అంటుంది కరిష్మా. ముంబైకి చెందిన కరిష్మా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్బుక్ పేజీ కోసం అపరిచితుల జీవన కథనాలను చెప్పాలనుకుంది. వారి కష్టాలు, బాధలు, సాహసాలు, త్యాగాలు, అవసరాలు... ఇవన్నీ తెలుసుకుని చెప్పాలనిపించింది. దాని వల్ల ఏమవుతుంది? మనుషులంతా ఒక్కటే అని తెలుస్తుంది. ప్రతి మనిషి జీవితంలో పోరాడుతూ ముందుకు వెళుతున్నాడని తెలుస్తుంది. అంతే కాదు మానవత్వం అంటే సాటి మనిషి గురించి తెలుసుకుని చేయదగ్గ సహాయం చేయడమే అని కూడా అర్థమవుతుంది. ఆ ఆలోచనతోనే కరిష్మా హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీను మొదలెట్టింది. మొదటి ఇంటర్వ్యూ తనే 8 ఏళ్ల క్రితం మొదటి ఇంటర్వ్యూ కోసం ఒక సాయంత్రం కరిష్మా మెరేన్ డ్రైవ్‌కు వెళ్లింది. అక్కడ కనిపిస్తున్న పాదచారులతో మాట్లాడటానికి ప్రయత్నించింది. కాని ఎవరూ సహకరించలేదు. ‘కాని ఒకామె మాత్రం ఒప్పుకుంది. ఆమెకు 50 ఏళ్లు ఉంటాయి. అప్పుడే విడాకులు తీసుకుంది. ఆమె తన మనసులో బాధంతా చెప్పుకుంది. అంతా అయ్యాక నా గుండె మీద బరువు దిగినట్టుగా ఉంది అని వెళ్లిపోయింది’ అంటుంది కరిష్మా. పేరు ఎవరిదో చెప్పకుండా వారు ఒప్పుకుంటే వారి ఫొటో వేసి వారి కథనాలు రాయడం హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీ ఆనవాయితీ. అంతే ఆ వ్యక్తి వివరాలు పేజీ నిర్వాహకులకే తెలుస్తాయి. వారికి ఏదైనా సహాయం కావాల్సి వస్తే పేజీ నిర్వాహకుల నుంచే వెళతాయి. 6000 కథనాలు ‘మేము ఇప్పటికి ఆరువేల మంది అపరిచితులతో మాట్లాడి వారి జీవన కథనాలు రాశాం. ఒకప్పుడు నేను ఒక్కదాన్నే. ఇప్పుడు 20 మంది టీమ్ పని చేస్తోంది. ఒకసారికి ఒక కథ... నియమం పెట్టుకుని మా కథనాలు ప్రచురిస్తాం. ఇన్నేళ్ల అనుభవంలో ఇంతమందిని కలుస్తూ వెళ్లాక నాకు ఐదారు ఎం.బి.ఏ డిగ్రీలు చేసినంత అనుభవం, జ్ఞానం వచ్చింది. ఎందరికో సాయం చేశాం. చదువుకు, వైద్యానికి, శిక్ష అనుభవించిన నిరపరాధులకు ధన సాయం చేశాం. ఆ తృప్తి తీరనిది’ అంటుంది కరిష్మా మెహతా. ఈ పేజీ పెట్టి 8 ఏళ్లు అయిన సందర్భంగా ఫేస్బుక్లో ఆమె తన ప్రయాణాన్ని చెబితే నెటిజన్లు విశేషంగా స్పందించారు. ‘మీ పోస్ట్లన్నీ చదువుతాను. ఇవి మానవత్వాన్ని సజీవంగా ఉంచుతాయి’ అని ఒకరంటే ‘జీవితంలో పోరాడటాన్ని నేర్పుతాయి’ అని ఒకరన్నారు. టీ అమ్ముతూ కుటుంబాన్ని సాకుతున్న ఒక చిన్నపిల్లవాడు, ఒళ్లో కూతుర్ని కూచోబెట్టుకుని కన్యాదానం చేసిన తల్లి, సొంత వడపావ్‌లు అమ్మడానికి నానాబాధలు పడి చివరికి బ్రాండ్ సృష్టించి మరీ సక్సెస్ అయిన వడపావ్ అమ్మకందారుడు... ఇలా ఎన్నో కథలు హ్యూమన్స్ ఆఫ్ బాంబే వల్ల వెలుగుచూశాయి.పేదరాశి పెద్దమ్మలు గతించిపోయారని అనుకుంటాం. కాని కథలు వెతికి చెప్పగలిగితే డబ్బు సంపాదించగలిగే పెద్దమ్మలు మనమూ కావచ్చు. చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే -
Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా
Swathi Vishnoi And Mayank Vishnoi Emotional Love Story: He Want To Be Dad But Never Came Back: అమృత తుల్యమైన ప్రేమను నిర్వచించడం ఎవరికీ సాధ్యం కాదు... నిజమైన ప్రేమలో ఆశించడాలు.. అనుమానాలు.. అవమానాలకు తావుండదు... అనుభూతులు మాత్రమే పదిలంగా మదిలో కొలువుంటాయి... మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తి భౌతికంగా వేల మైళ్ల దూరంలో ఉన్నా అనుక్షణం మన చెంతనే ఉన్నారన్న పవిత్ర భావన మనసును పులకింపజేస్తుంది.. తనతో పెనవేసుకున్న అనుబంధం అజరామరంగా నిలిచిపోతుంది.. శ్రీమతి విష్ణోయి ప్రస్తుతం ఇదే మానసిక స్థితిని అనుభవిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ మయాంక్ విష్ణోయి సతీమణి ఆమె. తన భర్త తనను గర్వపడేలా చేశారని, ఆయన లేరన్న విషయం తలచుకుని బాధపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదంటున్నారు. అత్తామామలకు తానే కొడుకుగా మారి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రాణంగా ప్రేమించే భర్త దూరమై రెండు నెలలు కావొస్తున్న వేళ ఆయనతో తన బంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన అందమైన జ్ఞాపకాలు పంచుకున్నారు. PC: Humans Of Bombay తొలి పిలుపే మిసెస్ విష్ణోయి అంటూ.. ‘‘నాలుగేళ్ల క్రితం.. సూర్యకిరణంలా నా జీవితంలో ప్రవేశించాడు మయాంక్. నా సహోద్యోగి కజిన్ ఆయన. తొలిసారి నన్ను చూసినపుడే... ‘‘నువ్వు ఏదో ఒకరోజు మిసెస్ విష్ణోయి అవుతావు’’! అన్నారు. నాకు నవ్వొచ్చింది. కానీ... మయాంక్ మాత్రం ఆ మాట సీరియస్‌గా తీసుకున్నారు. ఎప్పుడు కలిసినా శ్రీమతి విష్ణోయి అని పిలిచేవారు. ‘‘హే.. నువ్వు పిచ్చోడివి బాబూ’’ అని బదులిచ్చేదాన్ని. మెల్లగా మాటలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు ఇన్ఫాంట్రీలో మయాంక్ కెప్టెన్‌గా ఉండేవారు. డెహ్రాడూన్‌లో పోస్టింగ్. నేనేమో ఢిల్లీలో! ప్రతి శనివారం నన్ను చూసేందుకు 5 గంటల ప్రయాణం చేసేవారు. కానీ.. మేం కలిసి ఉండేది మాత్రం కేవలం రెండు గంటలే!! మయాంక్‌తో ఉంటే సమయమే తెలియదు! నా పుట్టినరోజైతే ఇక చెప్పనక్కర్లేదు. అకస్మాత్తుగా వచ్చి ఇప్పుడు మనం నేపాల్ వెళ్తున్నాం! మరోచోటుకు వెళ్తున్నాం అంటూ సర్ప్రైజ్ చేసేవారు. PC: Humans Of Bombay శ్రీమతి విష్ణోయి గారూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఒక్కోసారి అత్యంత శీతల ప్రదేశాల్లో తను విధులు నిర్వర్తించే వారు. అలాంటప్పుడు నెలల పాటు కనీసం నేరుగా చూసే వీలు కూడా ఉండేది కాదు. అలా ఓసారి రెండు నెలల ఎడబాటు. ఆ చేదు అనుభవాన్ని దూరం చేసేందుకు తన బర్త్‌డే రోజు తన దగ్గరికి వెళ్లి సర్ప్రైజ్ చేశాను. వెంటనే నన్ను ఆత్మీయంగా హత్తుకుని.. నువ్వు వచ్చావు కదా.. నా పుట్టినరోజు పరిపూర్ణమైంది అంటూ సంబరపడ్డారు. మరోసారి.. నన్ను నిజంగానే అమితాశ్చర్యాలకు గురిచేశారు. ఆరోజు నా పుట్టినరోజు. స్నేహితులు, బంధువుల ముందు మోకాళ్లపై కూర్చుని.. ‘‘శ్రీమతి విష్ణోయి గారూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా?’’అంటూ ఎంతో గోముగా అడిగారు. అంతే ఇక! పెళ్లి భాజాలు మోగాయి! నాకింకా గుర్తు... పెళ్లిలో పూజారి మంత్రాలు చదువుతున్నపుడు.. మయాంక్ తనకు తానుగా కొన్ని ప్రమాణాలు చేశారు. ‘‘నాకు ఎల్లప్పుడూ నా దేశమే ప్రథమ ప్రాధాన్యం’’... ‘‘ఒకానొక రోజు నేను తిరిగి రానన్న వార్త వస్తుంది. సైనికుడి భార్యగా నువ్వు చేదు నిజాన్ని వినడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి’’ అని చెప్పారు. తనతో మాట్లాడుతూ సమయం గడపటం నాకెంతో ఇష్టం. PC: Humans Of Bombay నాన్నను కావాలని ఉందన్నారు.. కానీ పెళ్లైన కొత్తలో రోజులు ఎంతో మధురంగా గడిచాయి. ఆయనతో పాటు విధులు నిర్వర్తించే చోటుకు వెళ్లాను. అక్కడే మా పొదరింటిని నిర్మించుకున్నాం. అయితే, తను మేజర్ అయిన తర్వాతి ఏడాదికి కశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఘర్షణాత్మక ప్రాంతంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ ప్రతిరోజూ కత్తిమీద సామే. కానీ మయాంక్ వీలు చిక్కినప్పుడల్లా... నన్ను చూడటానికి వచ్చేవారు. నాలుగేళ్ల బంధంలో తనతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారిగా ఏప్రిల్‌లో ఆయన ఇంటికి వచ్చారు. వెళ్లేటపుడు.. ‘‘స్వా.. మన కుటుంబాన్ని పెంపు చేసుకోవాలని భావిస్తున్నా.. నాన్నను కావాలని ఉంది’’ అని ఆయన అన్న మాటలు ఇంకా గుర్తు. కానీ.. నా మయాంక్ తిరిగి రాలేదు.. తన గురించిన వార్త మాత్రం వచ్చింది. నా గుండె పగిలింది.. విశ్రాంతి తీసుకో రెండు నెలల క్రితం... నాకొక కాల్ వచ్చింది. ‘‘సర్... తలమీద ఎవరో గన్‌తో కాల్చారు’’.. అవతలి గొంతు. ఒక్కసారిగా నా ప్రపంచం కుప్పకూలింది. ఆరోజు ఉదయమే తనతో మాట్లాడాను. కానీ అంతలోనే ఇలా.. వెంటనే శ్రీనగర్‌కు బయల్దేరాను. తనను ఆ పరిస్థితిలో చూసి నా గుండె పగిలింది. బ్రెయిన్‌డెడ్ అని డాక్టర్లు చెప్పారు. అయినా.. తను నా మాటలు వింటున్నాడనే ఆశ.. 15 రోజుల పాటు నా మయాంక్ ఎంతో ధైర్యంగా మృత్యువుతో పోరాడాడు. ‘‘ఐ లవ్ యూ.. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.. ఇక నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో మయాంక్’’తనతో నేను చెప్పిన చివరి మాటలు ఇవే. తనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు బెటాలియన్ మొత్తం కదిలి వచ్చింది. సేన మెడల్‌తో తనను గౌరవించారు. రెండు నెలలు అవుతోంది. కానీ తను లేడన్న విషయం నమ్మలేకపోతున్నా. ఇంకా తను ఎక్కడో చోట డ్యూటీ చేస్తున్నాడనే భావనలో ఉంటా. నా జ్ఞాపకాల్లో తను సజీవం. నిద్రపోయే సమయంలో తన చేతి గడియారం పెట్టుకుంటాను. తన దుస్తులు ధరిస్తాను.. తను నన్ను గట్టిగా హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది. తను నాతోనే ఉన్నాడు.. ఉంటాడు... కానీ నా భర్త లేడని నేను ఎన్నడూ శోకించను.. అందుకు బదులుగా తను నాకు మిగిల్చిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ... ఒక వ్యక్తిగా... దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడిగా తను నాకు నేర్పించిన విలువలు తలచుకుంటూ కాలం గడిపేస్తా’’ అని ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు. అన్నట్లు మిసెస్ విష్ణోయి పేరు చెప్పలేదు కదూ! స్వాతి మయాంక్ విష్ణోయి! ప్రేమకు నిలువెత్తు రూపమైన భర్త జ్ఞాపకాల్లో సంతోషం వెదుక్కుంటున్న ‘మయాంక్ జీవిత భాగస్వామి’! ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్మూ కశ్మీర్లో చేపట్టిన ఆపరేషన్‌లో ఆగష్టు 27న గాయపడ్డ మయాంక్ విష్ణోయి పదిహేను రోజుల తర్వాత శాశ్వతంగా ఈ లోకాన్ని వీడివెళ్లిపోయారు. -సాక్షి వెబ్‌డెస్క్ -
ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అనేవారు.. నాన్న చనిపోయాక..
ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచక తప్పదు అంటున్నారు శతాబ్ది. దివ్యాంగురాలిగా మారిన తాను సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని సగర్వంగా చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్‌గా, క్రీడాకారిణిగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ‘శతాబ్ది’ జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే ఆ పేరు పెట్టారు.. చిన్నతనం నుంచే హైపర్ యాక్టివ్. ఒక్కచోట కూడా కాలు నిలవనే నిలవదు. ఎల్లప్పుడూ ఉరుకులూ.. పరుగులే. అందుకే.. వేగంగా ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్(రైలు) పేరిట.. తమ అమ్మాయికి శతాబ్ది అని నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు. గెంతులు వేస్తూ ఎప్పుడూ సందడి చేసే తమ బిడ్డను చూసుకుంటూ మురిసిపోయారు. కానీ... 21 ఏళ్ల వయస్సులో శతాబ్దికి జరిగిన ప్రమాదం వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. మేడ మీది నుంచి జారిపడ్డ శతాబ్ది.. శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి. నా ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది.. ‘‘ఆరోజు నా కేక విని అమ్మానాన్న పరిగెత్తుకుని వచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సుమారు 5 గంటల తర్వాత నాకు స్పృహ వచ్చింది. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇక జీవితంలో నేను నడవలేనని డాక్టర్లు చెప్పారు. అప్పుడే నా ప్రపంచం మొత్తం కూలిపోయినట్లు అనిపించింది. పూర్తిగా విషాదంలో మునిగిపోయాను. ఇతరుల సాయం లేకుండా కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి. సిగ్గు అనిపించేది. భయం వేసేది. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అలాంటి సమయంలో బంధువులు తమ మాటలతో మరింత చిత్రవధ చేసేవారు. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే చచ్చిపోవడమే మేలు అనేవారు.. ‘‘ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం. ఇంత ఘోరమైన పరిస్థితి అనుభవించే కంటే చచ్చిపోవడమే మంచిది’’ అని అమ్మానాన్నలను మరింతగా బాధపెట్టేవారు. అయితే, నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ‘‘నా కూతురు కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తుంది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నాన్న వాళ్లకు సమాధానమిచ్చేవారు. ఆరేళ్లపాటు ఆస్పత్రే నాకు ఇల్లు. నాకు వైద్యం చేయించడానికి నా కుటుంబం చాలా కష్టపడింది. అమ్మ తన పెన్షన్ డబ్బుతో బిల్లు కట్టేది. ఇవన్నీ చూస్తూ నా మీదే నాకే జాలివేసేది. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ‘‘ఈ దుర్ఘటనకు నా జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వకూడదు. నాకంటూ గుర్తింపు కావాలి’’ అని అనుకున్నాను. మొదటి ప్రయత్నంలోనే... అందుకు అనుగుణంగానే బ్యాంకు ఉద్యోగం సాధించేలా అహర్నిశలు కృషి చేశాను. మొదటి ప్రయత్నంలోనే ఎగ్లామ్ పాసై జాబ్ తెచ్చుకున్నాను. ‘‘మేనేజర్ తండ్రిని’’ అంటూ నాన్న నన్ను చూసి గర్వపడేవారు. అప్పుడు నా ఆనందం అంతా ఇంతాకాదు. ఎవరైతే నన్ను చచ్చిపో అన్నారో వారికి గట్టిగా సమాధానం ఇచ్చినట్లయింది. కానీ విధికి నా సంతోషం చూడబుద్ధికాలేదేమో! ఆరు నెలల్లోనే నాన్న చనిపోయారు. నా గుండె పగిలింది. నేను మేడ మీది నుంచి కిందపడిపోయినపుడు కూడా అంతటి బాధను అనుభవించలేదు.ఆ బాధాకరమైన ఘటన నుంచి బయటపడేందుకు సామాజిక కార్యక్రమాల్లో భాగమవడం అలవాటు చేసుకున్నాను. ఆర్మీ ఆఫీసర్ అయి దేశానికి సేవ చేయాలన్న చిన్ననాటి కల ఎలాగో నెరవేరలేదు కాబట్టి... సమాజ సేవ చేయాలని ఫిక్సయ్యాను. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే 31 వయస్సులో మళ్లీ అయితే, పారాలింపిక్స్‌లో దీపా మాలిక్‌ను చూసిన తర్వాత నాకు కూడా క్రీడల్లో పాల్గొనాలనిపించింది. 31 ఏళ్ల వయస్సులో కోచ్ సహాయంతో షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో ప్రాక్టీసు చేశాను. బరువులు ఎత్తిన ప్రతీసారీ ప్రాణం పోయినట్టు అనిపించేది. క్రమేణా.. అలవాటైపోయింది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మూడు విభాగాల్లోనూ స్వర్ణం సాధించాను. అమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నాన్నే గనుక ఉండి ఉంటే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. న్యూస్ పేపర్లలో నా గురించి కథనాలు చూసిన ప్రతిసారి నాన్నే గుర్తుకువస్తారు. ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం అన్న వారికి వీటిని సమాధానంగా చూపేవారు అనిపిస్తుంది. ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధమవుతున్నాను. కచ్చితంగా పసిడి సాధిస్తాను. ఆరేళ్ల పాటు నరకం అనుభవించిన నేను.. విధిరాత అని సరిపెట్టుకోకుండా ముందడుగు వేశాను కాబట్టే.. వీల్‌చైర్‌లో కూర్చునే నా కలలు నెరవేర్చుకున్నాను’’ అని తన జీవితంలోని విషాదాలు, వాటి నుంచి తేరుకుని ఎదిగిన విధానాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శతాబ్ది పంచుకున్నారు. -వెబ్‌డెస్క్ చదవండి: Shana Parmeshwar: అలాంటప్పుడు నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి? -
బాలకార్మికుడి స్థాయి నుంచి గురువుగా!
న్యూఢిల్లీ: అందరూ ఇంజనీర్లు.. డాక్టర్లు.. కలెక్టర్లు కాలేరు! ఏవేవో కారణాలతో మనం కన్నకలలు చెదిరిపోవచ్చు. దీంతో చాలామంది నిరాశ నిస్ప్రుహలకు లోనే జీవితాన్ని అంతం చేసేసుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే తాము కన్న కలలు కల్లలైపోయిన వెరవక తాను కోల్పోయినట్లుగా మరెవ్వరూ కోల్పోకూడదని తపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారే న్యూఢిల్లీకి చెందిన ఈ "పేరు తెలయని వ్యక్తి". ఆ పేరు తెలియని టీచర్ గురించి హ్యూమన్స్‌ఆఫ్ బాంబే ఫేస్బుక్లో రావడంతో.. ప్రస్తుతం అతడి స్టోరీ వైరలవుతోంది. పేరు కూడా చెప్పడానికీ ఇష్టపడని ఈ ఢిల్లీవాసి తాను బాలకార్మికుడినని చెప్పాడు. అతనిది చాలా పెద్ద కుటుంబమని.. 8 మంది సంతానం, తండ్రి రైతు కూలి, సంపాదన రోజుకి రూ 50 మాత్రమే అన్నాడు. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండటంతో తాను కూడా పోలం పనులకు వెళ్లేవాడిని అన్నాడు. తన పనంతా పూర్తయ్యాక తమ ఊరికి 30 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకి వెళ్లేవాడినన్నాడు. తమ కుటుంబంలో హైస్కూల్ చదువును పూర్తి చేసిన వ్యక్తి తాను మాత్రమే అని తెలిపాడు. మధ్యలో ఆగిపోయిన చదువు.... ఇంజనీరింగ్ చదవాలనేది సదరు వ్యక్తి కల. కాలేజ్‌లో అడ్మిషన్ కూడా సంపాదించుకున్నాడు. కానీ వాళ్ల నాన్నజబ్బుపడడంతో మధ్యలోనే వదిలేయవలసి వచ్చింది. డబ్బుల కోసం పుచ్చకాయలు అమ్మడం దగ్గర నుంచి చేయని పని అంటూ... లేదు. ఆఖరికి తీరిక వేలళ్లో కిరణా షాపుల్లో పనిచేసి డబ్బు కూడ బెట్టేవాడు. ఇలా ఉండగా 2006లో ఢిల్లీలో అన్ని చోట్ల మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ తనకు ఏదైనా పని దొరుకుతుందేమోనని భావించి మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కార్మికుల పిల్లలు భిక్షాటన చేయడం చూశాడు. పాఠశాలలకు ఎందుకు వెళ్లడం లేదని ఆ పిల్లలను ప్రశ్నించాడు. తమ తల్లిదండ్రులకు చదివించే స్థోమత లేదని ఆ పిల్లలు చెప్పడంతో... అతని బాల్యం గుర్తొచ్చి మనసంతా కకలావికలం అయిపోయింది. (చదవండి: చూసి నవ్వడమే ఆ టీచర్‌కు శాపమైంది.. ప్రేమ, పెళ్లి అన్నాడు.. చివరకు) వెంటనే కొన్ని పుస్తకాలు కొని తెచ్చి వారికి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఈ విషయం అందరికి తెలిసింది. దీంతో మరింత మంది పిల్లలు అతడి స్కూల్‌కి రావడానికి ఆసక్తి కనబర్చారు. అది అతనికి మరింత నూతన ఉత్సాహాన్నిచ్చింది. స్కూల్‌కి కావల్సిన కనీస అవసరాలైన బ్లాక్‌బోర్డు, బ్యానర్లు, బుక్స్, అన్ని అతని సొంత డబ్బులతోనే సమకూర్చుకున్నాడు. ప్రస్తుతం అతడు దాదాపు 300 మంది మురికివాడల పిల్లలకి ఉచితంగా ప్రాథమిక విద్యనందిస్తున్నాడు. తర్వాత వారిని ప్రభుత్వ పాఠశాలలకి పంపిస్తున్నాడు. (చదవండి: నా చావుకి వాళ్లే కారణమంటూ వీడియో రికార్డ్ చేసి..) మా జీవితాలు మారిపోయాయి సార్!.... తన దగ్గర చదువుకున్న ఫ్లాట్‌ఫామ్ మీద బట్టలు అమ్ముకునే వ్యక్తి కొడుకు తనకు ఇంజీనీరింగ్ కాలేజ్‌లో సీటు వచ్చిందని చెప్పినప్పుడు తాను ఏడ్చేశానని చెప్పాడు సదరు గురువు. మీరు మా జీవితాల్ని మార్చేశారు సార్ అంటూ.. అతని పూర్వ విద్యార్థులు ప్రశంసిస్తుంటే తన కష్టం ఫలించనందుకు సంతృప్తిగా ఉందంటాడు. చిన్న చిన్న సాయాలు చేసి పేరు కోసం రకరకాలుగా పాకులాడుతుంటారు. కానీ ఈ ఢిల్లీవాసిలాంటి కొందరు సాధారణ మనుష్యులు సంపన్నుల కాకపోయిన తమ కష్టార్జితంతో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూ.. అందరి హృదయాలను గెలుచుకుంటారు. ప్రస్తుతం ఇతడి స్టోరి తెగ వైరలవుతోంది. -
ఫ్రిజ్, టీవీ, ఐపాడ్, మాస్క్: ఆటోనా.. హైటెక్ హోటలా?
చెన్నై: మనలో అందరికి చాలా ఆశలు, కోరికలుంటాయి. కానీ కొందరు మాత్రమే తన వాటిని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సరే వాటిని అధిగమించి.. తాము అనుకున్నది సాధిస్తారు. సాధించాలనే సంకల్పం, గట్టి పట్టుడదల ఉంటే చాలు.. మిగతా సమస్యలన్ని దూది పింజల్లా తేలిపోతాయి. ఈ మాటలకు ఆకారం వస్తే.. అతడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా అన్నా దురైలా ఉంటాడు. పారిశ్రామికవేత్త కావాలనేది అన్నాదురై చిన్ననాటి కోరిక. కానీ దానికి తగ్గ డబ్బు, చదువు అతడి వద్ద లేదు. అయితే ఇవేవి అతడిని అడ్డుకోలేకపోయాయి. తన దగ్గరున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు. దానిలో ఎక్కే కస్టమర్లను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం.. ఇప్పుడతన్ని ప్రత్యేకంగా, వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందులు వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ పారిశ్రామికవేత్త కావాలనేది అతడి కోరిక. అయితే కుటుంబ పరిస్థితులు దృష్ట్యా ఆటో నడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ పారిశ్రామికవేత్త కావాలనే అతడి కోరిక మాత్రం తనని నిద్రపోనివ్వలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఐడియా అన్నాదురై జీవితాన్ని మార్చేసింది. తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు అన్నాదురై. ఇక తన ఆటోలోకి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తుంది. కనుక జనాలు ఆటోల్లో తిరగాలంటే భద్రత ముఖ్యం.. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేవరకు వారికి ఎంటర్టైన్మెంట్ కల్పించడం ముఖ్యం అనుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక రచించాడు అన్నాదురై. దాని ప్రకారం తన ఆటోలో మాస్క్, శానిటైజర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఓ ఐపాడ్, టీవీ, చిన్న ఫ్రిజ్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నిజంగానే మతి పోతుంది. తాము ఆటో ఎక్కామా లేక.. ఏదైనా స్టార్ హోటల్లో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది. ఇక అన్నాదురై 9 భాషల్లో తన కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇన్ని హైటెక్ హంగులతోపాటు.. కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై ఆటో అంటే ఆ ప్రాంతంలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు.. మళ్లీ మళ్లీ దానిలోనే ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో జూల్ 15న పోస్ట్ చేసిన అన్నాదురై స్టోరీ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఎయిడ్స్ ఉందన్న విషయం దాచి పెళ్లి.. బిడ్డను కోల్పోయా..
వెబ్‌డెస్క్: అన్యోన్య దాంపత్యానికి తొలి మెట్టు నమ్మకం... దాపరికాలు, అరమరికలు లేకుంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది.. కానీ పెళ్లి అనే బంధమే అబద్ధంతో మడిపడితే... అది కూడా ఒక భర్త భార్య దగ్గర అస్సలు దాచకూడని విషయం దాస్తే... దాని కారణంగా ఆమె కన్నబిడ్డను కోల్పోవాల్సి వస్తే.. ఆ స్త్రీ పడే వేదన వర్ణనాతీతం. అస్సాంకు చెందిన జాహ్నవీ గోస్వామి ఇలాంటి బాధను అనుభవించారు. అయితే, భర్త కారణంగా హెచ్ఐవీ బారిన పడిన ఆమె.. అందరిలా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగారు. తనలాంటి ఎంతో మంది బాధితులకు అండగా నిలుస్తున్నారు. తన ఆశ్రమంలో ఉన్న చిన్నారులతో ‘అమ్మా’ అని పిలిపించుకుంటూ, వారి కేరింతల్లో తన కూతుర్ని చూసుకుంటున్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయురాలైన జాహ్నవి గురించిన వివరాలు ఆమె మాటల్లోనే.. 17 ఏళ్లకే పెళ్లి.. ‘‘పదో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. పదిహేడేళ్లకు పెళ్లి. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. మావారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారు. ఎందుకిలా అవుతుంది అని అడిగినందుకు నన్ను తీవ్రంగా తిట్టి, కొట్టి హింసించేవారు. కానీ, ఒకరోజు ఆయన వేసుకుంటున్న టాబ్లెట్లు నా కంటపడ్డాయి. ఇవేంటని ప్రశ్నించాను. విటమిన్ టాబ్లెట్లు అన్నారు. అయినా, నాకెందుకో అనుమానం తీరలేదు. ఇలా కాలం సాగిపోతుండగా... గర్భవతిని అయ్యానన్న విషయం తెలిసింది. అమ్మ కాబోతున్నానన్న సంతోషం ముందు ఈ బాధలేమీ పట్టించుకోలేదు. కానీ, ఎప్పుడైతే ఆడబిడ్డకు జన్మనిచ్చానని తెలిసిందో.. నా భర్త ఆస్పత్రికి వచ్చి మరీ నన్ను తీవ్రంగా కొట్టారు. కేవలం మగ పిల్లాడిని కనేందుకే నన్ను పెళ్లి చేసుకున్నానంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. 3 నెలలకు మళ్లీ ఆయనకు అనారోగ్యం. ఈసారి డాక్టర్లు భయంకరమైన నిజం చెప్పారు. నా భర్తకు ఎయిడ్స్ సోకింది. పర స్త్రీలతో లైంగిక సంబంధాలు.. ఈ విషయం గురించి నిలదీశాను. పెళ్లికి ముందే ఆయనకు ఈ విషయం తెలుసట. బిజినెస్ ట్రిప్పులకు వెళ్లినపుడు చాలా మంది స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారట. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో మా వాళ్ల దగ్గర నిజం దాచి నన్ను వివాహం చేసుకున్నారట. అది కూడా అబ్బాయికి జన్మనిస్తే వారి వంశం నిలబడుతుందనే ఆశతో.. నా గుండె ముక్కలైంది. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకునేలోపే నా భర్త చనిపోయాడు. అంతలోనే మరో షాక్.. ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటే నాకూ, నా కూతురు కస్తూరికి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. నా ప్రపంచం చీకటైపోయింది.. నా బిడ్డను ఒడిలో పెట్టుకుని ఎంతలా ఏడ్చానో నాకే తెలుసు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. పైగా వేధింపులకు గురిచేశారు. విధిలేక పుట్టింటికి చేరాను. నేను ఉన్నానని తెలిసి చాలా మంది మా ఇంటికి రావడమే మానేశారు. దీంతో దుఃఖం పొంగుకొచ్చింది. నేనూ, నా బిడ్డ ఆస్పత్రిలో చేరాం. అక్కడ డాక్టర్లకు కూడా హెచ్ఐవీ పేషెంట్లకు ముట్టుకోవడం అంటే భయమే. ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్న సమయంలో.. కస్తూరికి టీబీ వచ్చింది. రెండేళ్ల వయసులో తను నా నుంచి శాశ్వతంగా దూరమైంది. నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సరైన చికిత్స లేని కారణంగా నా బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని కోర్టులో కేసు వేశాం. నా గురించి ఈ విషయాలన్నీ తెలిసి, మా స్కూల్ ప్రిన్సిపల్ నన్ను కలవడానికి వచ్చారు. నా టీచర్లను కూడా తీసుకువచ్చారు. నా మనసు కస్తూరి జ్ఞాపకాల నుంచి పుస్తకాల వైపు మళ్లేలా చేశారు. నా అక్కాచెల్లెళ్లు వారు కూడబెట్టుకున్న డబ్బుతో నన్ను చదివించారు. అలా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేశాను. కానీ హెచ్ఐవీ ఉన్న కారణంగా నన్ను ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఒక్క నెలలో 13 ఇళ్లు మారాల్సి వచ్చింది. అప్పుడే హైకోర్టులో నా పిటిషన్ విచారణకు వచ్చింది. కూతురి మరణానికి నష్టపరిహారంగా 2 లక్షల రూపాయలా లేదంటే, ఉద్యోగమా ఈ రెండు ఆప్షన్లను నా ముందు ఉంచింది. నేను రెండోదాన్నే ఎన్నుకున్నాను. అస్సాం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలో హెచ్ఐవీ పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చే ఉద్యోగానికి కుదిరాను. పేషెంట్ల తరఫున పోరాడాను. అమ్మా అన్న పిలుపే అమితానందం నా సేవలు వినియోగించుకున్న ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పేవారు. సేవా కార్యక్రమాలు మరింత విస్త్రృతం చేయాలనే సంకల్పంతో 2004లో అస్సాం నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ అనే సంస్థను నెలకొల్పాను. ఇందులో హెచ్ఐవీ పేషెంట్లే వాలంటీర్లు. ఈ వ్యాధి బారిన చిన్నారుల కోసం.. నా కూతురు కస్తూరి జ్ఞాపకార్థం అనాథాశ్రమాన్ని స్థాపించాను. వారి చదువు, పోషణ, చికిత్సకు అయ్యే ఖర్చును మా సంస్థ చెల్లిస్తుంది. ప్రతి ఏడాది కస్తూరి పుట్టిన రోజు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తాను. పేషెంట్లకు నిత్యావసర వస్తువులు పంపిస్తాను. అయితే, వీటన్నింటి కంటే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే.. ఆ పిల్లలంతా నన్ను ‘అమ్మా’ అని పిలవడమే’’ అని తన జీవితంలో జరిగిన ఘటనల గురించి జాహ్నవి హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో హెచ్ఐవీ పేషెంట్ అన్న విషయం బహిర్గతం చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ‘‘హెచ్ఐవీ పాజిటివ్ అయిన వాళ్లు.. జీవితంలో ఎందుకు పాజిటివ్(సానుకూలంగా) ఉండకూడదు. అలాంటి మార్గాన్ని ఎందుకు ఎంచుకోకూడదు’’ అనేది ఆమె తరచూ చెప్పే మాట. -
తాళి కట్టించుకున్న వరుడు.. ''చీర కూడా కట్టుకో''
వివాహం అయిన మహిళకు మంగళ సూత్రం, నల్లపూసలు, సింధూరం, మెట్టెలు తప్పని సరి. ఈ సాంగ్యాలు వివాహితను, పెళ్లికాని స్త్రీని వేరు చేస్తాయి. మరి ఒక పురుషుడు వివాహితుడో కాదో తెలియడం ఎలా. తాను వివాహితుడనని తెలియజేయడానికి పురుషుడు ప్రత్యేకంగా ఏం ధరించడు. ఎందుకు అంటే కారణాలు వారే చెప్పాలి. దీని సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ వివాహంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వివాహ సమయంలో వధువుతో పాటు వరుడు కూడా పెళ్లి కుమార్తె చేత తాళి కట్టించుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త కొందరు మగ మహానుభావులను కలవర పెడుతుండగా చాలా మంది మాత్రం సదరు పెళ్లి కుమారుడిని ప్రశంసిస్తున్నారు. ఈ అరుదైన పెళ్లి ముచ్చటను హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ స్టోరి తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. శార్దుల్, తనుజా ఒకే కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన నాలుగేళ్ల తర్వాత వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నామని తెలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరు అభ్యుదయ భావాలు కల వ్యక్తులు. ఆడ, మగ సమానం అని తనుజ భావిస్తే.. మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని భావించే వ్యక్తి శార్దుల్. హార్డ్‌కోర్ ఫెమినిస్ట్ అయిన శార్ధుల్పై మనసు పారేసుకుంది తనుజ. ఇద్దరు వివాహం చేసుకోవాలని భావించారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు. ఇరువురు మంగళసూత్రాలు మార్చుకోవాలని నిర్ణయం... కోవిడ్ ఫస్ట్‌వేవ్ సమయంలో వీరు ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే శార్దుల్ తన మనసులోని మాట వెల్లడించాడు. ఆగ, మగ ఇద్దరు సమానం అయినప్పుడు కేవలం స్త్రీ మాత్రమే ఎందుకు మంగళసూత్రం ధరించాలి అని ప్రశ్నించాడు. పెళ్లి నాడు తనుజ మెడలో తాను, తన మెడలో ఆమె తాళి కట్టాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి కుటుంబ సభ్యులకు చెప్తే వద్దంటారనే ఉద్దేశంతో పీటల మీదకు వచ్చే వరకు ఎవరికి తెలపలేదు. ఇక పూజారి మంగళసూత్ర ధారణ చేయమని చెప్పినప్పుడు శార్దుల్ తన నిర్ణయాన్ని తెలిపాడు. దీనికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కొందరు బంధువులు మండపం నుంచి వెళ్లిపోయారు. కాకపోతే ఎలాంటి గొడవ జరగకుండా పెళ్లి తంతు పూర్తయ్యింది. తనుజ మెడలో శార్దుల్.. ఆమె మెడలో అతడు మంగళసూత్రం కట్టారు. ఈ అనూహ్య సంఘటన గురించి ఓ న్యూస్ వెబ్సైట్ ప్రచురించడంతో ఇది తెగ వైరలయ్యింది. తాజాగా మరోసారి హ్యూమన్స్ బాంబే వారు దీన్ని ఫేస్బుక్లో షేర్ చేయడంతో మరో సారి వైరల్ అయ్యింది. చీర కట్టుకో.. పిరియడ్స్ తెచ్చుకో ఈ పెళ్లి వార్త గురించి తెలియగానే చాలా మంది శార్దుల్ మీవ విరుచుకుపడ్డారు. మగాడిగా పుట్టి ఇలాంటి సిగ్గు మాలిన పని చేస్తావా.. ఇంకేందుకు ఆలస్యం ఓ చీర కట్టుకో.. ప్రతి నెల నీ భార్యతో పాటు పిరియడ్స్ కూడా తెచ్చుకో అంటూ విమర్శించారు. కానీ చాలా మంది మాత్రం శార్దుల్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం, అంతకుమించి ఆడవారి పట్ల గౌరవం ఉండాలి.. ఫెమినిస్ట్‌నని మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించావ్ అంటూ ప్రశంసిస్తున్నారు. చదవండి: వధువు కాళ్లకు నమస్కరించిన భర్త -
50 ఏళ్ల తర్వాత ప్రియురాలిని కలవనున్న తాత..
జైపూర్: ప్రేమ గుడ్డిది.. సరిహద్దులు లేవు.. కులం, మతం లేదు అంటే.. ఆ.. అవన్ని పుస్తకాల్లోనే.. రియల్‌గా కాదు అనుకునే వారు చాలా మంది. కానీ పై వాఖ్యాలను నిజం చేసే ఘటనలు కోకొల్లలు మన సమాజంలో. దీనికి నిదర్శనంగా నిలిచే సంఘటన మరొకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. 82 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు దాదాపు 50 ఏళ్ల క్రితం దూరమైన తన ప్రేమికురాలిని తిరిగి కలవబోతున్నాడు. ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ తాత కళ్లల్లో సంతోషం వర్ణించడానికి మాటలు చాలవు. ఇంతకు ఆ ప్రేమ కథ వివరాలు ఏంటో చూడండి.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను... ప్రస్తుతం రాజస్తాన్ జైసల్మేర్‌లోని హాంటెడ్ గ్రామం కుల్ధారా గేట్ కీపర్‌గా పని చేస్తున్నాడు సదరు వృద్థుడు. తన లవ్ స్టోరి గురించి చెబుతూ.. ‘‘1970లో తొలిసారి మెరినాను చూశాను. తొలి చూపులోనే ప్రేమలో పడ్డానంటారే.. మా విషయంలో కూడా ఇదే జరిగింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా నుంచి జైసల్మేర్ వచ్చిన మెరినాను చూడగానే నేను ప్రేమలో పడ్డాను. తను కూడా అంతే. ఇక వెళ్లిపోయే ముందు తను నాకు ప్రపోజ్ చేసింది. మెరినా ‘‘ఐ లవ్ యూ’’ అన్నప్పుడు నా ముఖం సిగ్గుతో ఎర్రబడింది’’ అంటూ ఇప్పుడు కూడా సిగ్గు పడ్డాడు తాత. రూ. 30 వేలు అప్పు చేసి మరి... ‘‘ఆ తర్వాత కూడా మేం కాంటాక్ట్‌లోనే ఉన్నాం. ఒకరికొకరం ఉత్తరాలు రాసుకునే వాళ్లం. ఓ సారి తనను చూడాలనిపించింది. దాంతో 30 వేల రూపాయలు అప్పు చేసి మరి ఆస్ట్రేలియా వెళ్లాను. మూడు నెలల పాటు అక్కడే ఉన్నాను. నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు అంటే అవే. తను నాకు ఇంగ్లీష్ నేర్పితే.. నేను తనకు మా భాష నేర్పాను. ఆ మూడు నెలలు చాలా సంతోషంగా గడిచిపోయాయి’’ అంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. అలా విడిపోవాల్సి వచ్చింది... ‘‘ఆస్ట్రేలియాలో ఉండగా ఓ రోజు మెరినా ‘‘పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే ఉండిపో’’ అన్నది. కానీ అది జరిగే పని కాదు. నా కుటుంబాన్ని వదిలి అక్కడే స్థిరపడలేను. అలా అని తను నా కోసం ఆస్ట్రేలియా విడిచి రాలేదు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో మేం విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కుటుంబ ఒత్తిడి మీద నేను పెళ్లి చేసుకున్నాను. ఈ గేట్ కీపర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడు మెరినా గురించి ఆలోచించేవాడిని. తను వివాహం చేసుకుందా.. ఎలా ఉంది.. ఒక్కసారి చూస్తే బాగుండు అనుకునే వాడిని. కాలక్రమేణా తన ఆలోచనలు కూడా తగ్గిపోయాయి’’ అన్నాడు. అద్భుతం జరిగింది... ‘‘ఇలా కొనసాగుతన్న నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. నెల రోజుల క్రితం మెరినా నాకు ఉత్తరం రాసింది.. ఎలా ఉన్నావ్ నేస్తమా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆ లేఖ చూసి నేను ఎంత ఆశ్చర్యానికి గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఇది కలా.. నిజమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దాదాపు 50 ఏళ్ల తర్వాత నేను నా తొలి ప్రేమను లేఖ రూపంలో తిరిగి కలుసుకున్నాను. ఆ తర్వాత నుంచి మేం ప్రతి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం’’ అని చెబుతూ తాత తెగ సంబరపడ్డాడు. తను పెళ్లి చేసుకోలేదు... ‘‘మెరినాకు వివాహం కాలేదని తెలిసింది. త్వరలోనే తను ఇండియా రాబోతుంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఎలా ఉందంటే.. దేవుడి మీద ఒట్టు నాకు నేనే 21 ఏళ్ల కుర్రాడిలా అనిపిస్తున్నాను. తనను ఎప్పుడు చూస్తానా అని మనసు ఉవ్విళ్లురూతుంది. మా భవిష్యత్ ఎలా ఉండనుందో నాకు తెలియదు. కానీ నా ఫస్ట్ లవ్‌ని తిరిగి కలుసుకోబోతున్నాను. తను తిరిగి నా జీవితంలోకి రాబోతుంది. తనతో ప్రతి రోజు మాట్లాడటం ఎంత సంతోషంగా ఉందో మాటాల్లో వర్ణించలేను’’ అని చెబుతూ తాత తెగ సంబరపడిపోతున్నాడు. హ్యూమన్స్బాంబే తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రూ లవ్.. ఫస్ట్ లవ్ ఎఫెక్ట్ ఇదే.. తాతా నువ్వు కేక.. యూత్‌కు పోటిగా వస్తున్నావ్ కదా.. మెరినా మేడం వచ్చాక మీ ఇద్దరి ఫోటో షేర్ చేయ్ ప్లీజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర గుండె పగిలినట్లు అనిపిస్తుంది.. కానీ.. -
ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర
ముంబై: జీవితాంతం పిల్లల కోసం కష్టపడ్డాడు.. వారి కాళ్ల మీద వారు నిలబడేలా తీర్చి దిద్దాడు.. పెళ్లిల్లు చేశాడు.. బాధ్యత తీరింది. మలి సంధ్యలో మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ హాయిగా గడుపుదామనుకున్నాడు. అయితే అన్ని మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. తానోటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది. ఇద్దరు కుమారులు చనిపోయారు. కోడళ్లు, వారి పిల్లల బాధ్యత తన మీద పడింది. దాంతో విశ్రాంతిగా గడపాల్సిన జీవిత చరమాంకంలో రాత్రింబవళ్లు ఆటో నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఉన్న ఏకైక ఆస్తి ఇల్లు మాత్రమే. కానీ చివరకు దాన్ని కూడా అమ్మి.. ఆటోలోనే తిని.. అందులోనే పడుకుంటున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.... దేస్రాజ్ ఆటో నడుపుతూ జీవితం సాగించేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిని పెంచి పెద్ద చేసి వివాహం చేశాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం పని కోసం బయటకు వెళ్లిన ఓ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు. వారం రోజుల తర్వాత శవమై కనిపించాడు. చేతికి అందిన వచ్చిన కొడుకు అర్థాంతరంగా కన్ను మూస్తే.. ఆ తండ్రికి ఎంత కడుపుకోతే మాటల్లో చెప్పలేం. తన శరీరంలో సగం భాగం చచ్చిపోయినట్లు అనిపించింది దేస్రాజ్‌కు. కానీ తాను బాధపడుతూ కూర్చుంటే.. కుటుంబ సభ్యుల ఆకలి తీరదు కదా. అందుకే కొడుకు చనిపోయిన బాధను దిగమింగి మరుసటి రోజే ఆటో నడపడానికి వెళ్లాడు. దెబ్బ మీద దెబ్బ.. మరో విషాదం కొడుకు చనిపోయిన బాధ నుంచి కోలుకోకముందే.. రెండు సంవత్సరాల తర్వాత మరో విషాదం చోటు చేసుకుంది. మిగిలిన ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను పొగొట్టుకున్న ఆ తండ్రి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. అప్పుడు కూడా దేస్రాజ్ కుంగిపోలేదు. కుమారుల మరణంతో ఒంటరి వాళ్లైన తన కోడళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్ల బాధ్యత అతడి కళ్ల ముందు మెదిలింది. దాంతో బాధను దిగమింగుకుని.. వారి బాధ్యతను భుజాన వేసుకున్నాడు దేస్రాజ్. మనవరాలికిచ్చిన మాట కోసం కుటుంబాన్ని పోషించాల్సిన ఇద్దరు మగాళ్లు చనిపోవడం.. వృద్ధుడైన తాత తమ కోసం కష్టపడుతుండటం చూసిన దేస్రాజ్ మనవరాలు విలవిల్లాడింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి చదువు మానేసి.. ఏదైనా పని చేస్తానని తాతకు చెప్పింది. చదువులో ముందుండే పిల్ల.. బడి మానేసి.. పనికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవడం దేస్రాజ్‌కు నచ్చలేదు. ఆ క్షణమే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనవరాలి చదువుకు ఆటంకం కలగకూడదనుకున్నాడు. కోరుకున్న చదువు చెప్పిస్తానని మనవరాలికి మాట ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఉదయం ఆరు గంటలకు ఆటోతో ఇంటి నుంచి బయటకు వెళ్తే రాత్రి పదింటికి తిరిగి వచ్చేవాడు. అలా నెలంతా కష్టపడి 10 వేల రూపాయలు సంపాదిస్తే.. దానిలో ఆరు వేలు మనవరాలి చదువు కోసం ఖర్చు చేస్తే... మిగతా సొమ్ము కుటుంబ సభ్యుల తిండి కోసం కేటాయించేవాడు. తాత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది దేస్రాజ్ మనవరాలు. ఇంటర్లో 80 శాతం స్కోర్ చేసింది. ఆ రోజు ఆ ముసలి తాత సంబరం చూడాలి. తన ఆటో ఎక్కినవారందరికి ఈ విషయం చెప్పి తెగ మురిసిపోయాడు. ఆ రోజంతా ప్రయాణికుల దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. అప్పటి నుంచి ఆటోలోనే తిండి, నిద్ర.. ఆ తర్వాత మనవరాలు బీఈడీ చదవడం కోసం ఢిల్లీ వెళ్తానని తాతను అడిగింది. ఢిల్లీ పంపించి చదివించడం అంటే మాటలు కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కాలేజీ ఫీజు, అక్కడ ఉండి చదువుకోవడానికి హాస్టల్ ఫీజు ఇతరాత్ర ఖర్చులు చాలా ఉంటాయి. ఏం చేయాలో దేస్రాజ్‌కు తోచలేదు. ఎలాగైనా మనవరాల్ని ఢిల్లీ పంపిచాలనుకున్న ఆ ముసలి తాత.. తమకున్న ఒకే ఒక్క ఆస్తి ఇంటిని అమ్మేశాడు. భార్య, కోడళ్లు, ఇతర మనవలు, మనవరాళ్లను బంధువులు ఊరికి పంపించి.. వారు అక్కడే ఉండే ఏర్పాట్లు చేశాడు. ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మనవరాలిని ఢిల్లీ పంపించి చదివిస్తున్నాడు. ఇక నాటి నుంచి ఆటోనే తనకు ఇల్లు, వాకిలి అయ్యింది. రోజంతా ఆటో నడుపుతూ.. అందులోనే తింటూ.. ఆటోలోనే నిద్రపోతూ కాలం గడుపుతున్నాడు. ఆ మాటతో నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను దేస్రాజ్ గురించి తెలుసుకున్న హ్యుమన్స్ ఆఫ్ బాంబే వారు ఆయనతో మాట్లాడారు. ‘‘ఇంత కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.. ఎప్పుడు బాధ అనిపించలేదా’’ అని ప్రశ్నించగా.. అందుకు దేస్రాజ్ ‘‘నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టపడి పని చేయడం అలవాటయ్యింది. ప్రస్తుతం జీవితం మరీ అంత దారుణంగా ఏం లేదు. బాగానే సాగిపోతోంది. ఇక ఈ వయసులో కూడా కష్టపడటం అంటే.. నా కుటుంబం కోసమే కదా. బాధ ఎందుకు. నా మనవరాలు బాగా చదువుతోంది. మా కుటుంబం నుంచి తొలి గ్రాడ్యుయేట్ తనే. కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి.. తను క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పింది. ఆ మాటతో నేను పడిన శ్రమ అంతా మర్చిపోయాను. తను తప్పకుండా టీచర్ అవుతుంది. ఆ రోజు తనను దగ్గరుకు తీసుకుని ‘‘నన్ను గర్వపడేలా చేశావ్ తల్లి’’ అని ఆశీర్వదిస్తాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు దేస్రాజ్. వెల్లువెత్తుతున్న ప్రశంసలు.. ఆర్థిక సాయం దేస్రాజ్ కథను హ్యూమన్స్ ఆఫ్ బాంబే గురువారం తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసింది. ఇది చదివిన వారంతా ‘‘తాత నీ గురించి చదువుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు.. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావ్.. యువతలో ఉన్న ఎందరో సోమరిపోతులకన్నా మీరు వంద రేట్లు నయం. తప్పక మీ మనవరాలు టీచర్ అవుతుంది.. మీ పేరు నిలబెడుతుంది’’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక చాలా మంది నెటిజనులు దేస్రాజ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఓ ఫేస్బుక్ యూజర్ గుంజర్ రాటి దేస్రాజ్ పేరు మీద క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 270 మంది 5.3 లక్షల రూపాయలు దేస్రాజ్ కోసం ఇచ్చారు. ఇక ఈ స్టోరి కాంగ్రెస్ నాయకురాలు అర్చనా దాల్మియాను కూడా కదిలించింది. ఆమె తన ట్విట్టర్లో దేస్రాజ్ ఆటో నంబర్, మొబైల్ నంబర్, అతడు పని చేసే ప్రాంతం వివరాలు షేర్ చేశారు. ‘‘మనం ఆయనకు సాయం చేయాలి.. దయచేసి ముందుకు రండి అని’’ పిలుపునిచ్చారు. Desraj is a Auto driver on streets of Mumbai! His 2 sons hv died in accident & suicide. He drives frm 6am in th morn to 10 pm to earn Rs10000 /month. You cn find him at Khar Danda naka, Auto no 160. His no is 08657681857. We need to reach out to help. RT pl & Mumbaikars pl help. pic.twitter.com/5zAm9TtgT5 — Archana Dalmia (@ArchanaDalmia) February 11, 2021 చదవండి: ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది వధువు కాళ్లకు నమస్కరించిన భర్త -
57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను
సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్నప్పుడు మెచ్చుకున్న వారు కొందరైతే.. విమర్శించిన వారు చాలా మంది. ఎందుకంటే మన సమాజంలో విడాకులు తీసుకున్న పురుషుడి పట్ల ఉన్న జాలి స్త్రీ మీద ఉండదు. పాపం మగాడు ఒంటరిగా ఎలా బతుకుతాడు.. ఇంకో పెళ్లి చేసుకుంటే ఏం అవుతుంది అంటారు. అది ఏ వయసులో అయినా సరే. అదే స్త్రీ ఎంత చిన్న వయసులో ఒంటరి అయినా.. ఆమె ఇక అలానే బతకాలని అభిప్రాయపడుతుంది లోకం. ఆమె ఆశల్ని, అభిరుచులను, కలల్ని చంపుకుని పిల్లల కోసం బతకాలి తప్ప విడాకులు తర్వాత మహిళ మరో సారి పెళ్లి ఆలోచన చేయకూడదు. సమాజంలో ఎలా ఉన్నా.. ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో పిల్లలు ఒంటరి తల్లులకు మద్దతుగా నిలుస్తున్నారు. వారే దగ్గరుండి మరో వ్యక్తిని తల్లి జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఇలాంటి ఓ ఒంటరి తల్లి ప్రయాణానికి సంబంధించిన స్టోరీని హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసింది. (సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్) కిరణ్, టామ్‌ల ఈ లవ్‌స్టోరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వివరాలు.. కిరణ్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను నా 22వ ఏట అతడి నుంచి విడిపోయాను. ఆ సమయంలో నేను అనుభవించిన బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక్కదాన్ని పిల్లల్ని పెంచి పెద్ద చేయగలనా.. ఈ విషయం నా పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది వంటి ఆలోనలతో డిప్రెషన్లోకి వెళ్లాను. రోజుల తరబడి తిండి తిప్పలు మానేసి ఓ గదికే అంకితం అయ్యాను. అలా రెండేళ్లు గడిచింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పిల్లల కోసం అయినా సరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. విడాకులతో జీవితం ముగిసిపోలేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’’ అన్నారు కిరణ్. 50 ఏళ్ల వయసులో కూమార్తె ప్రోత్సాహంతో.. ‘‘చూస్తుండగానే నేను 50వ ఏట అడుగుపెట్టాను. మూడో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. మంచి ఉద్యోగంలో ఉన్నాను. అలా ఓ సారి నా కుమార్తె ప్రోత్సాహంతో ఓ డేటింగ్ యాప్‌లో నా బయో అప్లోడ్ చేశాను. ఇన్నాళ్లు ఫ్రెండ్స్‌కి దూరంగా బతికిన నేను.. కొత్త స్నేహితులను కలుసుకోవాలని వారితో స్నేహం చేయాలని భావించాను. దాంతో 2013లో ఓకేక్యుపిడ్లో నా బయో షేర్ చేశాను. ఆ తర్వాత టామ్ నా జీవితంలోకి వచ్చాడు. ‘‘మీ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీతో కలిసి ఓ కప్పు కాఫీ తాగాలని కోరుకుంటున్నాను’’ అంటూ మెసేజ్ చేశాడు. అలా ఐదు నెలల పాటు మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకున్న మేం.. ఆ తర్వాత స్కైప్‌కి మారాం. టామ్ కూడా నాలానే డైవర్సీ’’ అని తెలిపారు. నీ సంతోషమే మాకు ముఖ్యం ‘‘అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఓ సారి నేను కాలిఫోర్నియా వెళ్లాను. అప్పుడు టామ్ 20 గంటలు ప్రయాణం చేసి వచ్చి నన్ను కలిశాడు. మేం డిన్నర్‌కి వెళ్లాం. ఆ సమయంలో మా మాధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని తెలుసుకున్నాం. ఇక ఒకర్నిఒకరం అర్థం చేసుకోవడం ప్రారంభించాం. ఓ ఏడాది తర్వాత టామ్ గురించి నా పిల్లలకు చెప్పాను. వారు నన్ను అడిగిన మొదటి ప్రశ్న.. ‘‘తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడా.. నువ్వు సంతోషంగా ఉంటావా.. నీ సంతోషమే మాకు ముఖ్యం’’ అన్నారు. ఆ తర్వాత వారు కూడా టామ్‌తో స్కైప్‌లో మాట్లాడారు. ఆ తర్వాత మేం చాలా చోట్లకు వెళ్లాం. టామ్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తనతో కలిసి స్కూబా డైవింగ్ కూడా చేశాను అన్నారు’’ కిరణ్. 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను ‘‘ఇలా ఏడాది గడిచింది. ఓ రోజు టామ్ నాతో ‘‘నా స్నేహితుడు మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా.. అలా అయితే ఆమెకి ప్రపోజ్ చేయ్’’ అన్నాడు అని చెప్పాడు. అంతేకాక ‘‘నువ్వు అనుభూతి చెందినప్పుడు మాత్రమే చెప్పు’’ అన్నాడు తప్ప నన్ను ఫోర్స్ చేయలేదు. రెండు వారాల తర్వాత నా 57వ ఏట మరోసారి ప్రేమను అనుభూతి చెందాను. తను నా ఎదుగుదలకి తోడుగా నిలిచాడు. నేను యూకేలో పీహెచ్డీ చేయాలనకుంటున్నట్లు తనతో చెప్పాను. తన మద్దతుతో త్వరలోనే దాన్ని పూర్తి చేయబోతున్నాను. ఒకసారి నేను తనని ‘ఎందుకు నేను అడిగేంత వరకు నువ్వు నా ఫోన్ నంబర్ అడగలేదు’’ అని ప్రశ్నించాను. దానికి అతడు ‘‘నేను ఈ విషయం నీకే వదిలేశాను. నంబర్ షేర్ చేసుకోవడం సేఫ్ అని ఫీలయిన నాడు నువ్వే అడుగుతావని అలాగే ఉన్నాను’’ అన్నాడు. తను ఏలాంటి వాడో ఈ ఒక్క మాటతో అర్థం అవుతుంది. ఇక మా ఇద్దరికి వివాహం మీద నమ్మకం లేదు. ఇద్దరం పరస్పరం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటూ.. గౌరవించుకుంటూ జీవితం గడపాలని భావిస్తున్నాం’’ అన్నారు కిరణ్. ‘‘మన సంతోషాలకు వయసు అడ్డంకి కాదని నేను తెలుసుకున్నాను. ఓ మహిళ తన 50వ ఏట జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. ధైర్యంగా కలలు కనండి.. వాటి సాకారం కోసం కష్టపడండి. మరో సారి ప్రేమలో పడటానికి ధైర్యం ఉంటే చాలు.. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి’’ అంటూ చెప్పుకొచ్చారు కిరణ్. ఇక స్టోరి ఎందరినో కదిలించింది. చాలా మంది నెటిజనులు ‘‘మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. విమర్శలను పట్టించుకుంటే జీవితంలో ముందుకు సాగలేం’’.. ‘‘క్యూట్ లవ్ స్టోరి’’ అంటూ ప్రశంసిస్తున్నారు. -
వధువు కాళ్లకు నమస్కరించిన భర్త
జైపూర్: హిందూ వివాహ సంప్రదాయంలో కొన్ని తంతులు చాలా విచిత్రంగా ఉంటాయి. మాంగళ్యధారణ కాగానే అమ్మాయి భర్త కాళ్లకు దండం పెడుతుంది.. పెళ్లైన వెంటనే తన ఇంటి పేరును మార్చుకుంటుంది. మరి రివర్స్‌లో జరగదు ఎందుకు. పెళ్లి కుమారుడు అంటే శ్రీ మహా విష్ణువు అంటారు.. మరి భార్య అంటే లక్ష్మీ దేవినే కదా. కాళ్లు కడిగితే తప్పేంటి.. పాదాలకు ఎందుకు నమస్కరించకూడదు. ఆడపిల్లకు తొలుత పుట్టింటి నుంచే ఓ గుర్తింపు వస్తుంది.. మరి అలాంటప్పుడు దాన్ని మార్చుకోవడం ఎందుకు. ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడిగేతే మనకు వేరే పేర్లు పెట్టేస్తారు. మన పితృస్వామ్య సమాజంలో ఇలాంటివి మహా పాపం. వదిలేద్దాం. కానీ కొందరు మాత్రం ఈ అభిప్రాయాలతో ఏకీభవించడమే కాక ఆచరిస్తారు. అలాంటి వ్యక్తికి సంబంధించినదే ఈ కథనం. భారతీయ యువతిని ప్రేమించి.. మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని.. ఏళ్లుగా ఆడ పిల్లలు మాత్రమే పాటిస్తున్న సంప్రదాయాలను తాను పాటించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ ప్రత్యేక కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే ప్రచురించింది. (చదవండి: ప్యాంట్ సూట్లో షాకిచ్చిన వధువు!) వివరాలు.. ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల నిమిత్తం ఆమ్స్టర్డామ్లోని ఓ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే ఆమెకు ఒలేగ్ బుల్లర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు విద్యార్థి నాయకుడు. మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇద్దరి మనసులో మాత్రం ఒకరికోసం ఒకరం అనే భావన కలిగింది. అయితే వారి పరిచయం ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే ఒలేగ్‌కి అది లాస్ట్ అకడామిక్ ఇయర్. దీపా యూనివర్సిటీలో చేరిన 6 నెలలకే అతడు క్యాంపస్ నుంచి వెళ్లి పోయాడు. ఆ తర్వాత కూడా కేవలం పుట్టిన రోజు నాడు మాత్రమే మెసేజ్‌లు చేసుకునే వారు. ఇలా ఓ పుట్టిన రోజు నాడు ఆమ్‌స్టర్‌డామ్‌లో డిన్నర్‌కి మీట్ అవుదామని అడిగాడు ఒలేగ్. అప్పుడు దీప లండన్‌లో ఉంది. దాంతో ఆరు నెలల తర్వాత డిన్నర్‌కి కలిశారు. ఆ తర్వాత స్కైప్‌లో మాట్లాడుకునే వారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దీపకు ఓగ్ నుంచి డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో జరిగింది. దీప ఒక్కతే వెళ్లింది. అయితే అక్కడ ఆమెకు అనుకోని సర్ప్రైజ్ ఎదురయ్యింది. అక్కడ ఒలేగ్ ఉన్నాడు. (చదవండి: ఏడడుగులు వేసిన వేళ) పైగా అతడి చేతిలో ఉంగరం. దీప రాగానే మోకాలి మీద నిలబడి పెళ్లి చేసుకోమని కోరాడు ఒలేగ్. ఆనందభాష్పాల మధ్య దీప ఎస్ చెప్పింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల ఆమోదంతో వీరి వివాహం నిశ్చయమయ్యింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘మా వివాహం యూరోపియన్, భారతీయ సంస్కృతుల సంపూర్ణ కలయికగా నిలిచింది. ఇక వివాహ తంతులో నన్ను ఒలేగ్ పాదాలకు నమస్కరించమని చెప్పారు. అప్పుడు ఇద్దరం కేవలం ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి అని ప్రశ్నించాము. వెంటనే ఒలేగ్ నా పాదాలను తాకాడు. అంతేకాదు మేం ఒకరి ఇంటి పేరు ఒకరం మార్చుకున్నాం. నేను దీప బుల్లర్ ఖోస్లా... తను ఒలేగ్ బుల్లర్ ఖోస్లా. చాలా గర్వంగా ఉంది’ అన్నారు దీప. ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్ చాలా మందికి నచ్చింది. ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చదువెందుకు..పెళ్లిచేసేయండి అన్నారు!
సాధించాలనే తపన ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా విజయం సాధించవచ్చు అని నిరూపించింది ముంబైకి చెందిన రితు రథీ తనేజా. వృతిరీత్యా ఆమె పైలట్. అభిరుచికి తగ్గట్లు యూట్యూబర్‌గా మారి ఎంతో మంది ఫాలోవర్లని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లి కూడా. కానీ ఈ విజయాలేవీ అంత సులభంగా ఆమెకు దక్కలేదు. ఓ ఆడపిల్లకు చదువెందుకు దండగా అని నిందించే సమాజాన్ని ఎదుర్కొని, ఆటుపోట్లని అధిగమించింది. విదేశాల్లో ట్రైనింగ్ పూర్తిచేస్తానంటే.. అక్కడ ఏం అగోరించడానికి? అబ్బాయిలతో చెడు తిరుగుళ్లకు అలవాటుపడుతుంది.. పెళ్లి చేశాకే పంపించండి అంటూ బంధువుల సూటిపోటి మాటలన్నా తను సాధించలనుకున్నా లక్ష్యం వైపే పయనించింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించి తీరాలి అనే తన సంకల్పమే రితుని నేడు స్థాయిలో నిలబెట్టింది. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకొని ఎంతో మందికి స్పూర్తినింపుతోంది. (ఫెయిర్ అండ్ లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలనం ) ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రితూకి పాఠశాల స్థాయిలోనే పైలట్‌గా రాణించాలనే ఆసక్తి కలిగింది. ఈ ఆలోచనే రితు జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత తన లక్ష్యం కోసం నిరంతరం కష్టపడేది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థలో ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకుంది. తన పెళ్లి కోసం దాచిన డబ్బును చదువుకు కోసం ఖర్చుచేయమని తండ్రిని వేడుకుంది. ''విదేశాలకు ఒంటరిగా పంపిస్తే అబ్బాయిలతో చెడుతిరుగుళ్లు తిరుగుతుంది. చదివింది చాలు ఇక పెళ్లి చేయండి అని బంధువులు సూటిపోటి మాటలతో వేధించేవారు. కానీ అమ్మనాన్న మాత్రం నన్ను నమ్మి అమెరికా పంపించారు. ఏడాదిన్నర ట్రైనింగ్ అనంతరం ఇండియా తిరిగొచ్చా. కానీ ఖాళీలు లేక ఉద్యోగం దొరకలేదు. ఇలాంటి అవకాశం కోసమే అన్నట్లు ఎదురుచూసిన బంధువులు మళ్లీ నిందించడం మొదలుపెట్టారు. మేం అప్పుడే చెప్పాం కదా ఇలాంటిదేదో జరుగుతుందన్న దెప్పిపొడిచే మాటలతో మానసికంగా వేధించేవారు. మరోపక్క బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో అమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. నాన్న పరిస్థితి చూసి చాలా భాదపడ్డా. ఇంకో వైపు కుటుంబ భారం. దీంతో పార్ట్ టైం జాబ్ చేస్తూ రోజుకి 7 గంటలు చదివేదాన్ని. కొన్నినెలలకే ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా ఉద్యోగం సంపాదించాను. ఇక నా ఆనందానికి అవధుల్లేవు . ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ తెగ సంబరపడ్డాను'' అని రితూ పేర్కొంది. పైలట్‌గా నెల రోజుల్లోనే 60 విమానాల్లో ప్రయాణం చేసింది. నాలుగు సంవత్సరాల్లోనే కెప్టెన్‌గా పదోన్నతి పొందింది. నా కూతురు కెప్టెన్ అని నాన్న చెబుతుంటే ఆ ఆనుభూతి మాటల్లో చెప్పలేనిదంటూ రితూ భావోద్వేగానికి గురైంది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కి 3 లక్షలకు పైగానే సబ్‌స్కైబర్లు ఉన్నారు. ‘ఏ బంధువులైతే తనని నిందించారో ఇప్పుడు వాళ్లే నన్ను చూసి గర్వపడుతున్నారు. ఇదే కదా అసలైన విజయం’ అంటూ ఇంటర్వ్యూని ముగించింది. (అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్ ) -
గుండె పగిలినట్లు అనిపిస్తుంది.. కానీ..
‘‘నాకు ఎప్పుడైతే కోవిడ్-19 సోకిందని డాక్టర్లు చెప్పారో.. అప్పుడు నా మనసులో తలెత్తిన తొలి ప్రశ్న.. నా కూతురి పరిస్థితి ఏంటి?. ఇప్పుడు నేను హోం క్వారంటైన్లో ఉన్నాను. ప్రతి రోజూ నా చిన్నారితల్లి బెడ్రూం కిటికీ వద్దకు వస్తుంది. తన చిట్టిపొట్టి వేళ్లను గ్లాసుపై ఆనిస్తుంది. అక్కడికి నేను చేరుకోగానే పరుగెత్తుకుని వెళ్లి తనని గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది. కానీ వెంటనే నేను కోవిడ్ పేషెంట్‌ననే విషయం గుర్తుకువస్తుంది. అయినా నాలో భాగమైన తనలో నేను ఎల్లప్పుడూ కలిసే ఉంటాను కదా అని సర్ది చెప్పుకొంటాను’’ అంటూ ముంబైకి చెందిన ఆలిఫ్యా ఝవేరీ అనే మహిళ హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో తన బాధను పంచుకున్నారు. కరోనా కారణంగా 17 నెలల తన చిన్నారికి దూరంగా ఉండటం జీవితంలో అన్నింటికంటే పెద్ద విషాదమని అని ఉద్వేగానికి లోనయ్యారు. కరోనా లక్షణాలు బయటపడిన వెంటనే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని.. పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. (వైరల్: క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి.. కానీ..) ఇక ఆనాటి నుంచి తాను వేరుగా ఉంటున్నాన్న ఝవేరి..‘‘నా భర్త, వదినమ్మ మా పాపను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయినా నేను తన దగ్గర లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటలకు లేచి అమ్మా అమ్మా అని కలవరిస్తుంది. అప్పుడు నా హృదయం పగిలినట్లుగా అనిపిస్తుంది. కానీ తప్పదు. ఎప్పుడూ నా చేయి పట్టుకుని.. గుండెలపై తలదాచుకుని నిద్రపోయేది. ఇకపై అలా జరుగుతుందో లేదో తెలియదు. ఏ తల్లికైనా ఇంతకంటే నరకం ఉండదేమో’’అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఝవేరికి సంబంధించిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆమె ఆవేదనకు చలించిపోయిన నెటిజన్లు.. ‘‘త్వరలోనే మీరు కోలుకుని మీ పాపను తనివితీరా హత్తుకుంటారు. మీరు కోవిడ్‌ను తప్పక జయించి తీరుతారు’’అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతున్నారు. కాగా 60 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులతో దేశంలో అత్యధిక కోవిడ్ బాధితులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన సంగతి తెలిసిందే. (వికలాంగుడికి తోడుగా.. వీల్‌చైర్ నెట్టుతూ) -
ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది
2017 సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫోటోల్లో ఇది ఒకటి. ఓ పెళ్లి కూతురు.. తన పెంపుడు కుక్కతో దిగిన ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పెళ్లి కూతురు, కుక్క ఇద్దరూ ఒకేలాంటి దుస్తులు ధరించి దిగిన ఈ ఫోటో జంతు ప్రేమికుల మనసు దోచింది. నాడు ఫోటో ఎంత వైరల్ అయ్యిందో నేడు దాని వెనక కథ అంత కన్నా ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ఫోటోలోని యువతి పేరు మితాలి సాల్వి, కుక్కల ట్రైనర్. ఈ క్రమంలో కుక్కలతో తన పరిచయం, వాటితో తన అనుబంధం, కుక్కల ట్రైనర్‌గా విధానం వంటి పలు అంశాల గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు సాల్వి.ఆ వివరాలు ఆమె మాటల్లోనే కుక్కలే నా థెరపిస్టులు.. ‘నాకు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికి అమ్మ మరణించింది. ఆ సమయంలో నన్ను ఓదార్చింది.. నాకు స్వాంతన చేకూర్చింది ఈ కుక్కలే. చిన్న ముక్కుతో.. తోక ఊపుతూ నా చుట్టు తిరిగే ఈ కుక్కలే నాకు థెరపిస్టులు. ఇప్పటి వరకు నా జీవితంలో 13 కుక్కలు ఉన్నాయి. వాటి మీద అభిమానంతో వెటర్నరి డాక్టర్ కావాలనుకున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. వారి బలవంత మీద ఇంజనీరింగ్‌లో చేరాను’ అన్నారు సాల్వి. అలా ‘పాంటీ’ నా జీవితంలోకి వచ్చింది.. పాంటీతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఓ రోజు నేను, నా స్నేహితుడు అలీ ఇద్దరం రోడ్డు మీద నడుచుకుంటు వెళ్తున్నాం. అప్పుడు ఓ దుకాణదారుడు ఓ చిన్న కుక్క పిల్లను కొట్టడం గమనించాం. వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని కాపాడం. తర్వాత ఆ చిన్న కుక్క పిల్లను నాతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లాలనుకున్నాను. కానీ పెంపుడు జంతువులను మా హాస్టల్లోనికి అనుమతించరు. దాంతో ఆ చిన్న కుక్కను నా కాలేజీ బ్యాగులో పెట్టుకుని.. సెక్యూరిటీ కంటపడకుండా నా రూమ్‌కు తీసుకెళ్లాను’ అని గుర్తు చేసుకున్నారు సాల్వి. ‘పాంటీ’ పేరు వెనక కథ.. అయితే తన కుక్కకు పాంటీ అని పేరు పెట్టడం వెనక ఓ తమాషా సంఘటన జరిగిందన్నారు సాల్వి. ‘రూమ్‌లోకి తీసుకువచ్చిన తర్వాత ఓ రోజు ఆ కుక్క పిల్ల లాండ్రీ బకెట్లోంచి బయటకు దూకింది. అప్పుడు దానితో పాటు నా పాంటీ, బ్రా కూడా వచ్చాయి. వాటిని మీద వేసుకుని నా వద్దకు పరిగెత్తుకు వచ్చింది. అది చూసి దానికి ‘పాంటీ’ అని పేరు పెడితే బాగుంటుందనిపించింది. అందుకే దానికి ‘పాంటీ ’అని పేరు పెట్టాను అంటూ గుర్తు చేసుకున్నారు సాల్వి. కుక్కల ట్రైనర్‌గా ఎలా మారానంటూ.. ‘ఓ రోజు ‘పాంటీ’కి వాక్సిన్ వేపించాలని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ అది ప్రవర్తించిన తీరు వైద్యులను ఆకర్షించింది. ‘పాంటీ’ఎక్కడైన శిక్షణ ఇప్పించారా అని ప్రశ్నించారు. వారి ప్రశ్న నాకొక అవకాశాన్ని చూపించింది. దాంతో నేను కుక్కల ట్రైనర్‌గా మారాలనుకున్నాను. దీని గురించి ఇంట్లో వారికి చెప్తే ఒప్పు కోలేదు. అయితే ఈ విషయంలో అలీ నాకు మద్దతిచ్చాడు. దాంతో మేం ఇద్దరం పొదుపు చేసిన డబ్బుతో నేను కుక్కల ట్రైనర్‌గా శిక్షణ పొందాను. ఇప్పటికి 500 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాను. ‘పాంటీ’ నాకు సహయకురాలిగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి. అంతేకాక ‘నాకు నచ్చిన కెరియర్ను ఎంచుకోవడంతో పాటు.. అలీతో వివాహం వరకు నా జీవితంలోని ప్రతి ముఖ్య దశలో ‘పాంటీ’ నాతో పాటే ఉంది. అందుకే వివాహం రోజున నేను, ‘పాంటీ’ ఒకే రకమైన దుస్తులు ధరించాము. తను నాకు ఎంతో మంచి స్నేహితురాలు’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి. రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఇప్పటికే 16 వేల మంది దీనిపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 99 వేల మంది లైక్ చేశారు. ‘మీ కథనం చాలా బాగుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేం కూడా మా పెళ్లిలో మా కుక్కలకు మేం వేసుకున్న లాంటి బట్టలే కుట్టించాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
జంతువులపై ప్రేమ జీవితాన్నే మార్చేసింది
మన మంచితనం, సహాయక గుణం ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుందనడానికి మరోసారి నిరూపించాడు ఓ 27 ఏళ్ల యువకుడు. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వీధి శునకాలను కాపాడడానికి ఆ యువకుడు కనుగొన్న పద్దతిని మెచ్చి అతన్ని అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా. ఆ యువకుడి పేరు శాంతను నాయుడు. తాను ఉద్యోగం పొందిన తీరు, శునకాలను కాపాడడానికి కనుగొన్న పద్దతిని ఫేస్బుక్ పేజీ ‘ హ్యుమాన్స్ ఆప్ బాంబే’ లో వివరించారు. ‘ఐదేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వీధి కుక్కను చూపి చలించిపోయా. అవి రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నాయని తెలుసుకొని వాటిని ఎలాగైనా కాపాడాలని డిసైడ్ అయ్యాను. స్నేహితులతో కలిసి ఓ రిఫ్లెక్టర్ బెల్టు(పరావర్తనం చెందే బెల్టులు) ను తయారు చేశాను. రాత్రి పూట డ్రైవర్లకు కనిపించేలా ఆ బెల్టులను వీధి శునకాల మెడకు తొడిగించాను. దీంతో రాత్రి వేళలో శునకాలు రోడ్లపై పరిగెత్తినా.. డ్రైవర్లకు ఆ బెల్టులు కనిపించి వాహనాలను నిలిపివేస్తారు. ఈ ఆలోచనతో రోడ్డు ప్రమాదంలో చనిపోయే శునకాల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఆలోచన విస్తృతంగా వ్యాపించి టాటా గ్రూప్ ఆప్ కంపెనీ ‘న్యూస్‌లెటర్’లో అచ్చయింది. ఆలోచన బాగానే ఉన్నా.. రిఫ్లెక్ట్ బెల్టులను ఉచితంగా పంపిణీ చేయడం నాకు ఆర్థికంగా ఇబ్బందైంది. అదే సమయంలో రతన్ టాటాకు శునకాలంటే అమిత ప్రేమ అని, అతనికి లేఖ రాస్తే సహాయం అందుతోందని మా నాన్న సలహా ఇచ్చారు. తొలుత కొంత తటపటాయించినా, రాస్తే పోయేది ఏముందిలే అనుకొని టాటాకు లేఖ రాశాను. ఆ లేఖనే నా జీవితాన్ని మార్చేసింది. రెండు నెలల తర్వాత నన్ను కలవాలని రతన్ టాటా నుంచి లేఖ వచ్చింది. నమ్మలేక పోయాను. కొద్ది రోజుల తర్వాత రతన్ టాటాను ఆయన కార్యాలయంలో కలిశాను. నా ఆలోచన ఆయనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఆయన పెంచుకుంటున్న శునకాలను కూడా చూపించాడు. తర్వాత పై చదువుల కోసం విదేశాలకు పోయాను. నేను స్వదేశానికి తిరిగి వచ్చాక టాటా ట్రస్ట్‌లో పనిచేస్తానని ప్రామిస్ చేశా. చదువు ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చాక ఓ రోజు రతన్ టాటా నుంచి ఫోన్ వచ్చింది. ‘ ఆఫీస్‌లో ఉన్న పనులతో చాలా బీజీ అయిపోతున్నాను. నువ్వు నాకు అసిస్టెంట్‌గా ఉండగలవా ’అని కోరారు. ఒక్కసారిగా షాకయ్యాను. పారిశ్రామిక దిగ్గజం నన్ను అసిస్టెంట్‌గా ఉంటారా అని అడగడం నమ్మలేకపోయా. వెంటనే సరే అన్నాను’ అని శంతను చెప్పుకొచ్చాడు. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘గ్రేట్ స్టోరీ’, ‘మన మంచితనం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
‘నాన్న ప్రత్యక్ష నరకం చూపించేవాడు’
భారతీయ సంస్కృతికి విదేశాలు జేజేలు పలకడానికి ముఖ్య కారణం ఇక్కడున్న వివాహ, కుటుంబ వ్యవస్థలే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం ఒక కుటుంబంగా రూపాంతరం చెందుతుంది. అది క్రమేణా వృద్ధి చెంది సంస్కారవంతమైన సమాజానికి బీజం వేస్తుంది. అయితే ఇదంతా సవ్యంగా సాగడం అనేది భార్యాభర్తలుగా మారిన ఆ ఇద్దరు వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. జంటలో ఏ ఒక్కరూ బాధ్యతగా, బంధం నిలుపుకొనే విధంగా మసలుకోకపోయినా ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోతే వారి పిల్లలు అనుభవించే మానసిక వేదన వర్ణనాతీతం. ఆ గొడవల తాలూకు ఛాయలు జీవితాంతం వారిని వెంటాడుతాయి. అంతేకాదు ఆ చేదు ఙ్ఞాపకాలు ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తాయి. అయితే ప్రతీ సమస్యకు చావే పరిష్కారం కాదని బలంగా విశ్వసించిన వారు..అటువంటి ప్రయత్నాల నుంచే పాఠాలు నేర్చుకుని అందమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ముంబైకి చెందిన ఓ యువతి జీవితానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న ఆమె స్టోరీని ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీ షేర్ చేసింది. ‘కష్టాలను తట్టుకుని విధిని ఎదిరించి నిలబడగలిగే నీలాంటి వాళ్లు.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విరమించుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు’ అంటూ నెటిజన్లు ఆమె స్టోరీని వైరల్ చేస్తున్నారు. సమకాలీన పరిస్థితుల్లో రెండు కోణాలను స్పృశిస్తున్న ఆ పోస్టు సారాంశం ఇది... ‘చిన్నపాటి, ఇరుకైన అపార్టుమెంటులోని ఓ ఇంట్లో పుట్టిపెరిగాను. పెరిగి పెద్దవుతున్న కొద్దీ తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు నాకు అర్థమవసాగాయి. తరచుగా తగువులాడుకునే వారు. మా నాన్నకు అక్రమ సంబంధం ఉందని అమ్మ ఆరోపణ. ఆ వేదనతో తానెంతో కుంగిపోయేది. బాధ భరించలేక ఓ రోజు నాన్నతో తీవ్రంగా గొడవపడింది. దీంతో నాన్నకు పట్టలేనంత కోపం వచ్చింది. బెల్టు తీసుకుని అమ్మను దారుణంగా కొట్డాడు. ఆ మరుసటి రోజు నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సరుకులు తేవడం మానేశాడు.నాన్న ప్రవర్తనతో విసిగిపోయిన అమ్మ చచ్చిపోదామని నిర్ణయించుకుంది. నన్ను తనతో పాటు బీచ్‌కు తీసుకువెళ్లి ఇద్దరం చనిపోదాం అని చెప్పింది. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంది. తన ఆలోచన తప్పు అని తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చింది. నాన్న మారతాడేమోనని ఎదురుచూసింది కానీ అలా జరుగలేదు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాన్న మీద కేసు పెట్టింది. కాసేపటి తర్వాత నాన్న హాయిగా ఇంటికొచ్చేశాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు.ఆనాటి నుంచి మాకు ప్రత్యక్ష నరకం చూపించే వాడు. అమ్మ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. అక్కడే నాకొక వ్యక్తి పరిచయమయ్యాడు. నాకన్నా ఐదేళ్లు పెద్దవాడు. ఎంతో చక్కగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో తనతో ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా తను వెళ్లిపోతున్నానని, ఇక ఇక్కడ ఉండటం కుదరని చెప్పేశాడు. దాంతో అతనితో బాగా గొడపపడ్డాను. అచ్చం అమ్మానాన్నల గొడవలాగే అనిపించింది. నా గుండె పగిలిపోయింది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఆరోజు బాధతో వీధి వెంట పిచ్చిగా పరిగెత్తాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. దగ్గర్లో ఉన్న ఓ షాపులోకి వెళ్లి ఫినాయిల్ బాటిల్ కొనుక్కుని అక్కడే తాగేశాను. తెల్లవారి మెలకువ వచ్చింది. ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాను. 24 గంటల పాటు ఐసీయూలో ఉంచారు. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. నిజంగా చావాలనుకుంటే కాస్త గట్టిగా ప్రయత్నం చేయవచ్చు కదా అన్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నా స్నేహితులు ఎవరూ నన్ను చూడటానికి రాలేదు. నాలాంటి వాళ్లతో వాళ్లకు స్నేహం అక్కర్లేదట. ఇరుగుపొరుగు వారికి నేనొక గాసిప్ అయిపోయా. నా జీవితం మరింత కఠినంగా మారింది. వాళ్ల కారణంగా ఎంతో వేదన అనుభవించా. కనీసం ఒక్కరైనా నా బాధను అర్థం చేసుకుని ఆత్మీయంగా పలకరిస్తే చాలు అనుకున్నా. అలా జరగలేదు. అయితే ఆ సంఘటనలే నాలో మార్పునకు కారణమయ్యాయి. నేనెందుకు చావాలి అనే ప్రశ్నను రేకెత్తించాయి. కౌన్సిలింగ్‌కి వెళ్లాను. ధ్యానం చేశాను. జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాను. కొన్నాళ్ల తర్వాత అమ్మా, నేను ఇళ్లు వదిలి వచ్చేశాము. జర్నలిజంలో మాస్టర్స్ చేశాను. ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నా. ఇదంతా జరిగి చాలా ఏళ్లు అవుతుంది. ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్ ఉంది. నాకు తోడుగా కొంతమంది ఉన్నారు. మేమంతా కలిసి చిన్న చిన్న సామాజిక కార్యక్రమాలు చేపడతాము. సరదాగా బయటికి వెళ్తాం. అయితే ఇప్పటికీ నా గతానికి సంబంధించిన మరకలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటి వల్లే కదా ఎలా ఉండకూడదో అన్న విషయం తెలిసింది కదా అని సర్దిచెప్పుకొంటాను. నిజానికి ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీలేదు’ అంటూ తన గతం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది సదరు యువతి. ఎదుటివారి గురించి మాట్లాడే ముందు, వారిని జడ్జ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించమని సలహా కూడా ఇచ్చింది. ఎందుకంటే కనిపించేదంతా నిజం కాకపోవచ్చు... ఎదుటి వారు మన నుంచి ప్రేమ, దయ, ఆప్యాయత కోరుకుంటూ ఉండవచ్చు. బహుశా మీరు చూపించే చొరవ వారి చావుబతుకులను నిర్ధేశించేదిగా ఉండవచ్చు అనేది ఆమె భావన. అంతేకదా.. బాధలో ఉన్న వారి వైపు ఆత్మీయంగా చూసే చూపు...చిందించే ఓ చిరునవ్వు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎదుటి వారిలో ఆత్మన్యూనతను పోగొట్టి.. సానుకూల దృక్పథంతో కొత్త జీవితానికి పునాదులు వేసే ప్రేరణా శక్తిని కలిగి ఉంటాయి. -
‘తనతో జీవితం అత్యద్భుతం’
ప్రాణ స్నేహితులు మంచి భార్యాభర్తలు కాలేకపోవచ్చు... కానీ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న దంపతులు ప్రాణ స్నేహితులుగా మెలగవచ్చు...పెళ్లికి ముందు కనీసం పరిచయం లేకున్నా సరే ప్రేమికులుగా మారి జీవన మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినా వైవాహిక బంధంతో ఒక్కటైన ఆ జంట కష్టసుఖాలను పంచుకుంటూ తోడూనీడలా ఒకరికొకరు వెన్నంటి ఉంటే ప్రతీ ఇల్లూ స్వర్గసీమే అవుతుంది. దాంపత్య బంధాన్ని దృఢంగా ఉంచే ప్రేమ.. పెళ్లికి ముందు పుట్టిందా లేదా పెళ్లి తర్వాత మనసులను పెనవేసిందా అనే విషయంతో సంబంధం లేదంటున్నారు ఈ ముంబై కపుల్. ఒకరికొకరై బతికితే అందం, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు. ‘నేనో చిన్నపట్టణంలో జన్మించాను. నాకు తొమ్మిది మంది తోబుట్టువులు. పెద్ద కుటుంబం కాబట్టి నేనెప్పుడూ ఊరు దాటి బయటికి వెళ్లింది లేదు. మాకు అంత స్థోమత, సమయం లేవు. అయితే కాలం గిర్రున తిరిగింది. పెళ్లితో నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి పెళ్లి రోజే నేను తొలిసారిగా ఆయనను చూశాను. అప్పుడు నాతో ఆయన అన్న మాటలన్నీ ఇంకా గుర్తున్నాయి. పెళ్లైన వెంటనే ఆయన నన్నో మాట అడిగారు. నువ్వు సరదాగా ఏనాడైనా బయటికి వెళ్లావా అని. ఎక్కడికీ వెళ్లలేదు. నాకు పాస్‌పోర్టు కూడా లేదు అని చెప్పాను. అప్పుడు నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నాలో భాగమయ్యావు. మనమిద్దరం కలిసి ప్రపంచాన్ని చుట్టేద్దాం అని చెప్పారు. హనీమూన్ కోసం డార్జిలింగ్.. ఇద్దరం ఉద్యోగస్తులం కావడంతో సరదా ట్రిప్ కాస్త వాయిదా పడింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే ఏడాదికి రెండుసార్లు కచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాం. అలా హనీమూన్ కోసం డార్జిలింగ్ వెళ్లిన నాటి నుంచి మా ప్రయాణం ప్రారంభమైంది. బస్సులో బయల్దేరాం. ఓ వైపు ఉరుములు..మెరుపులు.. మరోవైపు కుండపోత వర్షం. కిటికీలు తెరచి ఉండటంతో మాపై నీళ్లు పడ్డాయి. దీంతో వెంటనే ఆయన కిటికీని మూసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో కిటికీని పూర్తిగా విరగ్గొట్టేశారు. ఇక చెప్పేదేముంది బస్సు మొత్తం నీళ్లతో నిండిపోయింది. దాదాపు 12 గంటల పాటు అలాగే కూర్చుండిపోయాం. హోటల్‌కి వెళ్లిన తర్వాత ఇవన్నీ గుర్తుచేసుకుని హాయిగా నవ్వుకున్నాం. ఆరోజు చాలా భయం వేసింది.. ఖాట్మండు, షిమ్లా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించాం. సరైన సమయానికి రైల్వే స్టేషనుకు చేరుకోలేక ఎన్నోసార్లు ప్లాట్‌ఫాంపై సూట్‌కేస్‌లపై నిద్ర పోవాల్సి వచ్చేది. అయినా ఏనాడు విసుగు చెందలేదు. కలిసి చేసే ప్రయాణంలోని మాధుర్యం అది. ఒకరోజు బద్రీనాథ్‌కు పయనమయ్యాం. కొద్దిదూరం వెళ్లగానే దారులన్నీ మూసివేశారు. దీంతో అక్కడున్న ఓ గుడిసెలో బస చేయాల్సి రావచ్చని మా గైడ్ సూచించాడు. అయితే రాత్రంతా ఏవో శబ్దాలు వినబడ్డాయి. నాకు చాలా భయం వేసింది. తెల్లవారి బయటికి వచ్చి చూస్తే మా ఆయన ఒకటే నవ్వడం. రాతి మీద నీళ్లు పడుతున్న శబ్దం అది. రొమ్ము క్యాన్సర్ రావడంతో.. మా ‘జీవన ప్రయాణం’లో భాగంగా యూరోప్ వెళ్లేందుకు పొదుపు చేయడం మొదలుపెట్టాం. అదేవిధంగా వీలు చిక్కినప్పుడల్లా యూరోప్ పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు పుస్తకాలు చదివేవాళ్లం. ఇలా సాఫీగా.. సరదాగా సాగుతున్న జీవితంలో పెద్ద కుదుపు. ఛాతిలో నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకోగా నాకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు తేలింది. కీమోథెరపి మొదలైంది. అప్పుడు నా భర్త బాధ వర్ణనాతీతం. నన్ను కోల్పోతాననే భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అలా ఐదేళ్లు గడిచిన తర్వాత నేను పూర్తిగా కోలుకున్నాను. మళ్లీ మా ప్రయాణం మొదలైంది. యూరోప్, లండన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్... ఆఖరికి ఇటలీ కూడా వెళ్లొచ్చాం. ఇక ఆస్ట్రేలియా, రష్యాలకు వెళ్లడమే మా ముందున్న లక్ష్యం. తనను కలిసిన మొదటిరోజు తను నాకు అపరిచితుడు. కానీ ఇప్పుడు తనే నా కలల ప్రపంచం. తనతో జీవితం అత్యద్భుతం. తనతో ప్రేమలో మునిగిపోతానని ఏనాడు ఊహించలేదు. అలాగే ఇద్దరం కలిసి ఇలా ప్రపంచాన్ని చుట్టొస్తామని కూడా. నన్ను సర్ప్రైజ్ చేయడంలో తను ఎన్నడూ విఫలమవ్వలేదు. నోరు తెరచి ఏదీ అడగకపోయినా జీవితకాలానికి సరిపడా ఎన్నెన్నో మధురానుభూతులను నాకు మిగిల్చాడు’ హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీ షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. లైకులతో షేర్లతో దూసుకుపోతున్న ఈ అందమైన ప్రేమకథ ప్రతీ యువ జంటకు ఆదర్శనీయమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీ బంధం ఇలాగే కలకాలం వర్థిల్లాలి అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
‘నా భర్తకు కేవలం నా శరీరంతోనే పని’
అత్యాధునిక 21వ శతాబ్దంలో ఉన్నాం. అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాం.. కానీ ఆడవారి విషయంలో అంతకంతకు దిగజారిపోతున్నాం. ఓ మహిళ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తుంది అంటే.. దాని వెనక ఎన్నో కారణాలు. ఆసక్తి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనుకోవడం.. ఆర్థిక అవసరాలు. కారణం ఏదైనా కావచ్చు. ఆమెకు మద్దతివ్వకపోయినా పర్వాలేదు.. మర్యాద మంట కలిసేలా ప్రవర్తించకపోతే సరి. తోడుగా ఉంటానని బాస చేసిన భర్త వదిలేయంతో తనపై ఆధారపడిన ముగ్గురు బిడ్డల ఆకలి తీర్చడానికి ఓ తల్లి రోడ్డెక్కింది. ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తుంది. అయితే తన ప్రయాణం అంత సాఫీగా సాగడం లేదని.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నానని.... కానీ తన పిల్లల కోసం వాటన్నింటిని భరిస్తున్నానని తన గాథను చెప్పుకొచ్చింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో వచ్చిన ఓ మహిళా ఆటో డ్రైవర్ కథ ఎంతో మందిని కదిలిస్తోంది. అమ్మ రెండోపెళ్లి చేసుకుంది... ‘నా పేరు షిరీన్. నేను ఓ సంప్రదాయవాద, పేద ముస్లిం కుటుంబంలో జన్మించాను. నాకు 11 ఏళ్లు వచ్చే సరికి మా అమ్మనాన్న మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. వారి తగువుల మధ్య నేను ఎంతో నలిగిపోయాను.. నష్టపోయాను. కొద్ది రోజుల్లోనే మా అమ్మ నాన్న విడాకులు తీసుకున్నారు. అయితే మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. అందుకే విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే పునర్వివాహం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని సమాజం అంత తేలికగా తీసుకోలేకపోయింది. ఓ రోజు మా అమ్మ నా సోదరుడితో కలిసి బయటకు వెళ్లింది. అప్పుడు కొందురు మగవారు మా అమ్మ దగ్గరకు వచ్చి ఆమెను తిట్టడం ప్రారంభించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు ఆమెను వ్యక్తిత్వాన్ని కించపరిచారు. నా సోదరుడిని కూడా అవమానించారు. ఇది మా అమ్మ మీద చాలా ప్రభావం చూపించింది. దాంతో అదే రోజు రాత్రి మా అమ్మ తన ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది’ అని అన్నారు షిరీన్. ‘మా అమ్మను కోల్పోవడం నా జీవితంలో అన్నింటకంటే పెద్ద విషాదం. దాన్ని నుంచి బయటపడేలోపే మా నాన్న నాకు, నా సోదరికి వివాహం జరిపించాడు. మా వివాహ జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. నా సోదరి గర్భవతిగా ఉండగా.. ఆమె అత్తింటి వారు విషం ఇచ్చి తనను చంపేశారు. ఇది నా జీవితంలో మరో పెద్ద షాక్. నేను ఎంతగానో ప్రేమించే అమ్మ, సోదరి నాకు దూరమయ్యారు. మొదటి సారి నా జీవితం అంధకారంగా మారింది అనిపించింది. జీవితం మీద ఆశలు కోల్పోయాను. అయితే అప్పుడే నేను గర్భవతిని అని తెలిసింది. నాకొక కొడుకు జన్మించాడు. వాడి కోసమైన బతకక తప్పని పరిస్థితి. ఈ లోపు నా సంసార జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. మూడో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా భర్త మా గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. అతనికి కేవలం నా శరీరంతో మాత్రమే పని. ఒకరోజు పడక గదిలో తన అవసరం తీరాక తలాక్ అంటూ మూడుసార్లు చెప్పి నాకు విడాకులు ఇచ్చాడు’ అని తన జీవితంలోని విషాదాన్ని వివరించారు షిరీన్. తొలుత బిర్యానీ సెంటర్.. ‘భర్త నిర్ణయం మేరకు... ముగ్గురు బిడ్డలతో రోడ్డు మీద పడ్డాను. ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆదరించే వారు లేరు. ముగ్గురు బిడ్డల ఆకలి తీర్చాలి. దాంతో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. బిడ్డల ఆకలి తీర్చడమే నా ముందున్న అతిపెద్ద సవాలు. అందుకోసం ఓ చిన్న బిర్యానీ సెంటర్ ప్రారంభించాను. అది బాగా పుంజుకుంటున్న సమయంలో బీఎంసీ అధికారులు అనుమతులు లేవంటూ దాన్ని కూలదోశారు. మరోసారి రోడ్డున పడ్డాను. ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆటో రిక్షా నా కళ్ల ముందు కదలాడింది. నా భర్త ఆటో నడిపేవాడు. పిల్లల కడుపు నింపడం కోసం నేను కూడా ఆటో నడపాలని భావించాను. దాంతో నేను దాచుకున్న సొమ్ముతో ఓ ఆటో కొన్నాను’ అన్నారు షిరీన్. ‘ప్రస్తుతం ఆటో నడుపుతూ నా పిల్లలను పోషిస్తున్నాను. తద్వారా బాగానే సంపాదిస్తున్నాను. నా పిల్లలకు కావాల్సినవి సమకూర్చుతున్నాను. కానీ అవమానాలు మాత్రం తప్పడం లేదు. మహిళను కావడంతో జనాలు నన్ను చులకనగా చేసి చూడటం, అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇతర ఆటో డ్రైవర్లు కూడా నన్ను అణగదొక్కాలని చూస్తారు. కానీ వీటన్నింటిని తట్టుకుంటూనే.. ఏడాది కాలంగా ఆటో నడుపుతున్నాను. ఆ సంపాదనతోనే ఇళ్లు నడిపిస్తున్నాను. నా పిల్లల కోసం కారు కొనాలనేది నా కోరిక. త్వరలోనే దాన్ని కూడా సాధిస్తాను. అయితే అవమానాలే కాదు.. నా ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల్లో కొందరు నన్ను చాలా పొగుడుతుంటారు. చప్పట్లతో నన్ను అభినందిస్తూ.. టిప్పు కూడా ఇస్తారు’ అన్నారు. భయ్యా కాదు..దబాంగ్ లేడీ ‘ఓ సారి ఓ గమ్మత్తయిన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి నా ఆటో ఎక్కాడు. నన్ను పురుషుడిగా భావించి.. భయ్యా అని పిలిచాడు. కానీ నేను మహిళనని తెలిసిన తార్వత నన్ను ‘దబాంగ్ లేడీ’ అని పిలిచాడు. నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మహిళలు తల్చుకుంటే ఏదైనా చేయగలరు. ఎవరో పెట్టిన నియమాలకు లోబడి స్త్రీ జీవించాల్సిన అవసరం లేదు. నా చెల్లి, తల్లిలా మరో మహిళ బాధపడకూడదనేది నా కోరిక. ఇదంతా నేను కేవలం నా కోసం మాత్రమే చేప్పడం లేదు.. నిశబ్దంగా బాధను భరిస్తున్న ప్రతి మహిళకు ధైర్యం చెప్పడం కోసమే నా కథను చెప్పుకొచ్చాను’ అన్నారు షిరీన్. -
‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’
నటి శిల్పా శెట్టి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటే.. సెలబ్రిటీ బిగ్ బ్రదర్ షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు శిల్పా శెట్టి. ‘17వ ఏట సినిమాల్లో అడుగుపెట్టాను. ప్రపంచం గురించి, జీవితం గురించి నాకు ఏ మాత్రం అవగాహన లేదు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లడం మాత్రమే చేశానం’టూ చెప్పుకొచ్చారు శిల్పా శెట్టి. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటల్లోనే.. ‘1993లో వచ్చిన బాజీగర్ చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. నన్ను టాప్ హీరోయిన్ని చేసింది. సినిమాల్లో నటించాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సరదాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. అప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ నా ఫోటోలు తీశాడు. అతనేదో ఊరికే అడగుతున్నాడు అనుకున్నాను. కానీ నిజంగానే నా ఫోటోలు తీశాడు.. అది కూడా చాలా అందంగా. దాంతో నాకు మోడలింగ్ అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్లో చాన్స్ రావడం.. ఆ తర్వాత మరి ఇక నేను వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా ఎంతో ముందుకు.. ఎత్తుకు వెళ్లాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘17 ఏళ్ల వయసు అంటే ప్రపంచం గురించే కాదు జీవితం గురించి కూడా సరైన అవగాహన ఉండదు. కానీ అంత చిన్న వయసులోనే ఓ సెలబ్రిటీని కావడం.. సక్సెస్‌ఫుల్‌గా రాణించడం జరిగిపోయాయి. కానీ అప్పటికి నేనింకా వీటికి తయారుగా లేను. ఇక పోతే నాకు హిందీ రాదు. దాంతో కెమరా ముందు నిల్చోవాలంటేనే ఒణుకు వచ్చేద’ని చెప్పుకొచ్చారు. 2007లో వచ్చిన ‘ఆప్నే’ శిల్పా శెట్టి నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత ఆమె సినిమాల్లో కనిపంచలేదు. ఈ విషయం గురించి ఆమె ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఒక సందర్భం వస్తుంది’ అన్నారు. ‘నేను నటించిన సినిమాల్లో కొన్ని మంచి విజయం సాధించాయి. అయినా కూడా నేను ఇంకా వెనకబడి ఉన్నాననే అనుకునేదాన్ని. మరింత కష్టపడాలని భావించేదాన్ని’ అన్నారు. అంతేకాక ‘ఓ చిత్రం విజయం సాధించినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం.. మరో చిత్రం ఫెయిల్ అయనప్పుడు బాధపడుతూ మర్చి పోవడానికి ప్రయత్నించడం అనే విషయాలు అంత తేలికైనవేం కాద’న్నారు. అంతేకాక ‘కొన్ని సార్లు సరైన కారణం చెప్పకుండానే నిర్మాతలు తమ సినిమాల నుంచి నన్ను తొలగించేవారు. వారి పేర్లు కూడా నాకు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు వాటిని బయట పెట్టడం కూడా అనవసరం. అయితే అలా జరగినప్పుడు ప్రకృతి నాకు వ్యతిరేకంగా పని చేస్తుందని అనుకునేదాన్ని. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపలేదు’ అన్నారు. ఇక ప్రముఖ బ్రిటీష్ రియాలిటీ షో ‘సెలబ్రిటీ బిగ్ బ్రదర్ సీజన్ 5లో పాల్గొనడం నిజంగా తన అదృష్టం అన్నారు. ‘ఆ షో నా మీద చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే ఈ ప్రొగ్రాంలో నా దేశం మూలంగా నేను బహిరంగ అవమానానికి, వివక్షకు గురయ్యాను. కానీ షోలో గెలిచిన తర్వాత చాలా మంది ‘మమ్మల్ని గర్వపడేలా చేశావం’టూ మెచ్చుకున్నారు. ‘జీవితంలో కొన్ని సార్లు చాలా క్లిష్ట పరిస్థితులు చూశాను.. మరి కొన్ని సార్లు ఎంతో మధుర క్షణాలు చూశాను. కానీ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను. ఫలితం ఈ రోజు నేనొక బలమైన స్వతంత్ర మహిళగా, యాక్టర్‌గా, భార్యగా, తల్లిగా మీ ముందు ఇలా నిల్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. శిల్పా 2009లో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్నారు. వీరికొక బాబు వియాన్. -
‘క్రూరంగా పశువులా ప్రవర్తించాడు.. అందుకే’
హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ యువతి రాసుకొచ్చిన పోస్టును ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటే..మరికొంత మంది మాత్రం ఎప్పటిలాగానే ఇప్పుడెందుకు.. అప్పుడేం చేశావు... నీకు నచ్చలేదు.. బాధ కలిగింది కాబట్టే ఇప్పుడు అతడి గురించి బయటపెట్టావా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ నెగటివ్ కామెంట్స్ చదువుతుంటే విషయమేంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్టే. గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక హింస, వేధింపుల గురించి శ్రుతీ చౌదరి అనే అమ్మాయి నిర్భయంగా అందరితో పంచుకుంది. అంతేకాదు తన #మీటూస్టోరీ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని ధైర్యంగా ‘అతడి’ ముసుగును తొలగించింది. తనలా ఎవరూ మోసపోకూడదని.. అతడి బారి నుంచి కనీసం ఒక్కరిని కాపాడినా సరే తను విజయం సాధించినట్లేనని పేర్కొంది. ఆ పోస్టు సారాంశం ఇలా.. ‘అందరిలాగానే కలలు సాకారం చేసుకునేందుకు... చిన్న పట్టణం నుంచి ముంబై మహానగరానికి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాకే ఎన్నెన్నో సత్యాలు నాకు బోధపడ్డాయి. ఓరోజు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఓ వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో నా రాతలు చూసి తన దగ్గర రైటర్‌గా పనిచేయాలంటూ కోరాడు. సరే అన్నాను. కలిసి పనిచేస్తున్న క్రమంలో మా మధ్య స్నేహం చాలా బలపడింది. ఆత్మీయుడిగా భావించి నాకున్న అభద్రతా భావం గురించి, ఇతర సమస్యల గురించి అతడితో పంచుకోవడం ప్రారంభించాను. తరుచుగా కలుసుకునేవాళ్లం(అన్ని విధాలుగా). అయితే మా స్కాట్లాంట్ ట్రిప్ వరకు అంతా బాగానే జరిగింది. ఆరోజు రాత్రి మేము ఔటింగ్‌కు వెళ్లాల్సింది. కానీ అకస్మాత్తుగా వద్దన్నాడు. అయితే నేను అందుకు సిద్ధంగా లేనని చెప్పాను. కాసేపటి తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాతో కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాట్లాడటం మానేశాడు. దాంతో గిల్టీగా ఫీలయ్యాను. తన కోరిక కాదన్నందుకు బాధపడతాడేమోనని సరేనన్నాను. కానీ తను మాత్రం అలా అనుకోలేదు. చాలా కఠినంగా, పశువులా ప్రవర్తించాడు. ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి కదా అన్నా వినలేదు. శారీరక హింసకు గురిచేశాడు. అలా చాలాసార్లు ఎంతగానో హింసించాడు. కొన్ని రోజుల తర్వాత తనతో ‘బంధం’ తెంచుకోవాలని అనుకున్నాను. తను కూడా సరేనన్నాడు. సహచర ఉద్యోగుల్లా మాత్రమే ఉన్నాము. కానీ ఓ రోజు నాకు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాను. అతడు కేవలం నాతోనే కాదు చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు అని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. అతడి నిజస్వరూపం గురించి బయటపెట్టాలని భావించాను. నాలా ఎంతమంది అమ్మాయిలు ఈ లైంగిక హింసను ప్రేమలో భాగం అనుకుని పొరబడ్డారో తెలిసి, నా మూర్ఖత్వం గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాను. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో నా మీటూస్టోరీని బహిర్గతం చేశాను. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. మళ్లీ ఆన్ చేయగానే నా పోస్టు వైరల్‌గా మారడం చూసి ఆశ్చర్యపోయాను. పదుల కొద్ది సంఖ్యలో అమ్మాయిలు అతడిని నమ్మిన తీరు, ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలుసుకుని షాకయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా అతడెంతో క్రూరుడు. మూర్ఖుడు. నేను ధైర్యంగా అతడి గురించి బయటపెట్టడం చూసి చాలా మంది కూడా పోరాడటానికి సిద్ధమయ్యారు. అందుకు ఫలితంగా అతడికి శిక్ష వేయించడంలో సఫలీకృతులమయ్యాం. ఈ రోజు నేను షేర్ చేసిన నా స్టోరీ ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తుందనుకుంటున్నాను. నాలా ఎంతో మంది భ్రమలో ఉండి మోసపోయి ఉంటారు. మీరెవ్వరూ ఒంటరివారు కాదు. ధైర్యంగా ముందుకురావాలి. ఇప్పుడెందుకంటే... హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీలో ‘ట్రిగ్గర్ వార్నింగ్’ పేరిట రాసుకొచ్చిన శ్రుతి చౌదరి మీటూస్టోరీ 24 గంటల్లోపే వేల కొద్దీ లైకులు, షేర్లతో దూసుకుపోయింది. ‘ హ్యాట్సాఫ్!!! మీలా ధైర్యంగా ముందుకు రాకపోవడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఇలా చెప్పడం ద్వారా మీరు కనీసం ఒక్కరినైనా అతడి నుంచి రక్షించిన వారవుతారు. అలాకాకుండా నాకెందుకులే అనుకుని ఉంటే మరెంతో మంది అతడి బారిన పడేవారు. మీరు చాలా ధైర్యవంతురాలు’ అంటూ వందల సంఖ్యలో పురుషులు, మహిళలు శ్రుతికి మద్దుతగా నిలుస్తూ, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వివాహిత మాత్రం.. ‘ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నా భర్త నిజస్వరూపం గురించి బయటపెట్టాలని అనుకున్నాను. కానీ ధైర్యం చేయలేకపోయా. అది నిజంగా ఎంతపెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు’ అని తన బాధను వ్యక్తపరిచారు. ‘ జెంటిల్‌మేన్ ఎప్పుడూ సమ్మతం లేకుండా ఏ మహిళను కనీసం తాకరు. నిజంగా జెంటిల్‌మేన్ అయితే భార్య అయినా గర్ల్‌ఫ్రెండ్ అయినా సరే వారి నిర్ణయాన్ని తప్పక గౌరవిస్తాడు’ అంటూ దేవ్ పత్ అనే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హ్యూమన్స్ బాంబేతో పాటు నెటిజన్లు కూడా పాజిటివ్‌గా రియాక్టవ్వడం విశేషం. ఇది నాణేనికి ఒకవైపు. ఇప్పుడెందుకో.. మీ తప్పేం లేదా? ఎవరైనా ఒక అమ్మాయి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పగానే ఎదురయ్యే మొదటి, అతి సాధారణ ప్రశ్న. ఇప్పుడెందుకు ? అప్పుడేం చేశావు? అవును శ్రుతి చౌదరి చెప్పినట్టుగా ఎంతోమంది భ్రమలో పడి మోసానికి గురవుతున్నారు. తీరా ఆ విషయం గుర్తించే సరికి సమయం మించిపోవడంతో.. ఇలాంటి నెగటివిటీకి, సోకాల్డ్ పరువుకు భయపడి నోరు విప్పి నిజాలు చెప్పడం లేదు. చెబితే అప్పుడు అనుభవించిన శారీరక హింసకంటే కూడా... తనకు ఎదురవ్వబోయే మానసిక హింసను భరించడమెలాగో తెలియని భయం. ఎందుకంటే లైంగిక హింసకు గురైంది ఒక మహిళ అయితే, అత్యాచారానికి గురైంది ఓ ఆడపిల్ల అయితే సమాజం ఎప్పుడూ ఆమెను బాధితురాలిగా గుర్తించే కంటే.. ఏదో తప్పు చేసిన వ్యక్తులుగా చిత్రీకరించి ఆమెను మరింతగా కుంగదీసేందుకే ప్రయత్నిస్తోందనే భయం. కానీ శ్రుతి ఇలాంటివి చిన్న చిన్న విషయాలంటూ తేలికగా తీసుకుంది. అందరూ ఆమెలాగే ముందుకు వస్తే.. పశ్చాత్తాపం కంటే కూడా భయంతోనైనా అతడి లాంటి మేకతోలు వన్నె పులులు కాస్తైనా మారతాయనేది ఆమె ఉద్దేశం. ఒక్క శ్రుతిదే కాదు... భారత్‌లో మీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, దక్షిణాదిన ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న చిన్మయి శ్రీపాద వంటి వారి ఉద్దేశం కూడా ఇదేననేది మెజారిటీ వర్గాల అభిప్రాయం. వాళ్లే కదా జెంటిల్మెన్.. శ్రుతి పోస్టు ద్వారా చర్చనీయాంశంగా మారిన మరో అంశం వైవాహిక అత్యాచారం(మ్యారిటల్ రేప్). వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘రేప్ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. . మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభిప్రాయాన్ని.... రేప్ నిర్వచనం పూర్తిగా మారిపోయిందన్న విషయాన్ని గౌరవించాలంటున్నారు. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యతను ప్రతీ ఒక్కరు గుర్తించాలంటున్నారు. న్యాయం జరుగుతుంది కదా!! ‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చినపుడే న్యాయం జరుగుతుంది కదా’ - గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యూరోప్ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్ చేసిన వ్యాఖ్యలు -
నిర్మాతకు దిమ్మతిరిగి పోయిందిగా..!
ప్రతి చోట తోడేళ్లు ఉంటాయి.. వాటిని నుంచి తెలివిగా తప్పించుకోవడం పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు నటి శృతి మరాఠీ. హ్యూమన్స్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు తారసపడిన తోడేళ్ల గురించి.. తాను బయటపడిన విధానం గురించి చెప్పుకొచ్చారు. ‘ఒకసారి ఓ నిర్మాతను కలిశాను. ఆయన నాకు తన చిత్రంలో లీడ్ రోల్ ఇస్తానని చెప్పాడు. తొలుత చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. కానీ రానురాను తనలోని వికృత బుద్ధిని బయటపెట్టడం ప్రారంభించాడు. ముందు చాలా మర్యాదగా మాట్లాడినా తర్వాత ఒప్పుకుంటే తప్పులేదు.. ఒక్క రాత్రికే కదా అని వేధించడం ప్రారంభించాడు. అతన్ని ఊరికే వదలాలని అనిపించలేదు. తగిన సమాధానం చెప్పాలని భావించాను’ అని పేర్కొన్నారు శృతి. ‘అందుకే ‘నన్ను మీతో పడుకోమంటున్నారు.. మరి హీరో ఎవరితో పడుకుంటార’ని ప్రశ్నించాను. దాంతో అతడు షాక్ అయ్యాడు. నోటి నుంచి ఒక్క మాట వస్తే ఒట్టు. వెంటనే ఈ విషయం గురించి మిగతా వారికి చెప్పాను. దాంతో వారు ఆ నిర్మాతను ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఆ సమయంలో నేను నా గురించే కాక.. ప్రతి మహిళ తరఫున మాట్లాడినట్లు అనిపించింద’న్నారు శృతి. అంతేకాక ‘ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ తమిళ చిత్రం కోసం నేను బికిని ధరించాల్సి వచ్చింది. అప్పుడు దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం అనుకున్నాను’ అన్నారు. ‘కానీ నాకంటూ ఓ గుర్తింపు లభించిన తర్వాత జనాలు నా బికిని సీన్ల గురించి నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ఇలాంటి విమర్శలు మన ఆత్మాభిమానాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో వారికి తెలీదు. అందుకే వాటన్నింటిని పట్టించుకోవడం మానేసి నా పని మీద దృష్టి కేంద్రీకరించాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఏది ఊరికే లభించడం లేదు. ఈ రోజు నేను ఉన్న పరిస్థితికి నా పట్టుదల, కృషి తప్ప మరేది కారణం కాదు’ అని చెప్పుకొచ్చారు శృతి. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలు గెల్చుకుంది. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం.. ఆత్మవిశ్వాసంతో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. View this post on Instagram “I’ve been in this industry since I was 16 years old. Over the years I’ve been celebrated in the limelight & shamed behind the camera. People have a misconception that actors lead a comfortable life & always feel good about themselves–that’s not true. Whether we like it or not, whether we feel right or not, we have to be the best versions of ourselves. There are no ‘bad days’. I remember, early on in my career, for a south film, I was asked to wear a bikini–I agreed without thinking twice. Questions like, ‘How are you going to shoot it?’ or ‘Is it required?’ didn’t even cross my mind. I was getting an opportunity to be in a film & that’s all that mattered! Years later when I gained popularity in a Marathi show, people looked me up & stumbled upon the bikini scene. I was trolled for the way I looked & how it was shot. Do you know how much that damages your self-esteem? I put myself out there without any barriers–but I wasn’t accepted; I was objectified. I still continued working as if it didn’t bother me. But I had a dream. I’d worked so hard & was finally moving forward, I wasn’t going to let it go–just because someone else had a problem, they weren’t in my shoes & would never know what it felt like. Slowly, I made myself tougher. Once I met a producer who’d offered me a lead role. At first he was professional, but soon he began using the words, ‘compromise’ & ‘one night’. I couldn’t let this slip so I asked him, ‘If you want me to sleep with you, who are you making the hero sleep with?’ He was stunned. I immediately informed others of his behaviour & they asked him to leave the project. All it took was one minute of being fearless–that day, I didn’t just stand up for me... I stood up for every woman who’s been objectified & judged for simply being who she is; for simply being ambitious. Why should the archaic rules of society & today's so-called modern world stop me? My clothes don’t define me–my talent does, my hard work does, my success does & I think it’s high time, people realise that.” ----- HoB with #FlipOnErosNow brings to you stories of people who have dealt with uncertainties and insecurities that life throws your way and have emerged triumphant A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on Apr 4, 2019 at 5:28am PDT -
ఆత్మవిమర్శ కోసం అడవికి!
ముంబై: యువకుడిగా ఉన్న రోజుల్లో తాను ప్రతీ దీపావళికి ఐదు రోజులపాటు అడవిలోకి ఒంటరిగా వెళ్లి ఆత్మవిమర్శ చేసుకునేవాడినని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆ అలవాటు కారణంగానే తనకు ఇప్పటికీ జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తోందని తెలిపారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజీకి ఇచ్చిన ఇంట ర్వ్యూలో మోదీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలను ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ బుధవారం ప్రచురించింది. అందులో కొంత భాగాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఆ రోజుల్లో ప్రతీ దీపావళికి నేను ఐదు రోజులపాటు దూరంగా వెళ్లే వాణ్ని. అడవిలో ఏదో ఒక చోట, ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు తప్ప మనుషులు ఉండరో అక్కడకు చేరుకునే వాణ్ని. ఇన్నాళ్లూ ఏం చేశాను, ఇకపై ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ పని చేయాలి తదితర అన్ని విషయాలపై అంతర్మథనం చేసుకునే వాడిని. నేను వెళ్లిన చోట వార్తా పత్రికలు కానీ, రేడియో కానీ ఉండేది కాదు. ఇక టీవీ, ఇంటర్నెట్ ఆ రోజుల్లో అసలు లేనే లేవు’ అని అన్నారు. యువత సమయం కేటాయించుకోవాలి ఈనాటి యువత కాస్తంత తీరిక కూడా లేకుండా తమ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, వారు కూడా ఎప్పుడో ఒకసారి కొంత సమయాన్ని కేటాయించుకుని అంతర్మథనం చేసుకోవాలని మోదీ కోరారు. అలా చేయడం వల్ల యువత ఆలోచనా దృక్పథం మారుతుందనీ, వారికా వారే బాగా అర్థమవుతారనీ, మరింత ఆత్మవిశ్వాసం రావడంతోపాటు ఇతరులు మీ గురించి ఏమనుకున్నా చలించని మనస్తత్వం అలవడుతుందన్నారు. ఏం చేయాలో తెలీక హిమాలయాలకు.. చిన్నతనంలోనే తాను రెండేళ్లపాటు హిమాలయాలకు వెళ్లిన విషయంపై కూడా మోదీ చెప్పారు. ‘నేను జీవితంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏ మార్గాన్నీ ఎంచుకోలేదు. అంతా అస్పష్టతే. నేను ఎక్కడికి వెళ్లాలో నాకే తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఎందుకు చేయాలో తెలీదు. కానీ ఏదో ఒకటి చేయాలన్నది మాత్రమే నాకు అప్పుడు తెలుసు. కాబట్టి నాకు నేనుగా భగవంతుడికి అంకితమయ్యాను. 17 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లాను. ఆ తర్వాత దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లాను’ అంటూ మోదీ తన గతం గురించి గుర్తుచేసుకున్నారు. ‘నా జీవితం ఎటు వెళ్లాలో నిర్ణయమవ్వని దశ అది. అయినా అనేక ప్రశ్నలకు జవాబులు దొరికాయి. ప్రపంచాన్ని, నన్ను నేను అర్థం చేసుకున్నా. రామక్రిష్ణ మిషన్‌లో కా లం గడిపా. నాలో నేనే ఏదో కొత్తది కను గొన్నా. బ్రహ్మ ముహూర్తంలోనే, వేకువ జాము న3–3.45 మధ్యలో నిద్రలేచి, గడ్డకట్టే నీటితోనే హిమాలయాల్లో స్నానం చేసే వాడిని. శాంతి, ఏకాంతం, ధ్యానాన్ని ఒక జలధార శ బ్దంలోనూ మనం పొందొచ్చని అర్థం చేసుకున్నా. ప్రకృతి తరంగాలతో ఎలా మమేకమవ్వాలో అక్కడి సాధువులు నేర్పారు’ అని చెప్పారు. ఎర్రకోటలో నేతాజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మోదీ -
ఈ చిన్నారి.. నెటిజన్ల హృదయాలు గెలిచింది
పుట్టగానే తల్లిని కోల్పోయింది... ఇంకో ఇరవై రోజులు గడవకముందే తండ్రి కూడా ఆమెకు దూరమయ్యాడు... అన్నీ కోల్పోయినా ఆ చిన్నారిని దేవుడు మరోసారి చిన్నచూపు చూశాడు.. బుడిబుడి అడుగులు వేయాల్సిన వయసులో నడవలేని పరిస్థితి కల్పించాడు.. అయినా ఆ చిన్నారి మోముపై చిరునవ్వు చెరగలేదు.. ఆ చిరునవ్వే నేడు ఆమెను సమస్య నుంచి బయటపడేలా చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియా అంటే కేవలం అనవసరపు చర్చలు, ట్రోలింగ్స్‌కు మాత్రమే వేదిక అనే భావనను తప్పని మరోసారి నిరూపించింది. ఆరుషి మహారాష్ట్రలోని సతారాకు చెందిన చిన్నారి. 70 ఏళ్ల బామ్మా తాతయ్య, కవల సోదరుడితో కలిసి జీవిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆరుషికి ఏడాది వయసు ఉన్నపుడు కాన్జెన్షియల్ సుడత్రాసిస్(కాలి ఎముక వంగిపోవడం) అటాక్ అయింది. అప్పటికే కొడుకు కోడలిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆరుషి బామ్మాతాతయ్యలు ఈ ఘటనతో మరింత కుంగిపోయారు. ఆరుషి కూడా అందరు చిన్నారుల్లాగే లేడి పిల్లలా గెంతాలంటే ఆపరేషన్ చేయించాలని.. అందుకోసం 16 లక్షల రూపాయలు అవసరమని తెలిసి హతాశయులయ్యారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ వృద్ధ దంపతులకు ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అండగా నిలిచింది. వారి కన్నీటి గాథను తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో పాటు ఆరుషి కోసం ఫండ్‌రైజింగ్ క్యాంపెయిన్ని ఏర్పాటు చేసింది. కాలికి పింక్ బ్యాండేజ్ ఉన్న చిన్నారి ఆరుషి ఎంతో హృద్యంగా నవ్వుతున్న ఫొటోతో కూడిన ఈ పోస్టు నెటిజన్ల హృదయాలను కదిలించింది. అందుకే 980 మంది దాతలు ముందుకొచ్చి కేవలం ఆరు గంటల్లోనే ఆరుషి ఆపరేషన్‌కు కావాల్సిన 16 లక్షల రూపాయలు సమకూర్చారు. సోషల్ మీడియా పవరేంటో మరోసారి నిరూపించారు.